Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఫ్లైట్‌లో జరిగిన వింత ఘటన.. ఇక్కడ మూత్ర విసర్జన చేస్తానంటూ ప్యాంటు విప్పిన మహిళ

ప్రస్తుతం ఇప్పుడు విమానంలో వాష్‌రూమ్‌ను ఉపయోగించకూడదని ఎయిర్ హోస్టెస్ సదరు మహిళకు చెప్పినప్పుడు.. సహనం కోల్పోయిన మహిళ ప్యాంట్ విప్పి ఓ రేంజ్ లో హల్ చల్ చేసింది. అంతేకాదు విమానం మధ్య ప్రాంతంలో మూత్ర విసర్జన చేస్తానని బెదిరిస్తూ ప్యాంటు తీసేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఆ వీడియో అభ్యంతర కరంగా ఉండడంతో ఇక్కడ అటాచ్ చేయలేకపోతున్నాం..

Viral News: ఫ్లైట్‌లో జరిగిన వింత ఘటన.. ఇక్కడ మూత్ర విసర్జన చేస్తానంటూ ప్యాంటు విప్పిన మహిళ
Viral News
Follow us
Surya Kala

|

Updated on: Nov 23, 2023 | 2:32 PM

ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ విమానంలో జరిగిన షాకింగ్ ఘటన వీడియో వైరల్‌గా మారింది. ఒక మహిళా ప్రయాణికురాలు విమానం మధ్యలో తన ప్యాంట్‌ను తీసివేయడమే కాదు.. కారిడార్ మధ్యలో మూత్ర విసర్జన చేస్తానని బెదిరించింది. ఓర్లాండో నుంచి ఫిలడెల్ఫియా వెళ్తున్న విమానంలో గత సోమవారం ఈ వింత ఘటన చోటుచేసుకుంది. మహిళ చేసిన ఈ చర్యతో ఆ విమానంలో ప్రయత్నిస్తున్న ఇతర ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు.

ది న్యూయార్క్ పోస్ట్ ప్రకారం ప్రస్తుతం ఇప్పుడు విమానంలో వాష్‌రూమ్‌ను ఉపయోగించకూడదని ఎయిర్ హోస్టెస్ సదరు మహిళకు చెప్పినప్పుడు.. సహనం కోల్పోయిన మహిళ ప్యాంట్ విప్పి ఓ రేంజ్ లో హల్ చల్ చేసింది. అంతేకాదు విమానం మధ్య ప్రాంతంలో మూత్ర విసర్జన చేస్తానని బెదిరిస్తూ ప్యాంటు తీసేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఆ వీడియో అభ్యంతర కరంగా ఉండడంతో ఇక్కడ అటాచ్ చేయలేకపోతున్నాం..

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఆ మహిళ ‘నన్ను క్షమించు’ అని చెబుతూ ప్యాంటు కిందకు దించుకుని కారిడార్‌లో కూర్చోవడం చూడవచ్చు. ఆ మహిళ చేసిన పనికి ఇతర ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వారిపై ఆ కేకలు వేస్తూ – ‘నాకేమీ అభ్యంతరం లేదు. నేను మూత్ర విసర్జనకు వెళ్లాలంటూ చెప్పింది.

ఇవి కూడా చదవండి

కొంచెం సమయం తర్వాత మహిళ ప్యాంటు ధరించింది. మళ్ళీ వాష్‌రూమ్‌కు వెళ్లేందుకు అనుమతించాలంటూ విమాన సిబ్బందితో వాగ్వాదం కొనసాగించింది. ఈ సమయంలో, మహిళ ఇతర ప్రయాణికులను కూడా దుర్భాషలాడింది. ఈ విమానంలో జూలీ వోషెల్ హార్ట్‌మన్ అనే మహిళ కూడా ఉంది. మొత్తం ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తన ఫేస్‌బుక్‌లో తెలిపింది. జూలీ ఫేస్‌బుక్‌లో ఫ్లోరిడా నుండి ఇంటికి వెళ్తున్న తనకు ఇది అత్యంత చెత్త అనుభవమని వెల్లడించింది. అంతేకాదు ఆ మహిళ  పిల్లల ముందు చాలా అసభ్యంగా ప్రవర్తించిందని చెప్పారు. అయితే తాను ఆ మహిళ చేస్తున్న పనిని  అడ్డుకునే ప్రయత్నం చేయగా చంపేస్తానని బెదిరించిందని చెప్పారు.

ఈ ఫేస్‌బుక్ పోస్ట్‌పై ప్రజలు చాలా ఘాటుగా స్పందించారు. కొంతమంది వినియోగదారులు ఇది పీడకల కంటే తక్కువ కాదని అంటున్నారు. అదే సమయంలో చాలా మంది ప్రయాణీకులు ఆ మహిళపై జీవితకాల నిషేధాన్ని విధించాలంటూ డిమాండ్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..