AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Destination Wedding: డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్లాన్ చేస్తున్నారా? మన దేశంలోనే బెస్ట్ ప్లేసెస్, అందుబాటు ధరలో..

డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఎక్కువగా విదేశాలను ఎంచుకుంటున్నారు. అయితే భారతదేశంలో కూడా కలల వివాహానికి మంచి స్థలాలున్నాయి. వాటిని కూడా పెళ్లికి వేదికగా ఎంచుకోవచ్చు, అది కూడా మీ బడ్జెట్ ప్రకారం. కనుక ఈ రోజు మనదేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ ను ప్లాన్ చేసుకోగల ప్రదేశాల గురించి తెలుసుకుందాం..

Destination Wedding: డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్లాన్ చేస్తున్నారా? మన దేశంలోనే బెస్ట్ ప్లేసెస్, అందుబాటు ధరలో..
Destination Wedding
Surya Kala
|

Updated on: Nov 19, 2023 | 12:53 PM

Share

భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. వధూవరులు తమ వివాహం జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకోవడానికి డెస్టినేషన్ వెడ్డింగ్‌ని ఇష్టపడుతున్నారు. నిజానికి స్టార్లతో మొదలైన ఈ ట్రెండ్ ను ఇప్పుడు క్రమంగా సామాన్యుల కూడా ఫాలో అవుతున్నారు. వాస్తవానికి భారతీయుల పెళ్లిళ్లకు భారీగానే ఖర్చుచేయాల్సి వస్తుంది. మరికొంచెం ఖర్చు చేస్తే.. జీవితాంతం గుర్తుండి పోయేలా సరదాగా.. సందడిగా డెస్టినేషన్ వెడ్డింగ్ ఎందుకు చేసుకోకూడదని ప్రస్తుతం వధూవరుల కుటుంబాలు అనుకుంటున్నారు.

డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఎక్కువగా విదేశాలను ఎంచుకుంటున్నారు. అయితే భారతదేశంలో కూడా కలల వివాహానికి మంచి స్థలాలున్నాయి. వాటిని కూడా పెళ్లికి వేదికగా ఎంచుకోవచ్చు, అది కూడా మీ బడ్జెట్ ప్రకారం. కనుక ఈ రోజు మనదేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ ను ప్లాన్ చేసుకోగల ప్రదేశాల గురించి తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

ఉదయపూర్: రాజస్థాన్‌లోని లేక్ సిటీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ వివాహాన్ని రాజ శైలిలో ప్లాన్ చేసుకోవచ్చు. పెళ్లి చేసుకోవడానికి ఇండోర్, అవుట్‌డోర్ బాంకెట్ హాల్స్‌ ఉంటాయి. అంతేకాదు తక్కువ ధరతో పాటు..  ఖరీదైన రిసార్ట్ కూడా లభిస్తాయి. వివాహ అలంకరణలను ఎంచుకోవాలనుకుంటే రూ.10 లేదా 12 లక్షలకు సరసమైన ప్యాకేజీని పొందవచ్చు.

కోవలం: కేరళలోని కోవలం నగరంలో డెస్టినేషన్ వెడ్డింగ్ కు బెస్ట్ వేదిక. ఇక్కడి బ్యాక్ వాటర్ ఫాల్స్  అందమైన దృశ్యం..  మీ వివాహాన్ని మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది. కోవలంలో బడ్జెట్ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు బెస్ట్ ఎంపిక. దాదాపు రూ.8 నుండి 15 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇక్కడ వెడ్డింగ్ ప్యాకేజీలు చాలా సరసమైన ధరలో లభిస్తాయి.

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

గోవా: పార్టీలకే కాదు డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు కూడా పేరుగాంచింది. అయితే ఇక్కడ శీతాకాలంలో జరిగే వివాహానికి బడ్జెట్ ఎక్కువగా ఉండవచ్చు. అయితే గోవాకు ఆఫ్‌ సీజన్‌ వేసవి కాలం. కనుక వేసవిలో పెళ్లి చేసుకునేవారికి వెడ్డింగ్ కు బెస్ట్ వేదిక గోవా. రూ.10 నుంచి 20 లక్షల బడ్జెట్ తో ఇక్కడ పెళ్లి చేసుకోవచ్చు.

జోధ్‌పూర్: రాజస్థాన్ లోని జోధ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ ఖర్చు మీరు మీ వివాహాన్ని ఎంత గ్రాండ్‌గా చేయాలనుకుంటున్నారో దాని ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఇక్కడ టాప్ రిసార్ట్‌ను ఎంచుకుంటే, పెళ్లి ఖర్చు రూ.30 నుండి రూ.50 లక్షల వరకు ఉంటుంది. తక్కువ విలాసవంతమైన ప్రదేశంలో కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవచ్చు. దీనికి రూ. 10 నుండి 15 లక్షల ఖర్చు అవుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..