Horoscope Today: వారి ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (నవంబర్ 28, 2023): మేష రాశి వారు వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. కొత్త ఇంటి మీద దృష్టి పెడతారు. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారుల చేయూత లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today: వారి ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 28th November 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 28, 2023 | 5:01 AM

దిన ఫలాలు (నవంబర్ 28, 2023): మేష రాశి వారు వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. కొత్త ఇంటి మీద దృష్టి పెడతారు. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారుల చేయూత లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నానికి సంబంధించి కీలక సమాచారం అందుతుంది. సతీమణికి వృత్తి, ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యక్తిగత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం పరవాలేదనిపి స్తుంది. కొద్ది ప్రయత్నంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. కొత్త ఇంటి మీద దృష్టి పెడతారు. అద్దె ఇంటి నుంచి మారే అవకాశం కూడా ఉంది. ఆర్థికపరమైన తగ్గించుకుంటారు. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. బంధుమిత్రులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు. ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉన్నా ఉత్సాహంగా బాధ్యతలను నెరవేరుస్తారు. వృత్తి జీవితంలో లావా దేవీలు, కార్యకలాపాలు పెరుగుతాయి. వ్యాపారాలు చాలావరకు ఆశాజనకంగా సాగుతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో అధికారుల చేయూత లభిస్తుంది. వృత్తి జీవితంలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. రోజంతా ఉత్సాహంగా గడిచి పోతుంది. శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దైవ కార్యాల మీద దృష్టి పెడతారు. ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.స్వల్ప అనారోగ్యానికి అవ కాశం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఆదాయం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా శుభవార్తలు వింటారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు. కుటుంబ పెద్దల్లో ఒకరికి అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. హామీలు ఉండ వద్దు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగు తుంది. ప్రత్యేక గుర్తింపు ఏర్పడుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్త అందుతుంది. వివాహ ప్రయత్నాలు సానుకూల పడతాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. ఆదాయ ప్రయత్నాలు ఫలించి అవసరాలు తీరుతాయి. వృత్తి, వ్యాపారాలపై శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవు తాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

రోజంతా సానుకూలంగానే గడిచిపోతుంది. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొం టారు. కుటుంబసమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగు తుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. కుటుంబ జీవితంలో ఆనందోత్సాహాలు వెల్లి విరుస్తాయి. ఇంటికి ఇష్టమైన బంధువులు వచ్చే అవ కాశం ఉంది. కుటుంబ పెద్దల కారణంగా ఆస్తి వివాదం సునాయాసంగా పరిష్కారమవుతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

రోజంతా సానుకూలంగా, సామరస్యంగా సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఇత రులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. రాజకీయ ప్రముఖులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడ తాయి.

వృశ్చికం (విశాఖ, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో మీ నిర్ణయాలు, ఆలోచనలకు విలువ ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు వేగంగా, చురుకుగా పూర్తవుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ప్రయాణాల వల్ల ఆశించిన ఫలితం ఉంటుంది. స్వల్పంగా అనారోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది. తొందరపడి ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. సొంత పనుల మీద మరింతగా శ్రద్ధ పెట్టడం మంచిది. సతీమణి సలహాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల లాభం ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. అనేక విధాలుగా లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహాలు లభిస్తాయి. ఆదాయం బాగానే ఉంటుంది. కుటుంబ సమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. సమాజంలోని ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు, అవివాహితుల పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మ వద్దు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధాపడడం జరుగుతుంది. దీనివల్ల కొద్దిగాద పని భారం పెరుగుతుంది. వ్యాపారాల్లో క్షణం తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని వ్యక్తిగత పనులు పూర్తి చేస్తారు. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసు కోవాల్సి ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. సతీమణికి కెరీర్ పరంగా తప్పకుండా పురోగతి ఉంటుంది. దూర ప్రాంతం నుంచి ఆశించిన శుభ వార్తలు అందుకుంటారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ముందుకు దూసుకుపో తారు. అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తాయి. వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఇతరు లకు ఇతోధికంగా సహాయం చేస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగా సహకరిస్తుంది. కొందరు స్నేహితుల వల్ల డబ్బు నష్టపోతారు. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉన్న కారణంగా కొన్ని ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగాల్లో సానుకూల పరిస్థితులుంటాయి. ఆదాయ సమస్యలుండకపోవచ్చు. అయితే, ఇంటా బయటా కొన్ని చికాకులు ఇబ్బంది పెడతాయి. ప్రతి పనికీ ఒకటికి రెండుసార్లు తిరగాల్సి వస్తుంది. కుటుంబపరమైన సమస్యలుంటాయి. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. బంధువులు కొందరు అపనిందలు వేస్తారు. కొద్దిగా ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది.

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?