అర్థరాత్రి విపరీతంగా దాహం వేస్తోందా.? నిర్లక్ష్యం చేయకండి.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..
అర్ధరాత్రి దాహం అనిపించడం సాధారణమే, కానీ మీరు అధిక దాహం కారణంగా ప్రతిరోజూ నిద్రకు భంగం కలుగుతుందని ఇబ్బంది పడితే మాత్రం.. అది ఆందోళనకరమైన పరిస్థితిగా అర్థం చేసుకోవాలి.. వైద్యులు చెబుతున్న దాని ప్రకారం నిద్రలో దాహం వివిధ వ్యాధుల ప్రారంభ లక్షణం. ఇది ప్రతిరోజూ జరిగితే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం అవసరం. అర్ధరాత్రి విపరీతంగా దాహం వేయడానికి అనేక కారణాలను ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
రాత్రి నిద్ర అంటే అందరికీ ఇష్టం. రాత్రివేళ హాయిగా నిద్రపోతుంటే..ఎవరైనా అంతరాయం కలిగిస్తే ఎవరూ ఇష్టపడరు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే, కొన్నిసార్లు కొంతమందికి అర్ధరాత్రి తీవ్రమైన దాహం అనిపిస్తుంటుంది.. ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది. మీరు ఈ రకమైన తీవ్రమైన దాహాన్ని అనుభవించినప్పుడు, కొన్నిసార్లు మీకు విపరీతంగా చెమట కూడా పడుతుంది. మీ గొంతు పొడిగా మారుతుంది. అయితే, ఇలా అర్ధరాత్రి దాహం వేయడానికి కారణం ఏమిటి? అన్నది ఎప్పుడైనా ఆలోచించారా..?
అర్ధరాత్రి దాహం అనిపించడం సాధారణమే, కానీ మీరు అధిక దాహం కారణంగా ప్రతిరోజూ నిద్రకు భంగం కలుగుతుందని ఇబ్బంది పడితే మాత్రం.. అది ఆందోళనకరమైన పరిస్థితిగా అర్థం చేసుకోవాలి.. వైద్యులు చెబుతున్న దాని ప్రకారం నిద్రలో దాహం వివిధ వ్యాధుల ప్రారంభ లక్షణం. ఇది ప్రతిరోజూ జరిగితే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం అవసరం. అర్ధరాత్రి విపరీతంగా దాహం వేయడానికి అనేక కారణాలను ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
1. నూనె, మసాలాలు అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల గొంతు పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. దీంతో రాత్రి పూట దాహం వేస్తుంది. నూనె మరియు మసాలా దినుసులను అధికంగా తీసుకోవడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి.
2. కొందరు నిద్రిస్తున్నప్పుడు నోటి ద్వారా శ్వాస తీసుకుంటారు. ఉబ్బసం ఉన్నవారు ముక్కుకు బదులుగా నోటి ద్వారా శ్వాస తీసుకుంటారు. ప్రత్యేకించి వారికి జలుబు లేదా ముక్కు మూసుకుపోయినప్పుడు. దీనివల్ల నోటి లోపలి భాగం సులభంగా ఎండిపోతుంది. దీంతో అర్ధరాత్రి దాహం ఎక్కువవుతుంది.
3. రాత్రి నిద్రలో గొంతు పొడిబారడానికి డీహైడ్రేషన్ కారణం కూడా ఒకటి. శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు గొంతు పొడిబారుతుంది. నిర్జలీకరణం తీవ్రంగా ఉంటే, అది మరణానికి దారి తీస్తుంది.
4. నోటిలో లాలాజలం తగ్గడం లేదా జిరోస్టోమియా కూడా కొన్ని తీవ్రమైన వ్యాధుల లక్షణం. దీనితో బాధపడేవారికి రాత్రిపూట దాహం ఎక్కువగా ఉంటుంది.
5. ధూమపానం, మద్యం ఎక్కువగా సేవించే వ్యక్తులు రాత్రిపూట అధిక దాహంతో బాధపడవచ్చు. రోజూ స్మోక్, ఆల్కహాల్ తాగేవారిలో 39 శాతం మంది లాలాజల ఉత్పత్తి తగ్గినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఆల్కహాల్ నిర్జలీకరణానికి దారితీస్తుంది. దీంతో మీకు దాహం వేస్తుంది.
6. అధిక రక్తపోటు ఉన్నవారిలో, విపరీతమైన చెమట కారణంగా శరీరం డీహైడ్రేట్ అవుతుంది. ఇది గొంతు పొడిబారడానికి కారణమవుతుంది. అర్ధరాత్రి దాహం వేస్తుంది.
7. ఆరోగ్యవంతమైన పెద్దలు రోజూ 8 నుండి 10 గ్లాసుల నీరు తాగాలి. పగటిపూట తక్కువ నీరు తాగితే, రాత్రిపూట శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. కాబట్టి క్రమం తప్పకుండా నీరు తాగాలి.
8. టీ, కాఫీలు ఎక్కువగా తీసుకోవడం.
భారతదేశంలో టీ, కాఫీలు తాగే వారు చాలా మంది ఉన్నారు. కానీ ఇది ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది. ఈ పానీయాలలో కెఫిన్ అధిక స్థాయిలో ఉండటం వల్ల శరీరంలో డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. దీంతో రాత్రిపూట విపరీతమైన దాహం వేస్తుంది.
9. ఉప్పు అధికంగా వాడటం.
ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 5 గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలి. ఇంతకంటే ఎక్కువగా తీసుకుంటే శరీరానికి హాని కలుగుతుంది. ఉప్పులో సోడియం ఉంటుంది, ఇది నిర్జలీకరణానికి కారణమవుతుంది, కాబట్టి మీరు తరచుగా రాత్రిపూట చాలా దాహం వేస్తారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..