- Telugu News Photo Gallery Cricket photos Pakistan may not be hosting icc champions trophy 2025 dubai will host icc event in hybrid model
Champions Trophy: పాకిస్తాన్‌కు భారీ షాక్.. మారనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 వేదిక.. టోర్నీ జరిగేది ఎక్కడంటే?
ICC Champions Trophy 2025: ఈసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ భారీ ICC టోర్నమెంట్ 2025లో నిర్వహించనున్నారు. భారత్‌తో పాటు అన్ని దేశాలు పాకిస్థాన్‌ను సందర్శించాల్సి ఉంది. అయితే, రాజకీయ, భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టు ఇంకా పాకిస్థాన్‌కు వెళ్లలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా భారత ప్రభుత్వం, బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
Updated on: Nov 29, 2023 | 9:07 AM

ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు (Pakistan Cricket Team) చాలా పేలవ ప్రదర్శనతో అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ టోర్నమెంట్‌లో పాక్ జట్టు 9 మ్యాచ్‌లు ఆడగా, అందులో పాకిస్థాన్ జట్టు కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. 5 మ్యాచ్‌ల్లో బాబార్ సేన ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

ప్రపంచకప్‌లో ఇలాంటి ప్రదర్శన జట్టుకు, దేశానికి పెద్ద షాక్‌గా మారింది. ఈ షాక్ నుంచి ఇంకా కోలుకోని పాకిస్థాన్.. ప్రస్తుతం మరో పెద్ద షాక్‌ను ఎదుర్కొనే అవకాశం ఉంది. వాస్తవానికి, ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (ICC Champions Trophy 2025) ఆతిథ్యాన్ని పాకిస్తాన్ నుంచి లాక్కోవచ్చని నివేదికలు వస్తున్నాయి.

మీడియా నివేదికల ప్రకారం, ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యం పాకిస్తాన్ చేతుల నుంచి వెనక్కి తీసుకోవచ్చు లేదా హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించవచ్చు అని తెలుస్తోంది. నిజానికి భారత ప్రభుత్వ కఠిన వైఖరే ఇందుకు కారణంగా నిలిచింది. భారత క్రికెట్ జట్టును పాకిస్థాన్‌లో పర్యటించేందుకు ప్రభుత్వం ఇప్పటికీ అనుమతించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఆసియాకప్ లాంటి తటస్థ వేదికపై జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.

తటస్థ వేదిక కింద, పాకిస్థాన్ జట్టు తమ దేశంలోని ఇతర జట్లతో మ్యాచ్‌లు ఆడవచ్చు. కానీ, అది భారత జట్టుతో ఆడాలంటే మాత్రం, మ్యాచ్ వేరే దేశంలో ఆడాల్సి ఉంటుంది. ఇటీవల ఆసియా కప్ 2023లో ఇది కనిపించింది. శ్రీలంకలో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. కాగా, పాకిస్థాన్ జట్టు స్వదేశంలో ఇతర జట్లతో తలపడింది.

ఈసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ భారీ ICC టోర్నమెంట్ 2025లో నిర్వహించనున్నారు. భారత్‌తో పాటు అన్ని దేశాలు పాకిస్థాన్‌ను సందర్శించాల్సి ఉంది. అయితే, రాజకీయ, భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టు ఇంకా పాకిస్థాన్‌కు వెళ్లలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా భారత ప్రభుత్వం, బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.




