Kurnool: 400 ఏళ్లుగా వింత ఆచారం.. లింగేశ్వర స్వామి ఉత్సవాల్లో కాలితో తంతే కష్టాలు పోతాయని నమ్మకం..

స్వామి పూజ అనంతరం హుల్తీ లింగేశ్వర స్వామి ఆవహించిన వ్యక్తి బోర్ల పండుకున్న వారిపై కాలుతో తన్నుకుంటూ వెళ్లడంతో వారు ఆనందోత్సవంలో మునిగిపోతారు. ఈ వింత ఆచారం పెద్దహుల్తి గ్రామంలో వెలసిన హుల్తి లింగేశ్వర స్వామి ఉత్సవాల్లో కొనసాగుతోంది. ప్రతి దీపావళి తర్వాత అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవం అయిపోయిన తర్వాత భవిష్యవాణి కూడా హుల్తీ లింగేశ్వర స్వామిని ఆవహించిన వ్యక్తి చెబుతాడు.

Kurnool: 400 ఏళ్లుగా వింత ఆచారం.. లింగేశ్వర స్వామి ఉత్సవాల్లో కాలితో తంతే కష్టాలు పోతాయని నమ్మకం..
Lingeswara Swamy Utsvalu
Follow us

| Edited By: Surya Kala

Updated on: Nov 16, 2023 | 11:48 AM

ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని పత్తికొండ మండలం పెద్దహుల్తి గ్రామంలో వెలసిన హుల్తి లింగేశ్వర స్వామి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి .ఈ ఉత్సవాలు చూసేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఇక్కడ దాదాపుగా 400 సంవత్సరాల నుండి హుల్తీ లింగేశ్వరస్వామి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను తిలకించేందుకు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ  రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. ఇక్కడ వింత ఆచారమేమిటంటే ఎవరికైనా కష్టాలు ఉన్నవారు స్వామి దర్శనం చేసుకుని బోర్ల పండుకుంటే..  స్వామి ఆవహించిన వ్యక్తి బోర్లా పడుకున్న వారిపై కాలుతో తన్నుకుంటూ వెళ్తాడు. అలా కాలుతో తంతే వెంటనే తమ కష్టాలు తొలగిపోతాయని నమ్మకం.

అంతేకాదు ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం వస్తుందని, ఆరోగ్యం బాగా లేని వారికి ఆరోగ్యం బాగుపడుతుందని, ఆర్థిక ఇబ్బందులతో కష్టాలు పడుతున్నవారి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ఇక్కడ ప్రజల విశ్వాసం. ఈ విశ్వాసంతో ప్రజలు తండోపతండాలుగా బోర్ల పండుకొని స్వామివారి తన్నుల కోసం ఎదురుచూస్తారు.

స్వామి పూజ అనంతరం హుల్తీ లింగేశ్వర స్వామి ఆవహించిన వ్యక్తి బోర్ల పండుకున్న వారిపై కాలుతో తన్నుకుంటూ వెళ్లడంతో వారు ఆనందోత్సవంలో మునిగిపోతారు. ఈ వింత ఆచారం పెద్దహుల్తి గ్రామంలో వెలసిన హుల్తి లింగేశ్వర స్వామి ఉత్సవాల్లో కొనసాగుతోంది. ప్రతి దీపావళి తర్వాత అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవం అయిపోయిన తర్వాత భవిష్యవాణి కూడా హుల్తీ లింగేశ్వర స్వామిని ఆవహించిన వ్యక్తి చెబుతాడు. సంవత్సరంలో పంటలు ఏ విధంగా పండుతాయో వివరిస్తాడు.. దీంతో ఉత్సవాలు ముగుస్తాయి.

ఇవి కూడా చదవండి

ఆధునిక కాలంలో రోబో టెక్నాలజీ కాలంలో కూడా ఈ వింత ఆచారం కొనసాగడం.. చదువుకున్న వారు సైతం ఈ నమ్మకాన్ని విశ్వసించడం గమనార్హం, అయితే కొందరు దైవం ఉందంటూ విశ్వసిస్తుంటే.. మరికొందరు ఇది మూఢ నమ్మకం అని విశ్వాసం మంచిది కాదు అని అంటున్నారు. ప్రస్తుతం పెద్దహుల్తి గ్రామంలో మూడో వంతు ప్రజలు ఈ విశ్వాసం నమ్మే వారు.. అందులో విద్యావంతులు ఉండటం విశేషం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు