AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Lanka Tourism: శ్రీలంక వెళ్లాలనుకుంటున్నారా.. ఈ ఏడు దేశాల పర్యాటకులకు వీసా అక్కర్లేదు.. ఎందుకంటే

తక్షణమే ప్రారంభమయ్యే పైలట్ ప్రాజెక్ట్ మార్చి 31వ తేదీ 2024 వరకు అమలులో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా భారత్, చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌ ఈ ఏడు దేశాల పర్యాటకులు శ్రీలంకలో వీసా లేకుండా పర్యటించేందుకు అనుమతినిచ్చింది. ఇటీవల పర్యాటక మంత్రిత్వ శాఖ గత క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదన పెట్టినట్లు వెల్లడించింది. 

Sri Lanka Tourism: శ్రీలంక వెళ్లాలనుకుంటున్నారా.. ఈ ఏడు దేశాల పర్యాటకులకు వీసా అక్కర్లేదు.. ఎందుకంటే
Sri Lanka Tourism
Surya Kala
|

Updated on: Oct 24, 2023 | 7:38 PM

Share

ఒక దేశం నుంచి మరొక దేశంలోకి అడుగు పెట్టాలంటే ఆ దేశం అనుమతినిస్తూ వీసా జారీ చేయాల్సి ఉంటుంది. అయితే భారతీయులు నేపాల్, భూటాన్, మాల్దీవులు వంటి కొన్ని దేశాలకు వీసాలు లేకుండా వెళ్లే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మన పొరుగు దేశం శ్రీలంక కూడా భారతీయులు వీసా లేకుండా తమ దేశానికి రావొచ్చు అంటూ ఆహ్వానం పలుకుతోంది. తమ దేశ పర్యాటక రంగం అభివృద్ధిపై దృష్టి పెట్టిన శ్రీలంక ప్రభుత్వం ఓ పైలెట్ ప్రాజెక్ట్ ను చేపట్టింది. ఇందులో భాగంగా భారత దేశం, చైనా, రష్యాతో సహా ఏడు దేశాల సందర్శకులు వీసా లేకుండా పర్యటించే అవకాశాన్ని కల్పించింది. ఈ నిర్ణయానికి శ్రీలంక మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆ దేశ విదేశాంగ మంత్రి అలీ సబ్రీ ప్రకటించారు.

తక్షణమే ప్రారంభమయ్యే పైలట్ ప్రాజెక్ట్ మార్చి 31వ తేదీ 2024 వరకు అమలులో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా భారత్, చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌ ఈ ఏడు దేశాల పర్యాటకులు శ్రీలంకలో వీసా లేకుండా పర్యటించేందుకు అనుమతినిచ్చింది. ఇటీవల పర్యాటక మంత్రిత్వ శాఖ గత క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదన పెట్టినట్లు వెల్లడించింది.

శ్రీలంక ప్రభుత్వం ప్రధాన ఆదాయ వనరు పర్యాటక రంగం. ఈ పర్యాటక పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా  2023లో 2 మిలియన్ల మంది విదేశీ సందర్శకులను ఆకర్షించే లక్ష్యంతో ఈ పైలెట్ ప్రాజెక్ట్ చేపట్టినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

శ్రీలంక లో COVID-19 మహమ్మారితో పాటు ఆర్థిక,రాజకీయ సంక్షోభాలతో ఉత్పన్నమయ్యిన సవాళ్లను ఎదుర్కొంది. ఈ సవాళ్లను ఎదుర్కొనే సమయంలో పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది.  దీంతో తమ దేశం మళ్ళీ పర్యాటక రంగంలో అభివృద్ధి సాధించాలంటే దిద్దుబాటు చర్యలు తప్పని సరి అని భావించిన ప్రభుత్వం మొదటిసారి ఐదు దేశాల పర్యటకులకు వీసా ఫ్రీ ఇవ్వాలని భావించినా ఇపుడు ఆ సంఖ్య ఏడు దేశాలకు చేరి వీసా ఫ్రీ అనుమతిని ఇచ్చింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి
మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..