- Telugu News Photo Gallery People with such health problems should not eat onions, check here is details in Telugu
Side Effects of Onions: ఉల్లి పాయలను ఎవరెవరు తింటే మంచిది కాదు..
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. అది నిజమే.. ఎందుకంటే ఉల్లి పాయల్లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఉల్లి పాయలను కూరతో కలిపి తీసుకున్నా.. లేక పచ్చివి తిన్నా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ ఉల్లి పాయల్లో పొటాషియం అనేది సమృద్ధిగా ఉంటుంది. చిన్న వారి నుంచి పెద్ద వారి దాకా ఎలాంటి ఆలోచనలు లేకుండా ఉల్లి పాయలను తినవచ్చు. శరీరంలో ఉండే అనేక అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవడానికి ఉల్లి పాయలు తీసుకుంటే ఎంతో ఉపయోగం. అయితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధ పడేవారు మాత్రం..
Chinni Enni | Edited By: Ravi Kiran
Updated on: Nov 28, 2023 | 8:15 PM

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. అది నిజమే.. ఎందుకంటే ఉల్లి పాయల్లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఉల్లి పాయలను కూరతో కలిపి తీసుకున్నా.. లేక పచ్చివి తిన్నా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ ఉల్లి పాయల్లో పొటాషియం అనేది సమృద్ధిగా ఉంటుంది. చిన్న వారి నుంచి పెద్ద వారి దాకా ఎలాంటి ఆలోచనలు లేకుండా ఉల్లి పాయలను తినవచ్చు. శరీరంలో ఉండే అనేక అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవడానికి ఉల్లి పాయలు తీసుకుంటే ఎంతో ఉపయోగం.

అయితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధ పడేవారు మాత్రం ఉల్లి పాయలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఎలాంటి సమస్యలు ఉన్న వారు ఉల్లి పాయలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

గర్భవతులు సాధ్యమైనంత వరకు ఉల్లి పాయలకు దూరంగా ఉండాలి. ఉల్లిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడే వారు కూడా తినకూడదు.

ఉల్లి పాయలు ఎక్కువగా తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ ఎక్కువగా తగ్గి పోతాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్న వారు వీటికి దూరంగా ఉండండి. తక్కువగా తీసుకుంటే బెటర్. అంతే కాకుండా అతిగా ఉల్లి పాయలు తినడం వల్ల కొన్ని రకాల అలెర్జీలు కూడా వచ్చే అవకాశం ఉంది.

అలాగే నిత్యం ఉల్లి పాయలను తీసుకునేవారు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. లిమిట్ గా తీసుకుంటేనే ఏదైనా దివ్యౌషధంగా పని చేస్తుంది. ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఉన్న వారు సైతం ఉల్లి పాయల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వైద్యులను సంప్రదించి తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.





























