AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Desi Jugaad: వారెవ్వా.. ఆఖరుకు బైకును ఇలా కూడా వాడొచ్చా..? వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

ఇకపోతే, గ్రామాలలో జుగాడ్‌ ప్రబలంగా ఉంది. ఇక్కడ ప్రజలు ట్రాక్టర్లు, బైక్‌లతో అద్భుతాలు చేస్తారు. అలాంటివి చూసినప్పుడు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతారు. వారు దీన్ని ఎలా చేసారబ్బా.?అనుకుంటూ ముక్కున వేలేసేకుంటారు.. అలాంటి ట్రిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్‌ అవుతున్న వీడియోలో బైక్ సహాయంతో చెరువు నుండి నీటిని తోడుతున్నారు. వినడానికి వింతగా అనిపించినప్పటికీ ఇది 100శాతం నిజమేనండోయ్‌..

Watch Desi Jugaad: వారెవ్వా.. ఆఖరుకు బైకును ఇలా కూడా వాడొచ్చా..? వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Motorbike To Remove Water
Jyothi Gadda
| Edited By: TV9 Telugu|

Updated on: Nov 28, 2023 | 12:39 PM

Share

దేశీ జుగాద్ విషయంలో భారతీయుల లెక్కలేనన్ని మంత్రాలుంటాయి.. ఎందుకంటే ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయేలా ఫీట్లు చేస్తారు మన దేశీజుగాడ్‌లు. ఇకపోతే, గ్రామాలలో జుగాడ్‌ ప్రబలంగా ఉంది. ఇక్కడ ప్రజలు ట్రాక్టర్లు, బైక్‌లతో అద్భుతాలు చేస్తారు. అలాంటివి చూసినప్పుడు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతారు. వారు దీన్ని ఎలా చేసారబ్బా.?అనుకుంటూ ముక్కున వేలేసేకుంటారు.. అలాంటి ట్రిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్‌ అవుతున్న వీడియోలో బైక్ సహాయంతో చెరువు నుండి నీటిని తోడుతున్నారు. వినడానికి వింతగా అనిపించినప్పటికీ ఇది 100శాతం నిజమేనండోయ్‌..

చెరువులోని నీటిని తీయడానికి మోటార్‌సైకిల్‌ను ఉపయోగించడం మీరు చాలా అరుదుగా చూసి ఉంటారు. అదేలాగో… వైరల్ క్లిప్‌లో బైక్ ఇంజిన్‌కు టర్బోను కనెక్ట్ చేయడం ద్వారా చెరువు నుండి నీటిని పైకి తోడుతున్నారు. ఒక్కసారి వీడియో చూసి ఈ జుగాద్ అంటే ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో Instagram పేజీ @makhankhokhar_vlog నుండి పోస్ట్‌ చేశారు. ఇది ఇప్పటివరకు 21 వేలకు పైగా లైక్‌లు, 8 లక్షలకు పైగా వీక్షణలను కూడా వచ్చాయి. అలాగే, చాలా మంది వినియోగదారులు కూడా వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

ఇక వీడియో చూసిన ఒక వినియోగదారు ఇలా రాశారు.. భారతీయుడిగా గర్విస్తున్నానంటూ మరొకరు చెప్పారు. బైక్ మీరు దుర్వినియోగం చేస్తున్నారంటూ ఇంకొందరు కామెంట్ చేశారు. మరికొందరు టర్బోను ఇలా ఉపయోగిస్తారని అనుకోలేదంటూ వ్యాఖ్యానించారు. మొత్తానికి వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..