Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tiger Terror: ఉద్దానంలో పెద్దపులి టెర్రర్.. ఆవులపై దాడి.. ఉపాధికి కూడా వెళ్లని జనం.. బంధించండి మహాప్రభో అంటూ విన్నపం..

శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో పెద్దపులి వణుకు పుట్టిస్తోంది. గత 15 రోజులుగా ఉద్దానం ప్రాంతంలోనే సంచరిస్తూ పశువులపై దాడులు చేస్తూ తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. పులి సంచారంతో కొద్ది రోజులుగా మత్స్యకారులకు వేటలు లేవు, విద్యార్థులకు చదువులు లేవు, వ్యవసాయదారులు ఉపాధి పనులు లేవు. మొత్తానికి ఆ ప్రాంతవాసులకు కంటి మీద కునుకు లేదు.

Tiger Terror: ఉద్దానంలో పెద్దపులి టెర్రర్.. ఆవులపై దాడి.. ఉపాధికి కూడా వెళ్లని జనం.. బంధించండి మహాప్రభో అంటూ విన్నపం..
Tiger Terror
Follow us
S Srinivasa Rao

| Edited By: Surya Kala

Updated on: Nov 16, 2023 | 10:25 AM

శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దాన ప్రాంతంకి ఉద్యానవనం ఆని పేరు. ఓ వైపు సువిశాల సముద్ర తీర ప్రాంతం, మరో వైపు కొబ్బరి, జీడీ మామిడి, సరుగుడు తోటలు.. కొండలు, గుట్టలుతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే వన్య ప్రాణుల సంచారము ఇక్కడ ఎక్కువే. కోతులు, ఎలుగుబంట్లు, అడవి పిల్లులు, అడవి కుక్కలు, కొండచిలువలు విస్తారంగా సంచరిస్తూ ఉంటాయి. ఇవి సరిపడవన్నట్లు ఇపుడు పెద్దపులి వీటికి తోడయ్యింది. గత పది రోజులుగా ఉద్ధాన ప్రాంతంలో సంచరిస్తూ స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.

మందస , సోంపేట, కంచిలి, కవిటి మండలాల్లో ఇదిగో పాదముద్రలు అంటే అదుగో పులి అన్న చందంగా ఉంది పరిస్థితి. పశువులపైన పెద్దపులి దాడులకు తెగబడుతోంది. కంచిలి మండలం మండపల్లి గ్రామంలో ఒక ఆవుపై దాడి చేసింది పులి. ఓకే రోజు సోంపేట మండలం కర్తల పాలెంలో ఒక ఆవుపైన, కవిటి మండలం సహలాని పుట్టుకలో మరొక ఆవుపైన దాడి చేసి హతమార్చింది పెద్దపులి. శనివారం సాయంత్రం మందస మండలం బొందుకారి, పుట్టూరు గ్రామ రైతులు పొలానికి వెళ్లేసరికి పులి వరి పొలంలో నుంచి కనిపించడంతో గ్రామస్తుల గట్టిగా కేకలు పెట్టడంతో ఒరిస్సా సరిహద్దుగా సమీప కొండపైకి వెళ్ళిపోయింది పెద్దపులి.

పెద్దపులి సంచారం ఉద్దానం ప్రాంత ప్రజల ఉపాధి పైన తీవ్రప్రభాతం చూపిస్తుంది. పశువులపై దాడులు చేయటంతో పాటు పలువురు కంట పడటంతో రైతులు వ్యవసాయ పనులకు పొలాల్లోకి వెళ్ళాలన్నా, జీడీ, కొబ్బరి తోటలలోకి పనుల కోసం వెళ్ళాలన్న వణికిపోతున్నారు రైతులు. తుఫానులను సైతం లెక్కచేయకుండా సముద్రంలో వేటకు వెళ్లే మత్స్య కారులు కూడా చివరకు పెద్దపులి సంచారంతో  వణికిపోతున్నారు.

ఇవి కూడా చదవండి

మత్య్సకార గ్రామాలైన కవిటి మండలం ఇద్దువానిపాలెం, ఇసుకపాలెం, రామయపట్నం, బారువా కొత్తూరు, తీరప్రాంతాలైన గ్రామాలలోని సరుగుడు తోటల్లో పులి పాదముద్రలు కనిపించటంతో మత్స్య కారులు వేటకు వెళ్లేందుకు సంకోచిస్తున్నారు. అసలే తెల్లవారుజామున వేటకు బయలుదేరాల్సి ఉండటం పులి సంచారం కూడా రాత్రి పూటే ఎక్కువుగా ఉండటంతో మత్స్య కారులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. కొందరు వేటకు దూరంగా ఉంటూంటే మరికొందరు సాహసించి గుంపుగా వెళ్లి గుంపుగా వస్తూ వేటకు వెళుతున్నారు.

విద్యార్థులు స్కూలుకు వెళ్లాలన్న తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఇదే పులి గతంలో సరుబుజ్జిలి మండలం వెన్నెల వలస జవహర్ నవోదయ స్కూల్ సమీపంలో సంచరించటంతో కొద్ది రోజుల పాటు విద్యార్థులను క్లాస్ రూములకు హాస్టల్ రూం లకే పరిమితం చేసింది. యాజమాన్యం శనివారం మందస మండలం బొందు కారి, పుట్టూరు గ్రామ రైతులకు పెద్దపులి తారస పడటంతో అయా గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. అది సరిహద్దులోని ఒరిస్సా కొండలపైకి వెళ్లిపోయి ఆదివారం ఉదయం తిరిగి సరిహద్దులోని ఆంధ్రా గ్రామాల పొలిమేరల్లో సంచరించింది. దీంతో పాఠశాలకు వెళ్లాలని ఈ పులి భయంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాలు పుట్టురు , సిపి, దాల్సరా, కోయిసాల పలు గ్రామాలు పిల్లలు స్కూల్ కి వెళ్ళాలి అన్నాభయపడుతున్నారు. పులి భయంతో విద్యార్థులు స్కూల్ కి రావటం లేదని, తాము కూడా స్కూల్ కి వచ్చి తిరిగి ఇంటికి వెళ్ళే సమయంలో భయాందోళనకు గురవుతున్నమని చెబుతున్నారు టీచర్లు.  అధికారులకు చెలగాటం.. ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది పులిసంచారం. వ్యక్తులపై పులి దాడి చేసేంతవరకు సీరియస్ గా తీసుకోరా అంటూ ప్రజా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..