AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YCP Vs TDP: అవనిగడ్డలో వైసీపీ వర్సెస్ టీడీపీ.. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో ఒక్కసారిగా పెరిగిన పొలిటిక్ హీట్

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో ఇప్పుడు రాజకీయ వేడి రగులుతోంది. కొంత కాలంగా తెలుగుదేశం - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర వివాదం సాగుతోంది. కొంత కాలంగా ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు టీడీపీ ఇంచార్జి బుద్ద ప్రసాద్. టీడీపీ ఆరోపణలకు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు.

YCP Vs TDP: అవనిగడ్డలో వైసీపీ వర్సెస్ టీడీపీ.. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో ఒక్కసారిగా పెరిగిన పొలిటిక్ హీట్
Buddha Prasad, Simhadri Ramesh Babu
pullarao.mandapaka
| Edited By: Balaraju Goud|

Updated on: Nov 16, 2023 | 10:45 AM

Share

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో ఇప్పుడు రాజకీయ వేడి రగులుతోంది. కొంత కాలంగా తెలుగుదేశం – వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర వివాదం సాగుతోంది. ఇక్కడ వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా సింహాద్రి రమేష్ బాబు ఉన్నారు. అసెంబ్లీ మాజీ స్పీకర్ బుద్ధ ప్రసాద్ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జిగా కొనసాగుతున్నారు. కొంత కాలంగా ఈ ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు టీడీపీ ఇంచార్జి బుద్ద ప్రసాద్. అసలు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని బుద్ద ప్రసాద్ విరుచుకుపడ్డారు.

టీడీపీ ఆరోపణలకు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బుద్ధ ప్రసాద్ రైతులకు కనీసం సాగునీరు అందించలేకపోయాడని, అవుట్ ఫాయిల్ స్లూయిజ్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయని ఎదురు దాడికి దిగారు. కాలువల అభివృద్ధి పేరుతో అవినీతికి పాలపడ్డారని ఆరోపిస్తున్నారు. ఇలా ఇద్దరు నేతలు ఒకరిపై మరొకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు…తాజాగా రెండు పార్టీల మధ్య వివాదం మరింత ముదిరింది. ఇటీవల టీడీపీ-జనసేన పార్టీలు ఉమ్మడిగా ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడి చేశాయి. ఇదికాకుండా వైసీపీ జెండాలు తగులబెట్టడం, కొత్తగా కట్టిన జెండా దిమ్మెలను పగలగొట్టడం తో ప్రశాంతంగా ఉన్న అవనిగడ్డలో అగ్నికి ఆజ్యం పోసినట్లైంది.

కొంతకాలం వరకూ టీడీపీ ఇంచార్జి మండలి బుద్ధ ప్రసాద్, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మధ్య కేవలం అవినీతి ఆరోపణల మీదే మాటల యుద్ధం జరిగింది. అయితే ఇటీవల టీడీపీ-జనసేన కలిసి ఉమ్మడిగా ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చాయి. సీఎం వైఎస్ జగన్ అవనిగడ్డ పర్యటనలో హామీ ఇచ్చిన విధంగా రూ. 93 కోట్లు నిధులు విడుదల చేయాలని డిమాండ్‌తో ఎమ్మెల్యే ఆఫీస్ ముట్టడికి బయలుదేరారు. అవనిగడ్డలో 144 సెక్షన్ ఉన్నప్పటికీ ఎమ్మెల్యే కార్యాలయం వైపు కొంతమంది టీడీపీ-జనసేన కార్యకర్తలు దూసుకెళ్లారు.

తన కార్యాలయం వైపు దూసుకొస్తున్న వారిని అడ్డుకునేందుకు ఎమ్మెల్యే రమేష్ బాబు సైతం స్వయంగా రంగంలోకి దిగారు. అప్పటి నుంచి అవనిగడ్డ లో రాజకీయం నివురుగప్పిన నిప్పులా మారింది. తాజాగా వారం క్రితం అవనిగడ్డ మండలం పులిగడ్డ పాతకోట వద్ద వైసీపీ జెండాను గుర్తుతెలియని వ్యక్తులు తగులబెట్టారు. వైసీపీ నిర్వహిస్తున్న పల్లెనిద్ర సమయంలో జెండా ఎగురవేశారు. ఈ జెండా తగులబెట్టి చిలకలపూడి పాపారావు పేరుతో ఉన్న జనసేన జెండా ఎగురవేశారు.

అయితే రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షులుగా ఉన్న చిలకలపూడి పాపారావు త్వరలో జనసేన పార్టీలో చేరేందుకు నిర్ణయించారు. కానీ ఈ ఘటనతో తనకు సంబంధం లేదని పాపారావు ఎమ్మెల్యేకు స్పష్టత ఇచ్చారు. ఇదిలా ఉండగా తాజాగా లంకమ్మ మాన్యం లో వైసీపీ జెండా దిమ్మెను గుర్తు తెలియని వ్యక్తులు ద్వంసం చేశారు. వైసీపీ టార్గెట్‌గా జరుగుతున్న ఘటనల వెనుక మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ పాత్ర ఉందంటున్నారు ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు. నాలుగున్నర సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్న అవనిగడ్డ నియోజకవర్గాన్ని గొడవల్లోకి నెడుతున్నారని మండిపడ్డారు. నాలుగు సంవత్సరాలుగా కనపడని బుద్ధప్రసాద్ ఇప్పుడు బయటకొచ్చి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బుద్ద ప్రసాద్ రెచ్చగొట్టే పనులు మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.

తెలుగుదేశం-జనసేన పార్టీల పొత్తు తర్వాత అవనిగడ్డ రాజకీయం మరింత వేడెక్కింది.అవనిగడ్డ లో జనసేన వారాహి యాత్ర సభ జరిగిన తర్వాత టీడీపీ దూకుడు పెంచింది. అటు వైసీపీ కూడా సామాజిక సాధికార యాత్ర ద్వారా తన సత్తా చాటింది. ఇలా అధికార ప్రతిపక్షాలు అవనిగడ్డలో గెలుపు లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. దీంతో గతంలో ఎప్పుడూ లేనివిధంగా అవనిగడ్డ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…