Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Destinations: ఈ విదేశాలను సందర్శించాలనుకుంటున్నారా.. పర్యాటక పన్ను గురించి తెలుసుకోండి..

మీరు సందర్శించడానికి కొన్ని దేశాలకు వెళ్తే.. అదనపు పన్నులో అధిక బడ్జెట్ కేటాయించాల్సి ఉంటుంది. అవును అనేక దేశాలు సందర్శకులకు పర్యాటక పన్ను విధిస్తుంది. వీసా తదితర వాటితో పాటు ఈ అదనపు పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు ఒక రోజంతా జర్మనీలోని బాన్ నగరంలో ఉంటే, మీ బిల్లుకు 5 శాతం పన్ను ఆటోమేటిక్‌గా జోడించబడుతుంది. పర్యాటక పన్ను విధించే దేశాల గురించి తెలుసుకుందాం.. 

Travel Destinations: ఈ విదేశాలను సందర్శించాలనుకుంటున్నారా.. పర్యాటక పన్ను గురించి తెలుసుకోండి..
Travel Destinations
Follow us
Surya Kala

|

Updated on: Nov 24, 2023 | 12:19 PM

ప్రపంచవ్యాప్తంగా అనేక అందమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఆ దేశాల్లోని ప్రకృతి అందాలను విన్నా, చూసినా ఎవరైనా సరే ఆ దేశాలకు వెళ్లాలని భావిస్తారు. అయితే ప్రపంచంలోని కొన్ని ప్రత్యేక ప్రదేశాలను సందర్శించాలంటే పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ విషయం కొద్దిమంది మాత్రమే తెలుసు. చాలామంది తమ సెలవులను విదేశాల్లో గడపడానికి ఇష్టపడతారు. విదేశాలకు వెళ్లేముందు ప్రతి దానికీ బడ్జెట్‌ సిద్ధం చేసుకుంటాం. అయితే మీరు సందర్శించడానికి కొన్ని దేశాలకు వెళ్తే.. అదనపు పన్నులో అధిక బడ్జెట్ కేటాయించాల్సి ఉంటుంది. అవును అనేక దేశాలు సందర్శకులకు పర్యాటక పన్ను విధిస్తుంది. వీసా తదితర వాటితో పాటు ఈ అదనపు పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు ఒక రోజంతా జర్మనీలోని బాన్ నగరంలో ఉంటే, మీ బిల్లుకు 5 శాతం పన్ను ఆటోమేటిక్‌గా జోడించబడుతుంది. పర్యాటక పన్ను విధించే దేశాల గురించి తెలుసుకుందాం..

భూటాన్:  భారతదేశం పొరుగు దేశం భూటాన్‌ను సందర్శించాలంటే పర్యాటక పన్ను చెల్లించాలి. విశేషమేమిటంటే ఇక్కడ టూరిస్ట్ గైడ్ ను కూడా ఏర్పాటు చేస్తారు. పర్యాటక పన్నుగా రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది.

వాలెన్సియా: స్పెయిన్ లోని అందమైన నగరం వాలెన్సియా. ఈ ఏడాది (2024) చివరి నుండి లేదా 2024 ప్రారంభం నుండి పర్యాటక పన్నును విధించడం మొదలు పెట్టనుంది. నివేదికల ప్రకారం ఇక్కడ సెలవుల్లో మీరు రాత్రికి 50 సెంట్లు. 2 యూరోలు చెల్లించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

వెనిస్: ఇటలీలోని అందమైన నగరం వెనిస్. ఇక్కడ భారీ సంఖ్యలో విదేశీయులు కనిపిస్తారు. అయితే ఇక్కడ ఓవర్ టూరిజంను నియంత్రించేందుకు టూరిస్ట్ ట్యాక్స్ విధించాలని పాలకవర్గం నిర్ణయించింది. మీరు వెకేషన్ సీజన్‌లో వెళ్లాలనుకుంటే ఒక్కొక్కరికి 3 యూరోలు అంటే రూ. 266 చెల్లించాలి. అదే సమయంలో, ఆఫ్ సీజన్‌లో మీరు 10 యూరోలు అంటే దాదాపు రూ. 875 పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఈ నగరాల్లో మాత్రమే కాదు న్యూజిలాండ్ లో కూడా తన పర్యాటకుల నుండి ఎంట్రీ ఫీజుగా 35 న్యూజిలాండ్ డాలర్లు అంటే రూ. 1,700 వసూలు చేస్తోంది. ప్రజల ఇష్టమైన పర్యాటక కేంద్రమైన థాయ్‌లాండ్‌ను సందర్శించినప్పుడు కూడా మీ నుండి పన్ను వసూలు చేస్తారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…