Viral Video: ఏటీఎం నుంచి డబుల్ క్యాష్ రావడం మొదలు.. క్యూ కట్టిన కస్టమర్స్.. బ్యాంకు బంపర్ ఆఫర్..
ఏటీఎం మెషీన్‌లో ‘డబుల్ క్యాష్’ వస్తుందన్న వార్త వ్యాపించడంతో వెంటనే జనం గుమిగూడారు. అందరూ లైన్‌లో నిలబడి తమ డబ్బు నుంచి 'రెట్టింపు' తీసుకునేందుకు బారులు తీరి గంటల తరబడి వేచి ఉన్నారు. ఈ ఫన్నీ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ATM చుట్టూ గుంపు కనిపిస్తోంది.
ఒకప్పుడు బ్యాంకుల్లో డబ్బులు తీసుకోవాలంటే గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఉండేది. అయితే మారిన కాలంతో పాటు సరికొత్త టెక్నాలజీ అభివృద్ధి చెందింన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. ఇప్పుడు అన్ని లావాదేవీలు తామున్న చోట నుంచే ఆన్ లైన్ లోనే చేస్తున్నారు. అయితే ఒక్కోసారి ప్రజలకు నగదు అవసరమైనప్పుడు తప్పనిసరిగా ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసుకుంటారు. డబ్బులు కావాలంటే బ్యాంక్ కు వెళ్లే బదులు సమీపంలో ఉన్న ATMకి వెళ్లి తీసుకుంటారు. తమకు కావాల్సిన మొత్తం నమోదు చేసి అప్పుడు తమకు కావాల్సిన మొత్తాన్ని నగదు మెషిన్ నుంచి తీసుకుంటారు. అయితే ATM మెషీన్ నుండి ‘డబుల్ క్యాష్’ రావడం ప్రారంభమైతే ఏమి జరుగుతుందో ఊహించండి? ప్రస్తుతం ATM మెషిన్ నుండి రెట్టింపు డబ్బును విత్‌డ్రా అయ్యి అలజడి సృష్టిస్తోంది. అప్పుడు ఆ ఏటిఎం వద్ద ప్రజలు బారులు తీరతారు. తమ వంతు నగదు తీసుకునేందుకు క్యూలు కడతారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
ఏటీఎం మెషిన్ నుంచి డబుల్ క్యాష్ వస్తుందన్న వార్తతో జనం క్యూ కట్టిన సంఘటన బ్రిటన్ లోని లండన్ లో చోటు చేసుకుంది. ఏటీఎం మెషీన్‌లో ‘డబుల్ క్యాష్’ వస్తుందన్న వార్త వ్యాపించడంతో వెంటనే జనం గుమిగూడారు. అందరూ లైన్‌లో నిలబడి తమ డబ్బు నుంచి ‘రెట్టింపు’ తీసుకునేందుకు బారులు తీరి గంటల తరబడి వేచి ఉన్నారు. ఈ ఫన్నీ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ATM చుట్టూ గుంపు కనిపిస్తోంది.
వీడియో చూడండి
Cash machine on East Ham High Street has gone rogue giving customers double cash 🤑👀 #IG1IG3 #EastHam pic.twitter.com/Pyzu7uG2VY
— INSTA: IG1IG3 (@Ig1Ig3) November 14, 2023
LadBible నివేదిక ప్రకారం ATM మెషీన్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీని కారణంగా డబ్బు రెండింతలు విత్‌డ్రా అవ్వడం మోడలింది. అంటే ఒక వ్యక్తి ATM మెషీన్ నుంచి డ్రా చేయడానికి రూ. 5,000లు నమోదు చేస్తే.. అతనికి రూ. 10,000 నగదు వచ్చింది. ఈ వార్త క్షణాల్లో వ్యాపించడంతో.. ఏటీఎం నుంచి వస్తున్న ‘డబుల్ క్యాష్’ను చాలా మంది సద్వినియోగం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియా వినియోగదారులు సదరు వ్యక్తులపై మండిపడ్డారు. ‘బ్యాంకు వారి నుండి రెట్టింపు డబ్బు తీసుకున్న మీరు దొంగతనం అని ఒకరు అంటే.. మరికొందరు వీరిని విచారించాలని చెబుతున్నారు.
నాట్‌వెస్ట్ బ్యాంక్ ప్రతినిధి మిర్రర్‌తో మాట్లాడుతూ ఒక ATMలో లావాదేవీలు మాన్యువల్ లోపం కారణంగా.. నమోదు చేసిన మొత్తం కంటే ఎక్కువ నగదును విత్‌డ్రా చేయడం జరిగిందని వెల్లడించారు. అయితే ఇప్పుడు ఆ లోపం సరిదిద్దినట్లు తెలిపారు. కనుక ఇపుడు ఈ ఏటీఎం ను కష్టమర్లు సాధారణంగా ఉపయోగించవచ్చు. ఈ లోపం వల్ల ఏటీఎంలో జరిగిన లావాదేవీలు దెబ్బతిన్నాయని.. అయితే పొరపాటున ATM నుండి పొందిన కస్టమర్స్ నుంచి అదనపు డబ్బును బ్యాంకు తిరిగి తీసుకోదని కూడా బ్యాంక్ తెలిపింది.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..