Viral News: ఆ నగరంలో ఇంట్లో దుమ్ము, ధూళి ఉన్నా, వంటపాత్రలు కడగకున్నా భారీ జరిమానా
ఎవరైనా సరే తమ మంచం మీద దుప్పటిని శుభ్రంగా ఉంచకపోయినా.. లేదా ఆహారం తిన్న తర్వాత ఆ వంట పాత్రలను శుభ్రపరచకుండా నిల్వ చేసినా ఇప్పుడు $1.4( మనదేశ కరెన్సీలో రూ.117) జరిమానా విధించనున్నట్లు పుగా జిల్లా అధికారులు తెలిపారు. ఇది మాత్రమే కాదు తినే సమయంలో ప్రజలు కూర్చునే శైలి కూడా ప్రస్తావించారు. ఎవరైనా భోజనం చేసే సమయంలో కుంగుబాటుతో భోజనం చేస్తే, వారికి అదనంగా $2.8 (మనదేశ కరెన్సీలో రూ. 234) జరిమానా విధించబడుతుందని పేర్కొంది.
ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇల్లును చూసి ఇల్లాలిని చూడు అన్న సామెతకు గుర్తు ఇంటి పరిశుభ్రత. ఇంకా చెప్పాలంటే ఇంటికి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే ముందుగా ఆ ఇంట్లో ఉన్న పరిసరాలపై.. ఇంటి పరిశుభ్రత పై దృష్టిని సారిస్తారు. అయితే ఒకొక్కసారి నీరసంగా అనిపించినా లేక బద్ధకంగా అనిపించినా ఇంటి పరిశుభ్రత విషయంపై పెద్దగా ఆసక్తిని చూపించరు. అయితే ఇలా ఉన్నా సరే ఎవరూ పెద్దగా పట్టించుకోరు.. ఇక జరిమానా విధిచడం అన్నమాటే ఉండదు. ఎవరైనా ప్రాథమిక ఇంటి పనులను విస్మరిస్తే.. జరిమానా కూడా విధించే దేశం కూడా ఉందని మీకు తెలుసా..!
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లోని పుగా కౌంటీలో కొత్త విధానం రూపొందించబడింది. దీని ప్రకారం ఎవరి ఇంట్లోనైనా ప్రాథమిక ఇంటి పనులను చేయకుండా బద్దకిస్తే అప్పుడు వారికి జరిమానా విధించబడుతుంది. అయితే ఈ విషయం ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియాలో దుమారం రేగింది.
ఎవరైనా సరే తమ మంచం మీద దుప్పటిని శుభ్రంగా ఉంచకపోయినా.. లేదా ఆహారం తిన్న తర్వాత ఆ వంట పాత్రలను శుభ్రపరచకుండా నిల్వ చేసినా ఇప్పుడు $1.4( మనదేశ కరెన్సీలో రూ.117) జరిమానా విధించనున్నట్లు పుగా జిల్లా అధికారులు తెలిపారు. ఇది మాత్రమే కాదు తినే సమయంలో ప్రజలు కూర్చునే శైలి కూడా ప్రస్తావించారు. ఎవరైనా భోజనం చేసే సమయంలో కుంగుబాటుతో భోజనం చేస్తే, వారికి అదనంగా $2.8 (మనదేశ కరెన్సీలో రూ. 234) జరిమానా విధించబడుతుందని పేర్కొంది.
స్థానిక పాలనా యంత్రాంగం ప్రకారం.. ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరచడమే స్థానిక అధికారుల లక్ష్యంగా పేర్కొన్నారు. మొత్తం 14 కేటగిరీల జాబితాలో జరిమానా విధించేందుకు నిబంధనలు రూపొందించినట్లు అధికారులు చెప్పారు. ఈ మేరకు ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు. ఆ తర్వాత జరిమానాపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమయంలో ఇంటిలోని దుమ్ము, ధూళి, సాలెపురుగులు, అస్తవ్యస్తమైన వస్తువులు వంటి విషయాలపై తణిఖీ చేయనున్నారు. ఎవరైనా తప్పును పునరావృతం చేసినట్లు తేలితే జరిమానాను రెట్టింపు చేసే నిబంధన కూడా ఉంది.
ఈ ప్రకటనపై చైనా సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. ఇలా చేయడం ద్వారా స్థానిక పరిపాలన ప్రజల వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఒక వినియోగదారు ఆరోపిస్తున్నారు. మేము మంచం వేసుకున్నామా లేదా అని పరిపాలన అధికారులు చూడాలనుకుంటున్నారు అంటూ ఒకరు కామెంట్ చేయగా.. మరొకరు డబ్బు దోపిడీకి పరిపాలన అధికారులు కొత్త పద్ధతిని కనిపెట్టిందని జరిమానా ఉద్దేశం అంటూ ఆరోపించారు. అయితే కొంతమంది వినియోగదారులు దీనికి మద్దతు చెబుతున్నారు కూడా..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..