Astro Tips: నాగేంద్రుడి ఆశీస్సులతో నేటి నుంచి ఈ 5 రాశులు పట్టిందల్లా బంగారమే.. అందులో మీరున్నారా చెక్ చేసుకోండి..

జ్యోతిష్యశాస్త్రంలో వ్యక్తులకు సంబంధించిన మంచి చెడుల గురించి తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు అంటే నాగుల చవితి పండగ రోజు నుంచి కొన్ని రాశులకు చెందిన వ్యక్తులకు నాగేంద్రుడి ఆశీస్సులతో శుభ సమయం ఆరంభం అవుతుంది. కొత్త ఉత్సాహంతో మంచి రోజులు ప్రారంభం అవుతాయి. ఆ అదృష్ట రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.. 

Astro Tips: నాగేంద్రుడి ఆశీస్సులతో నేటి నుంచి ఈ 5 రాశులు పట్టిందల్లా బంగారమే.. అందులో మీరున్నారా చెక్ చేసుకోండి..
Nagendras Blessings
Follow us
Surya Kala

|

Updated on: Nov 17, 2023 | 7:56 AM

ప్రతి వ్యక్తి తన మంచి చెడులను గురించి తెలుసుకోవాలని కోరుకుంటాడు, అంతేకాదు భవిష్యత్ లో జరగనున్న విషయాలను తెలుసుకోవడానికి జ్యోతిష్యశాస్త్రాన్ని ఆశ్రయిస్తాడు. అయితే జనన సమయం, రాశులు, తిథి వంటి వాటితో జ్యోతిష్యశాస్త్రంలో వ్యక్తులకు సంబంధించిన మంచి చెడుల గురించి తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు అంటే నాగుల చవితి పండగ రోజు నుంచి కొన్ని రాశులకు చెందిన వ్యక్తులకు నాగేంద్రుడి ఆశీస్సులతో శుభ సమయం ఆరంభం అవుతుంది. కొత్త ఉత్సాహంతో మంచి రోజులు ప్రారంభం అవుతాయి. ఆ అదృష్ట రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

తుల రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు ఈ రోజు నుంచి చాలా ఉత్సాహంగా ఉంటారు. కొత్త ఆలోచనలతో పనిలో ముందుకు అడుగులు వేస్తారు. ముఖ్యంగా వ్యాపారంలో కొత్తగా ఏదైనా చేయాలనే తపనతో ముందుకు అడుగులు వేస్తారు. అయితే ఏదైనా పని చేసే ముందు మనసుతో అలోచించి కాకుండా తెలివిగా ఆలోచించి ముందుకు అడుగు వేయాలి. వ్యాపారస్తులు ఆర్ధికంగా శుభ ఫలితాలను అందుకుంటారు. అంతేకాదు ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి ఆసక్తిని చూపిస్తారు. ఈ రాశికి చెందిన సంగీతకళాకారులు సమాజంలో కీర్తి ప్రతిష్టలను పొందుతారు.

వృశ్చిక రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తుల ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి  శుభ సమయం మొదలైంది. పెద్దల సలహాలు సూచనలతో మంచి ఫలితాలను పొందుతారు. ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు. శత్రువులఫై నాగేంద్రుడి దయతో విజయాన్ని అందుకుంటారు. ఉద్యోగస్థులకు అధికారుల మద్దతుతో విశేష లాభాలు లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. స్నేహితుల సహకారంతో ముందుకు అడుగు వేస్తారు. స్టూడెంట్స్ కు శుభ సమయం.

ఇవి కూడా చదవండి

ధనుస్సు రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు ఆధాత్మిక యాత్రల పట్ల ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా రాజకీయవేత్తలు తమ పనులను ఆసక్తితో చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారంలో తల్లిదండ్రుల నుంచి సహాయం లభిస్తుంది. ఈ రోజు నుంచి సంతోషంగా ఉంటారు. అయితే ఆహారపు అలవాట్లు, జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ప్రేమికులు తమ బంధాన్ని మరింతగా నిలబెట్టుకుంటారు.

మకర రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు కొత్త ఆనందాన్ని పొందుతారు. ఆఫీసులో సీనియర్ అధికారుల నుంచి ప్రశంసలను అందుకుంటారు. జీతంలో పెరుగుదల ఉండవచ్చు. విద్యార్థులకు ఈ రోజు నుంచి  అనుకూలమైన రోజులు ప్రారంభం. కెరీర్‌లో ఎదుగుదల ఉంటుంది. వ్యాపారస్తులు లాభాలు పొందే అవకాశం.  ఆర్థిక లాభాలను పొందుతారు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న పనిని పూర్తి చేసే అవకాశం ఉంది.

కుంభ రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులను నేటి నుంచి మంచి రోజులు మొదలవుతాయి. సామాజిక పనులకు శ్రీకారం చుడతారు. ఆఫీసులో చేపట్టిన పనులు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేస్తారు. బెస్ట్ ఫ్రెండ్‌ సహకారంతో ముందుకు వెళ్లారు. కుటుంబ సభ్యులకు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు జీవిత భాగస్వామితో చర్చించాల్సి ఉంది. అయితే వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. దూర ప్రయాణాలకు దూరంగా ఉండడం మేలు. పోటీ పరీక్షలకు హాజరయ్యే స్టూడెంట్స్ శుభఫలితాలు పొందుతారు. ఆరోగ్యంగా ఉండడం కోసం కొన్ని ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు