Vishakapatnam: విశాఖలో డేంజర్ బెల్స్.. దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత

విశాఖ నగరానికి మళ్లీ ఏమైంది..? ఒకవైపు ఫార్మా కంపెనీలు, మరోవైపు పోర్టు పొల్యూషన్.. ఇంకోవైపు దీపావళి పటాసులతో వాయు కాలుష్యం.. మొత్తంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ డెడ్‌-పూర్ స్థాయికి చేరి.. విశాఖ జనం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఊపిరి తీసుకోవాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి దాపురించబోతోందా? ఆసియా ఖండంలోనే శరవేగంగా అభివృద్ధి చెందే నగరాల్లో విశాఖ ఒకటి. కాస్మోపాలిటన్ కల్చర్, అద్భుతమైన సముద్ర తీరం, దట్టమైన తూర్పు కనుమల పర్వత శ్రేణులు

Vishakapatnam: విశాఖలో డేంజర్ బెల్స్.. దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత

| Edited By: Ravi Kiran

Updated on: Nov 18, 2023 | 9:42 AM

విశాఖ నగరానికి మళ్లీ ఏమైంది..? ఒకవైపు ఫార్మా కంపెనీలు, మరోవైపు పోర్టు పొల్యూషన్.. ఇంకోవైపు దీపావళి పటాసులతో వాయు కాలుష్యం.. మొత్తంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ డెడ్‌-పూర్ స్థాయికి చేరి.. విశాఖ జనం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఊపిరి తీసుకోవాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి దాపురించబోతోందా? ఆసియా ఖండంలోనే శరవేగంగా అభివృద్ధి చెందే నగరాల్లో విశాఖ ఒకటి. కాస్మోపాలిటన్ కల్చర్, అద్భుతమైన సముద్ర తీరం, దట్టమైన తూర్పు కనుమల పర్వత శ్రేణులు, దట్టమైన అటవీ ప్రాంతాలతో దేశంలో టాప్ టెన్ సిటీస్‌లో ముందువరుసలో ఉంది వైజాగ్. ఇది ఎంతటి ఆనందం కలిగించే అంశమో అంతే ఆందోళన కలిగించే విషయం ఇంకోటుంది. అదే కాలుష్యం. విశాఖ పోర్ట్ వల్ల వచ్చే కాలుష్యానికి ఫార్మా, ఆటోమొబైల్, ఇతర పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యానికి విశాఖ జనం ఇప్పటికే అల్లాడిపోతున్నారు. నగరం బౌల్ షేప్ లో ఉండడం, చుట్టూ కొండలు ఉండడంతో బయటకు వెళ్ళేమార్గం కాలుష్యం విశాఖను ఆక్రమించేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జమ్ముకాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. అదుపుతప్పి లోయలో పడిన బస్సు

Leo OTT: లీక్‌ దెబ్బకు దిగొచ్చిన టీం.. ముందుగానే ఓటీటీ స్ట్రీమింగ్…

Daily Horoscope: ఆ రాశివారిపై అష్టమ రాహు ప్రభావం అయినా ఆ ఒక్క శక్తితో రోజంతా శుభం

Follow us