- Telugu News Photo Gallery Cricket photos From Daryl Mitchell to Rachin Ravindra these 5 players may get highest bid in IPL 2024 Auction
IPL 2024: ఐపీఎల్ 2024 వేలంలో అత్యధిక ధర పొందే ఐదుగురు ఆటగాళ్లు.. లిస్టులో వరల్డ్ కప్ 2023 సంచలనం..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 వేలం డిసెంబర్ 19న దుబాయ్‌లో జరగనుంది. చాలా మంది ఆటగాళ్లు IPL వేలంలో మొదటిసారి నామినేట్ కానున్నారు. అయితే, కొంతమంది లెజెండ్‌లు సుదీర్ఘ విరామం తర్వాత ఈ రిచ్ లీగ్‌లోకి తిరిగి రానున్నారు. IPL 2024 వేలానికి ముందు, రాబోయే వేలంలో IPL అత్యధిక బిడ్ పొందే ఆటగాళ్ల జాబితాను ఓసారి చూద్దాం..
Updated on: Nov 29, 2023 | 9:41 AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 వేలం డిసెంబర్ 19న దుబాయ్‌లో జరగనుంది. చాలా మంది ఆటగాళ్లు IPL వేలంలో మొదటిసారి నామినేట్ కానున్నారు. అయితే, కొంతమంది లెజెండ్‌లు సుదీర్ఘ విరామం తర్వాత ఈ రిచ్ లీగ్‌లోకి తిరిగి రానున్నారు. IPL 2024 వేలానికి ముందు, రాబోయే వేలంలో IPL అత్యధిక బిడ్ పొందే ఆటగాళ్ల జాబితాను ఓసారి చూద్దాం..

1. డారిల్ మిచెల్: కివీస్‌కు డెరిల్ మిచెల్ ఓ సంచలనం. అతను ప్రపంచ కప్ 2023లో టాప్ 5 పరుగులు చేసిన లిస్టులో నిలిచాడు. జట్టుకు కీలక సమయాల్లో వికెట్లు తీయగల సామర్థ్యం కూడా అతనికి ఉంది. అతని ఆల్ రౌండ్ నైపుణ్యాల కారణంగా, మిచెల్‌కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా, మిచెల్ రాజస్థాన్ రాయల్స్ (RR) కోసం రెండు IPL 2022 గేమ్‌లలో పాల్గొన్నాడు.

2. రచిన్ రవీంద్ర: టాలెంటెడ్ న్యూజిలాండ్ బ్యాటర్ ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో రచిన్ రవీంద్ర 10 ఇన్నింగ్స్‌లలో 578 పరుగులతో అత్యధిక రన్ స్కోరర్‌లలో ఒకడిగా నిలిచాడు. విధ్వంసక బ్యాటర్, సమర్థుడైన బౌలర్‌గా పేరుగాంచిన ఈ లెఫ్ట్ హ్యాండర్.. ఇంకా ఏ IPL సీజన్‌లోనూ కనిపించలేదు. అతను ఏ జట్టు నుంచి అరంగేట్రం చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

3. మిచెల్ స్టార్క్: మిచెల్ స్టార్క్ ఐపీఎల్ ఆడకుండా దూరంగా ఉన్నాడు. అయితే, ఈసారి ఐపీఎల్ 2024 వేలంలో తనను తాను నామినేట్ చేసుకోనున్నాడు. స్టార్క్ టీ20 ఫార్మాట్‌లో 73 వికెట్లు తీశాడు. చాలా టీమ్‌లు ఈ ప్లేయర్ కోసం పోటీపడతాయనడంలో సందేహం లేదు. స్టార్క్ చివరిసారిగా ఐపీఎల్ 2015లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు.

4. ట్రావిస్ హెడ్: 2023 వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ తన ఆల్ రౌండ్ సామర్థ్యాన్ని ప్రదర్శించాడు. ఇందులో యాభై పరుగులు చేసి రెండు వికెట్లు తీశాడు. అతను రాబోయే IPL వేలంలో తన పేరు చేర్చాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఈ ఆల్ రౌండర్‌ను జట్టులోకి తీసుకోవాలని అన్ని జట్లు కోరుకుంటున్నాయి.

5. గెరాల్డ్ కోయెట్జీ: IPL 2024 వేలంలో గెరాల్డ్ కోయెట్జీ ప్రధాన ఆకర్షణగా మారనున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్ 6.23 ఎకానమీతో 20 వికెట్లు పడగొట్టాడు. Coetzee గొప్ప లైన్, లెన్త్‌తో క్లీన్ రన్-అప్‌ని కలిగి ఉన్నాడు. ఈ ప్లేయర్ రాబోయే వేలంలో భారీ ధరను దక్కించుకునే అవకాశం ఉంది.




