- Telugu News Photo Gallery Cricket photos Mumbai Indians Bowler Piyush Chawla Completes 1000 Wickets In Competitive Cricket check full stats and records
Piyush Chawla: 1000 వికెట్ల క్లబ్‌లో చేరిన రోహిత్ టీంమేట్.. అరుదైన లిస్టులో పియూష్ చావ్లా..
Vijay Hazare Trophy 2023: టీమ్ ఇండియా మాజీ గూగ్లీ స్పిన్నర్, ప్రస్తుతం ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న పీయూష్ చావ్లా తన కెరీర్‌లో మరో మైలురాయిని చేరుకున్నాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక రికార్డును లిఖించుకున్నాడు. మొత్తంగా 1000 వికెట్లతో తన పేరిట అద్భుతమైన రికార్డును కూడా రాసుకున్నాడు.
Updated on: Nov 28, 2023 | 7:44 PM

టీమిండియా మాజీ గూగ్లీ స్పిన్నర్, ప్రస్తుతం ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న పీయూష్ చావ్లా తన కెరీర్‌లో 1000 వికెట్లు పూర్తి చేసిన రికార్డును లిఖించాడు.

ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో గుజరాత్ తరపున ఆడుతున్న పీయూష్ చావ్లా.. అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 ఓవర్లు బౌలింగ్ చేసి 30 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 1 ఓవర్ మెయిడిన్ కూడా ఉంది. దీంతో తన క్రికెట్ కెరీర్‌లో 1000 వికెట్లు పూర్తి చేసుకున్నాడు.

పీయూష్ చావ్లా తన ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 445 వికెట్లు, టీ20 క్రికెట్‌లో 302 వికెట్లు, లిస్ట్-ఎ క్రికెట్‌లో 254 వికెట్లు తీశాడు. దీంతో ఇప్పుడు అతని పేరిట 1001 వికెట్లు నమోదయ్యాయి.

ఐపీఎల్ 2023 వేలంలో అతడిని ముంబై ఇండియన్స్ 50 లక్షలకు కొనుగోలు చేసింది. దీని తర్వాత, అతను IPL 2023లో కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. ముంబై తరపున 16 మ్యాచ్‌లలో 18 వికెట్లు పడగొట్టాడు.

పీయూష్ చావ్లా భారత్ తరనెన మూడు ఫార్మాట్లలో క్రికెట్ ఆడాడు. అతను 2006లో టీమ్ ఇండియా తరపున తన తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు. అయితే గత 12 ఏళ్లుగా చావ్లాకు టీమ్ ఇండియాలో అవకాశం రాలేదు. చావ్లా భారత్ తరపున 2 టెస్టులు, 25 వన్డేలు, 7 టీ20లు ఆడాడు.





























