చలికాలంలో నీటిని వేడి చేయడానికి దేశీ జుగాడ్.. కరెంటు బిల్లు అసలే రాదు..! అదేలాగో వీడియో చూసేయండి..
రాగి పైపును వాటర్ ట్యాప్‌కు కనెక్ట్ చేశాడు.. అప్పుడు దానిని స్ప్రింగ్ లాగా తిప్పి..ఈ రౌండ్ భాగం గ్యాస్ బర్నర్‌పై పెట్టాడు. పైపు మరో కొనను టబ్‌లో వేశాడు. ఇప్పుడు కుళాయి ఆన్ చేయటంతో పైపు ద్వారా నీరు తిరుగుతూ టబ్‌లో పడుతోంది. కానీ ఈ సమయంలో, నీరు గ్యాస్‌పై ఉన్న భాగంలో తిరుగుతుంది. ఆ సమయంలోనే నీళ్లు వెడేక్కి నేరుగా టబ్‌లోకి వస్తున్నాయి. కొంతమంది ఈ జుగాడ్ ప్రభావవంతంగా పనిచేస్తుందని, విద్యుత్ ఆదా చేయడానికి సరైన మార్గంగా మరికొందరు చెబుతున్నారు.
వాతావరణ నమూనాలు మారిపోయాయి. చలి ఒక్కసారిగా పెరిగింది. పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో వేడినీరు, ఉన్ని వస్త్రాలకు డిమాండ్ పెరుగుతోంది. కొద్దిరోజుల క్రితం అందరూ చల్లటి నీళ్లతో స్నానం చేసేవారు. కానీ, ఇప్పుడు అందరికీ వేడి నీళ్లే కావాలి. అయితే, సోషల్ మీడియా ప్రపంచంలో కొంతమంది జుగాడ్‌లు ఇలాంటి చలి కాలాన్ని తట్టుకునేలా అద్భుతమైన పనిని చేసారు. సోషల్ మీడియా ద్వారా అద్భుతమైన పరిష్కారం దొరికింది. అది చూస్తే మీరు కూడా షాక్ అవ్వాల్సిందే.. ఇది ఒక జుగాడ్ తయారు చేసిన దేశీ గీజర్!
వైరల్ అవుతున్న వీడియో చూసిన తర్వాత కొంత మంది దీనిని ‘దేశీ గీజర్’ అని పిలుస్తున్నారు. కేవలం ఒక రాగి పైపుతో తయారు చేసిన ఈ గీజర్ అద్భుతంగా పనిచేస్తుంది. దీంతో నీరు నిమిషాల్లో వేడేక్కుతున్నాయి.
ఈ వైరల్ ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో, రాగి పైపును వాటర్ ట్యాప్‌కు కనెక్ట్ చేశాడు.. అప్పుడు దానిని స్ప్రింగ్ లాగా తిప్పి..ఈ రౌండ్ భాగం గ్యాస్ బర్నర్‌పై పెట్టాడు. పైపు మరో కొనను టబ్‌లో వేశాడు. ఇప్పుడు కుళాయి ఆన్ చేయటంతో పైపు ద్వారా నీరు తిరుగుతూ టబ్‌లో పడుతోంది. కానీ ఈ సమయంలో, నీరు గ్యాస్‌పై ఉన్న భాగంలో తిరుగుతుంది. ఆ సమయంలోనే నీళ్లు వెడేక్కి నేరుగా టబ్‌లోకి వస్తున్నాయి. కొంతమంది ఈ జుగాడ్ ప్రభావవంతంగా పనిచేస్తుందని, విద్యుత్ ఆదా చేయడానికి సరైన మార్గంగా మరికొందరు చెబుతున్నారు.
View this post on Instagram
ఈ వీడియో నవంబర్ 21న Instagram పేజీ @beaverart.engineer1 నుండి పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న వీడియోకి 16.4 మిలియన్ వీక్షణలు (1 కోటి కంటే ఎక్కువ) మిలియన్ల కొద్దీ లైక్‌లు వచ్చాయి. అలాగే, చాలా మంది వినియోగదారులు వీడియోపై తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.
కొంతమంది వినియోగదారులు ఈ కుర్రాడి జుగాడ్‌ను ప్రశంసించగా, మరికొందరు వాటర్ కొనుకోవటం మంచిదని సూచిస్తున్నారు. మరి కొంతమంది వినియోగదారులు దీనిని గ్యాస్ వ్యర్థం అని అంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..