Plane Ticket: రూ. 114కే విమానం టికెట్.! విమాన ప్రయాణికులకు కారు చౌకగా టికెట్లు.
చైనాలోని ఓ ప్రముఖ విమానయాన సంస్థలోని కంప్యూటర్ వ్యవస్థలో ఏర్పడ్డ సాంకేతిక లోపం కారణంగా కస్టమర్లకు కారు చౌకగా టికెట్లు లభించాయి. గాంగ్జూ ప్రావిన్స్ కేంద్రంగా చైనా సదరన్ ఎయిర్‌లైన్స్ సంస్థ పనిచేస్తోంది. దాని మొబైల్ యాప్‌లో ఇటీవల దాదాపు రెండు గంటలపాటు సమస్య తలెత్తింది. దీంతో ఆ సమయంలో కేవలం 1.30 డాలర్లకే విమానం టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. కస్టమర్లు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడం మొదలుపెట్టడంతో విషయం బయటికొచ్చింది.
చైనాలోని ఓ ప్రముఖ విమానయాన సంస్థలోని కంప్యూటర్ వ్యవస్థలో ఏర్పడ్డ సాంకేతిక లోపం కారణంగా కస్టమర్లకు కారు చౌకగా టికెట్లు లభించాయి. గాంగ్జూ ప్రావిన్స్ కేంద్రంగా చైనా సదరన్ ఎయిర్‌లైన్స్ సంస్థ పనిచేస్తోంది. దాని మొబైల్ యాప్‌లో ఇటీవల దాదాపు రెండు గంటలపాటు సమస్య తలెత్తింది. దీంతో ఆ సమయంలో కేవలం 1.30 డాలర్లకే విమానం టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. కస్టమర్లు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడం మొదలుపెట్టడంతో విషయం బయటికొచ్చింది. చెంగ్డూ నగరానికి రాకపోకలు సాగించే చాలా విమానాల టికెట్ ధరలు కేవలం 10 నుంచి 30 యువాన్లలోపే అంటే 1.37 డాలర్ల నుంచి 4.12 డాలర్లలోపే అందుబాటులో ఉంటున్నాయని వారు తెలిపారు. ఈ మొత్తాన్ని మన కరెన్సీలోకి మారిస్తే.. రూ.114 నుంచి టికెట్ ధర మొదలైందన్నమాట. వారు పోస్టు చేసిన స్క్రీన్ షాట్‌లో చెంగ్డూ-బీజింగ్ విమాన ప్రయాణ టికెట్ ధర కేవలం 1.37 డాలర్లుగా ఉంది. వాస్తవానికి ఇది కనీసం 55 డాలర్ల నుంచి 69 డాలర్ల మధ్యలో ఉంటుంది. ఈ రేటు రెండు గంటలపాటు సంస్థ మొబైల్ యాప్‌తోపాటు.. ట్రిప్.కామ్ వంటి టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లపై కూడా లభించింది. ఈ మొత్తంలో అదనపు ఛార్జీలు లేవు. అంటే దీనికి అదనంగా 15 డాలర్ల వరకు ఎయిర్‌పోర్టు ఫీజు, ఫ్యూయల్ సర్‌ఛార్జీల రూపంలో వసూలు చేయొచ్చని భావిస్తున్నారు. ఇక ఈ ఘటనపై విమానయాన సంస్థ సానుకూలంగానే స్పందించింది. ఈ సమయంలో కొనుగోలు చేసిన టికెట్లను ప్రయాణికులు వాడుకోవచ్చని తెలిపింది. ఈ సాంకేతిక సమస్యకు గల కారణాలను మాత్రం సదరు సంస్థ వెల్లడించలేదు. దీంతో వినియోగదారులు సంబరపడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.