Shirdi Tour: హైదరాబాద్‌ టూ షిర్డీ టూర్‌.. ఫ్లైట్‌లో ప్రయాణం. ధరెంతో తెలుసా.?

ప్యాకేజీలో భాగంగా హైదరాబాద్‌ నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు ఫ్లైట్ జర్నీ ప్రారంభమవుతుంది. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు షిర్డీ చేసుకుంటారు. అనంతరం హోటల్‌లో చెకిన్‌ అవ్వాల్సి ఉంటుంది. అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత సాయంత్రం 4.30 గంటలకు షిర్డీ సాయి దర్శనం ఉంటుంది. సాయంత్రం హారతి కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. తర్వాత రాత్రి 7 గంటలకు...

Shirdi Tour: హైదరాబాద్‌ టూ షిర్డీ టూర్‌.. ఫ్లైట్‌లో ప్రయాణం. ధరెంతో తెలుసా.?
Hyderabad To Shirdi Tour
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 18, 2023 | 8:50 PM

హైదరాబాద్‌ నుంచి షిర్డీ టూర్‌ వెళ్లాలనుకునే పర్యాటకులకు శుభవార్త. తక్కువ ఖర్చులో ఎంచక్కా ఫ్లైట్‌లో షిర్డీ వెళ్లే అవకాశం పొందొచ్చు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ అవకాశాన్ని కల్పించింది. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఇప్పటికే షిర్డీకి ఏసీ బస్సు సర్వీసును అందిస్తోండగా దానికి అదనంగా విమాన సేవలను అందిస్తోంది.

దీంతో ఎలాంటి రిస్క్‌ లేకుండా ప్రయాణికులు షిర్డీ టూర్‌ వెళ్లొచ్చు. ఇంతకి ఈ టూర్‌లో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? ప్రయాణం ఎలా సాగుతుంది.? ప్యాకేజీ వివరాలు మీకోసం. ఈ టూర్‌ ప్యాకేజీ ధరను రూ. 12,499గా నిర్ణయించారు. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ అందిస్తున్న ఈ టూర్‌ ప్యాకేజీలో భాగంగా.. హైదరాబాద్‌లో విమానాశ్రాయానికి చేర్చట మొదలు, హోటల్‌, భోజనం, వసతి ఈ ప్యాకేజీలో కవర్‌ అవుతాయి. షిర్డీలో స్థానికంగా ఉన్న పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లటం కూడా తమ బాధ్యతేనని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రకటించింది.

ప్యాకేజీలో భాగంగా హైదరాబాద్‌ నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు ఫ్లైట్ జర్నీ ప్రారంభమవుతుంది. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు షిర్డీ చేసుకుంటారు. అనంతరం హోటల్‌లో చెకిన్‌ అవ్వాల్సి ఉంటుంది. అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత సాయంత్రం 4.30 గంటలకు షిర్డీ సాయి దర్శనం ఉంటుంది. సాయంత్రం హారతి కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. తర్వాత రాత్రి 7 గంటలకు బాబా థీమ్‌ పార్క్‌లో సౌండ్‌ అండ్‌ లైట్ షోను చూడొచ్చు.

రాత్రి హోటల్‌లో బస చేయాల్సి ఉంటుంది. అనంతరం రెండో రోజు ఉదయం టిఫిన్ చేయాల్సి ఉంటుంది. అనంతరం 8 గంటలకు పంచముఖి గణపతి మందిర దర్శనం ఉంటుంది. అనంతరం పాత షిర్డీ, ఖండోబా మందిర్‌, సాయి తీర్థం వంటి ప్రదేశాలను సందర్శించాల్సి ఉంటుంది. తర్వాత భోజనం చేయగానే.. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు విమానం బయలుదేరి సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌కు చేరుకుంటారు. భోజనం, హోటల్‌లో బస వంటివి ఈ ప్యాకేజీలో కవర్‌ అవుతాయి. అయితే కొన్ని దర్శన టికెట్లు మాత్రం స్వయంగా చెల్లించుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?