Family Reunion: భారత్ విభజన సమయంలో విడిపోయిన అన్నాచెల్లి.. 76 ఏళ్ల తర్వాత కలిపిన సోషల్ మీడియా..
76 ఏళ్లుగా విడిపోయిన ఈ అన్నా చెల్లెళ్ల కలయిక సోషల్ మీడియా ద్వారానే సాధ్యమైంది. వాస్తవానికి, పాకిస్తాన్ పంజాబీ యూట్యూబ్ ఛానెల్ ఇస్మాయిల్ కథనాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన సర్దార్ మిషన్ సింగ్ అనే వ్యక్తి అతనిని సంప్రదించాడు. ఈ సమయంలో, మిషన్ సింగ్ ఇస్మాయిల్‌కు భారతదేశంలో నివసిస్తున్న అతని సోదరి కుటుంబం గురించి సమాచారం ఇచ్చాడు.
అఖండ భారత దేశంలో అనేక దేశాలుగా విడిపోయింది. భారత దేశానికి స్వాతంత్య్రం ఇస్తూ భారత్-పాకిస్థాన్ లుగా విభజించారు. ఈ విభజన సమయంలో సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజల మధ్య బంధాలు కూడా చీలిపోయాయి. అయితే కొందరు సోషల్ మీడియా వేదికగా తమ బంధనాలను బంధుత్వాలను మళ్ళీ కలుపుకుంటున్నారు. తాజాగా 76 ఏళ్ల క్రితం విడిపోయిన సంబంధాన్ని చారిత్రాత్మక కర్తార్‌పూర్ వేదికగా మరోసారి కలుసుకున్న అన్నచెల్లెల గురించి ఈ రోజు తెలుసుకుందాం..
దేశ విభజన సమయంలో మహ్మద్ ఇస్మాయిల్, అతని సోదరి సురీందర్ కౌర్ దేశ విభజన సమయంలో విడిపోయారు. ఇస్మాయిల్ పాకిస్తాన్‌లోని లాహోర్‌కు 200 కిలోమీటర్ల దూరంలో పంజాబ్‌లోని సాహివాల్ జిల్లాలో నివసిస్తుండగా, అతని సోదరి సురీందర్ కౌర్ జలంధర్‌లో జీవితాన్ని గడుపుతోంది. ప్రస్తుతం వీరిద్దరి వయసు దాదాపు 80 ఏళ్లు. ఇద్దరూ అన్నా చెల్లెల్ల గురించి సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతోంది.
ఒకచోటకు చేర్చిన సోషల్ మీడియా
76 ఏళ్లుగా విడిపోయిన ఈ అన్నా చెల్లెళ్ల కలయిక సోషల్ మీడియా ద్వారానే సాధ్యమైంది. వాస్తవానికి, పాకిస్తాన్ పంజాబీ యూట్యూబ్ ఛానెల్ ఇస్మాయిల్ కథనాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన సర్దార్ మిషన్ సింగ్ అనే వ్యక్తి అతనిని సంప్రదించాడు. ఈ సమయంలో, మిషన్ సింగ్ ఇస్మాయిల్‌కు భారతదేశంలో నివసిస్తున్న అతని సోదరి కుటుంబం గురించి సమాచారం ఇచ్చాడు. ఇస్మాయిల్ సోదరి సురీందర్ కౌర్ ఫోన్ నంబర్‌ను కూడా ఇచ్చాడు.
Another family reunion, at Darbar Sahib Kartarpur Corridor.Mr. Muhammad Ismael from Sahiwal, PakistanSurinder Kaur from Jalandhar, India#KartarpurSahib #Pakistan #IndoPakRelations #PMU #TDCP #PTC #Official #Corridor #CEO #Sikhs #gurdawara #meetup pic.twitter.com/jOWIdg1liG
— PMU Kartarpur Official (@PmuKartarpur) October 21, 2023
76 ఏళ్ల తర్వాత కలుసుకున్న అన్నాచెల్లెళ్లు
ఇస్మాయిల్ తన సోదరి సురీందర్‌కు ఫోన్ చేసి మాట్లాడాడు. దీంతో దాదాపు 76 ఏళ్ల తర్వాత ఇద్దరు అన్నచెల్లెలు కలిసి మాట్లాడుకున్నారు. ఈ సమయంలో వారిద్దరూ కర్తార్‌పూర్ కారిడార్ ద్వారా గురుద్వారా దర్బార్ సాహిబ్‌లో కలవాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం ఇస్మాయిల్, సురీందర్ ఇద్దరూ భారతదేశం, పాకిస్తాన్ నుండి ప్రయాణించి.. కర్తార్‌పూర్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌కు చేరుకున్నారు. అక్కడ ఇద్దరు సోదరసోదరిలను ఒకరినొకరు కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇన్నేళ్ల తర్వాత అన్నచెల్లెల కలయికను చూసి అక్కడున్న మరి కొందరు కూడా భావోద్వేగానికి గురయ్యారు.
మహ్మద్ ఇస్మాయిల్, సురీందర్ కౌర్‌ల కలయికకు సంబంధించిన అనేక చిత్రాలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. అన్నా చెల్లితో పాటు వీరి బంధువులు కూడా ఉన్నారు. తమ ప్రియమైన వారిని కలుసుకున్న ఆనందం సురిందర్, ఇస్మాయిల్ ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ (ETPB) ప్రకారం.. విడిపోయిన ఇద్దరు సోదరసోదరీమణులను తిరిగి కలపడంలో కర్తార్‌పూర్ సాహిబ్ పరిపాలన సహాయపడింది.
సరిహద్దులో నివసిస్తున్న రెండు కుటుంబాలు తిరిగి కలవడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా చాలా మంది కర్తార్‌పూర్ సాహిబ్‌లో కలుసుకున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..