Viral News: 80 ఏళ్ల బామ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్న 57 ఏళ్ల వ్యక్తి.. ఆస్తికోసమే అంటున్న వృద్ధురాలి కుమార్తెలు

కాలిఫోర్నియా నివాసి 57 ఏళ్ల డేవిడ్‌కు సొంత ఇల్లు లేదు. పర్మినెంట్ ఉద్యోగం కూడా లేదు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ పార్క్ లో జీవిస్తూ జీవితాన్ని గడిపేస్తున్నాడు. ఇతరుల ఇళ్లలో పాడైపోయిన వస్తువులను బాగు చేసి అలా వచ్చిన డబ్బులతో జీవితాన్ని వెళ్లదీస్తున్నాడు డేవిడ్. ఈ నేపథ్యంలో డేవిడ్ కు 80 ఏళ్ల కరోలిన్‌తో పరిచయం ఏర్పడింది. ప్రేమలో పడ్డారు. కొద్ది వారాల్లోనే వీరి ప్రేమ ముదిరి పాకాన పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

Viral News: 80 ఏళ్ల బామ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్న 57 ఏళ్ల వ్యక్తి.. ఆస్తికోసమే అంటున్న వృద్ధురాలి కుమార్తెలు
Dave Pledged And CarolynImage Credit source: BBC
Follow us
Surya Kala

|

Updated on: Nov 27, 2023 | 8:07 PM

సృష్టిలో ప్రేమ అపురూపం.. ప్రేమకు వయసు, జాతి మత బేధం లేదు. పేదవారు, ధనవంతులు అన్న బేధం చూడడు ప్రేమ. అంతేకాదు ప్రేమ వయస్సు చూడదు అంటూ ఎందరో ప్రేమికులు నిరూపిస్తున్నారు. ఇప్పటికే తమ కంటే పెద్దవారైన మహిళలను ప్రేమించి పెళ్లి చేసుకునే యువకులున్నారు. అదే విధంగా తమకంటే వయసులో పెద్దవారైన పురుషులను ప్రేమించి పెళ్లి చేసుకునే బాలికలున్నారు. ప్రపంచవ్యాప్తంగా తరచుగా వెలుగులోకి వస్తున్న ఉందంతాలు అనేకం ఉన్నాయి. తాజాగా ఇలాంటి వింత ప్రేమ ఒకటి సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. ఈ ప్రేమ గురించి తెలియ‌గానే ప్ర‌జ‌లు అవాక్క‌వుతున్నారు. విషయమేంటంటే .. 57 ఏళ్ల వ్యక్తి తనకంటే 23 ఏళ్లు పెద్దదైన మహిళ అంటే 80 ఏళ్ల వృద్ధురాలిని  ప్రేమించాడు. అనంతరం వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ వింత వివాహం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ వ్యక్తి పేరు డేవిడ్ ఫౌటే కాగా, మహిళ పేరు కరోలిన్ హాలండ్ . ఆమెకు 80 ఏళ్లు.

డైలీ స్టార్ కథనం ప్రకారం కాలిఫోర్నియా నివాసి 57 ఏళ్ల డేవిడ్‌కు సొంత ఇల్లు లేదు. పర్మినెంట్ ఉద్యోగం కూడా లేదు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ పార్క్ లో జీవిస్తూ జీవితాన్ని గడిపేస్తున్నాడు. ఇతరుల ఇళ్లలో పాడైపోయిన వస్తువులను బాగు చేసి అలా వచ్చిన డబ్బులతో జీవితాన్ని వెళ్లదీస్తున్నాడు డేవిడ్. ఈ నేపథ్యంలో డేవిడ్ కు 80 ఏళ్ల కరోలిన్‌తో పరిచయం ఏర్పడింది. ప్రేమలో పడ్డారు. కొద్ది వారాల్లోనే వీరి ప్రేమ ముదిరి పాకాన పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి చేసుకున్న అనంతరం కరోలిన్ మరణించడంతో పలు ఆరోపణలు వినిపిపించాయి.

నివేదికల ప్రకారం కరోలిన్ చాలా డబ్బు ఉన్న మహిళ. వృద్ధురాలికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. అయితే డేవిడ్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ఇప్పుడు ఆ ఇద్దరు కుమార్తెలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు డేవిడ్ తమ తల్లిని ప్రలోభపెట్టి డబ్బును స్వాహా చేశాడని..ఆరోపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

5 కోట్ల రూపాయల విలువైన తన ఆస్తిని అమ్మి మొత్తం డబ్బును డేవిడ్‌కు ఇస్తానని తమ తల్లి హామీ ఇచ్చిందని.. అయితే ఇంతలో కరోలిన్ ఆరోగ్యం క్షీణించి కొద్దిసేపటికే చనిపోయిందని కరోలిన్ ఇద్దరు కుమార్తెలు పేర్కొన్నారు. తల్లి మరణించిన తర్వాత ఆమె ఆస్తిపై హక్కుని ఆమె ఇద్దరు కుమార్తెలకు దక్కింది.  అంతేకాదు తమ తల్లి ఆస్తిలో పైసా కూడా డేవిడ్ కు ఇవ్వమని చెప్పారు. దీంతో ఇప్పుడు డేవిడ్ మళ్లీ నిరాశ్రయుడయ్యాడు. తన పాత జీవితాన్ని గడుపుతున్నాడు.

ఇదే విషయంపై డేవిడ్ మాట్లాడుతూ.. తన దగ్గర కరోలిన్ ఇచ్చిన  చేసిన వ్యాన్ ఉంది.  తాను మొదటిసారిగా  పట్టణానికి వచ్చినప్పుడు ఉన్న ప్రదేశంలోనే పార్క్ చేసినట్లు చెప్పాడు. అంతేకాదు ఇప్పటికీ తాను తన భార్యను .. స్నేహితురాలిని ప్రేమిస్తున్నానని చెప్పాడు. తాను కరోలిన్‌ను మిస్ అవుతున్నానని..  కరోలిన్‌ను ప్రేమించాను. ఆమెను గర్వపడేలా చేయడానికి లక్ష్యంతో పనిచేస్తానని చెప్పాడు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్