AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కారులో వచ్చి మరీ ఇంట్లోని పూల కుండీలను దొంగలిస్తున్న యువతులు .. నెట్టింట్లో వీడియో వైరల్..

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వింత దొంగతనం ప్రస్తుతం అందరిని నవ్విస్తుంది. ఓ ఇద్దరు యువతులు కారులో వచ్చిమరీ దొంగతనం చేస్తున్నారు. ఈ వింత చోరీ పంజాబ్‌లోని మొహాలీలో చోటుచేసుకుంది. ఈ వీడియో చూసి ముందు ఉలిక్కిపడ్డారు. తర్వాత నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఇద్దరు యువతులు విలువైన ఆభరణాలు, విలువైన వస్తువులను దొంగతనం చేయడం లేదు. కారులో వచ్చిన ఇద్దరు యువతులు ఇంటి ఆవరణలో ఉన్న పువ్వుల కుండీలను దొంగలిస్తున్నారు.

Viral Video: కారులో వచ్చి మరీ ఇంట్లోని పూల కుండీలను దొంగలిస్తున్న యువతులు .. నెట్టింట్లో వీడియో వైరల్..
Viral Video
Surya Kala
|

Updated on: Nov 21, 2023 | 4:54 PM

Share

అయితే గత కొంతకాలం వరకూ డబ్బులను, విలువైన వస్తువులను దొంగిలించేవారు.. అయితే కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా దొంగతనాల్లో కూడా మార్పులు వచ్చాయి.. ఇప్పుడు బంగార నగలు, డబ్బులు మాత్రమే కాదు అవసరం అయితే జంవుతులను, వీధి లైట్స్ ను, రోడ్డు సంప్ మీద ఉండే క్యాప్ లను ఇలా రకరకాల వస్తువులు కూడా దొంగలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొట్టి నవ్వులు కూడా పూయిస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వింత దొంగతనం ప్రస్తుతం అందరిని నవ్విస్తుంది. ఓ ఇద్దరు యువతులు కారులో వచ్చిమరీ దొంగతనం చేస్తున్నారు. ఈ వింత చోరీ పంజాబ్‌లోని మొహాలీలో చోటుచేసుకుంది. ఈ వీడియో చూసి ముందు ఉలిక్కిపడ్డారు. తర్వాత నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఇద్దరు యువతులు విలువైన ఆభరణాలు, విలువైన వస్తువులను దొంగతనం చేయడం లేదు. కారులో వచ్చిన ఇద్దరు యువతులు ఇంటి ఆవరణలో ఉన్న పువ్వుల కుండీలను దొంగలిస్తున్నారు. ఇంటి బయట అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది.

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో క్లిప్‌లో ఇద్దరు అమ్మాయిలు సెడాన్ కారులో వచ్చి రోడ్డు మీద ఒక ప్రాంతంలో ఆగారు. ఆ తర్వాత తనని ఎవరూ చూడటం లేదని నిర్ధారించుకోవడానికి చుట్టూ చూశారు. తమ  చుట్టూ ఎవరూ లేరని ఆమె భావించి.. రహస్యంగా ఒక ఇంటి ప్రధాన గేటు దగ్గరికి వచ్చి అక్కడ గోడ మీద ఉన్న రెండు పూల కుండీలను,  క్రోటన్ మొక్కలను దొంగలించి కారులో పెడుతున్నారు. ఇలా వరసగా అనేక ఇళ్ల గోడల మీద ఉన్న కుండీలను దొంగలిస్తున్నారు ఇద్దరు యువతులు. ఈ వింత దొంగతనం సంఘటన మొహాలీలోని సెక్టార్ 78లో జరిగినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మొహాలీలో జరిగిన వింత

వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన నెటిజన్లు పూల కుండీలను చోరీ చేయడం ఒక వింత అయితే.. అది కూడా సెడాన్ కారులో వచ్చి మరీ చోరీ చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రతి ఇంటి బయట సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని.. అందులో తాము చేస్తున్న దొంతనం రికార్డ్ అవుతుందని ఈ యువతులకు తెలియనట్లుంది అంటున్నారు. పూల కుండీని దొంగిలిస్తున్న సమయంలో ఇద్దరు అమ్మాయిలు కెమెరాలో రికార్డ్ అయ్యారు. ఈ వీడియో గురించి ఒక నెటిజన్ వ్యాఖ్యానిస్తూ పైనున్న దేవుడు అన్నీ చూస్తున్నాడు అని కామెంట్ చేశాడు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..