Chandrayaan-3: నియంత్రణ కోల్పోయిన చంద్రయాన్-3 లాంచ్ వెహికల్.. వీడియో.
చంద్రయాన్-3ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టిన లాంచ్ వెహికల్ ఎల్‌వీఎం3 ఎం4లోని క్రయోజనిక్ పైభాగం నియంత్రణ కోల్పోయి భూ వాతావరణంలోకి ప్రవేశించింది. ఉత్తర పసిఫిక్ మహాసముద్రంపై దీని ప్రభావ పాయింట్ ఉన్నట్టు అంచనా వేసిన ఇస్రో.. దీని చివరి గ్రౌండ్ ట్రాక్ మాత్రం భారత్ మీదుగా వెళ్లలేడని తెలిపింది. బుధవారం మధ్యాహ్నం 2 గంటల 42 నిమిషాలకు ఇది భూ వాతావరణంలోకి ప్రవేశించినట్టు పేర్కొంది.
చంద్రయాన్-3ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టిన లాంచ్ వెహికల్ ఎల్‌వీఎం3 ఎం4లోని క్రయోజనిక్ పైభాగం నియంత్రణ కోల్పోయి భూ వాతావరణంలోకి ప్రవేశించింది. ఉత్తర పసిఫిక్ మహాసముద్రంపై దీని ప్రభావ పాయింట్ ఉన్నట్టు అంచనా వేసిన ఇస్రో.. దీని చివరి గ్రౌండ్ ట్రాక్ మాత్రం భారత్ మీదుగా వెళ్లలేడని తెలిపింది. బుధవారం మధ్యాహ్నం 2 గంటల 42 నిమిషాలకు ఇది భూ వాతావరణంలోకి ప్రవేశించినట్టు పేర్కొంది. చంద్రయాన్-3ని, 2023 జులై 14న విజయవంతంగా ప్రయోగించారు. 124 రోజుల తర్వాత రాకెట్ భాగం భూవాతావరణంలోకి ప్రవేశించింది. ఇంటర్ ఏజెన్సీ స్పేస్ డెర్బిస్ కో ఆర్డినేషన్ కమిటీ ప్రకారం ఎల్వవీఎం3 ఎం4 క్రయోజనిక్ ఎగువ దశ 25 ఏళ్ల జీవితకాలానికి అనుగుణంగా ఉన్నట్టు ఇస్రో తెలిపింది. ఐక్యరాజ్యసమితి, ఐఏడీసీ మార్గదర్శకాలను అనుసరించి చంద్రయాన్-3 ప్రొపల్షన్, ల్యాండింగ్ మాడ్యూళ్లు రాకెట్ నుంచి విడిపోయిన తర్వాత దాని అవశేషాలు, ఇంధన వనరులు ప్రమాదవశాత్తు పేలుడుకు గురికాకుండా ప్రమాద తీవ్రతను తగ్గించడానికి ఎగువ దశను నిష్క్రియాత్మకం చేశారు. అంతర్జాతీయంగా ఆమోదించిన మార్గదర్శకాలకు కట్టుబడి ఈ రాకెట్ బాడీని నిష్క్రియం చేయడం.. మిషన్ పూర్తయిన తర్వాత బాహ్య అంతరిక్ష కార్యకలాపాల దీర్ఘకాలిక స్థిరత్వాన్ని కాపాడటానికి భారత్ నిబద్ధతను ఇది మరోసారి పునరుద్ఘాటిస్తుంది అని ఇస్రో స్పష్టం చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

