Ayyappa Puja: ఘనంగా అయ్యప్ప స్వాముల పొర్లు మహోత్సవం.. 108 మంది కన్నె స్వాములకు భిక్ష

కార్తీక మాసం ఆధ్యాత్మిక మాసం.. హరిహరులను అత్యంత భక్తిశ్రద్దలతో పూజించడమే కాదు.. హరిహరులు సుతుడు అయ్యప్ప స్వామిని కూడా పూజిస్తారు. మాల ధారణ చేసి.. మాల ధారణం.. నియమాల తోరణం అంటూ భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వాములు పూజలను చేస్తారు. స్వాములు చేసే పూజలు అందరిని ఆకట్టుకున్నాయి. ఏలూరులో అయ్యప్ప స్వాముల పొర్లు మహోత్సవం భక్తులను విశేషంగా ఆకర్షించింది.

Surya Kala

|

Updated on: Nov 16, 2023 | 8:02 AM

ఏలూరులో అయ్యప్ప స్వామి మాలధారులు పొర్లు మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అయ్యప్ప స్వామి మాలధారులు అత్యంత భక్తి నిష్టలతో పాల్గొన్నారు. ఏలూరులోని బాలాజీ థియేటర్ దగ్గర లింగమల్లు శ్రీనివాసేంద్ర బాబు మిల్లు ఆవరణలో గురుస్వాములు పొర్లు మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.

1 / 7
పొర్లు మహోత్సవం సందర్భంగా 108 మంది కన్నె స్వాములు ముందుగా అన్న సమారాధనలో భాగంగా భిక్ష స్వీకరించారు. అనంతరం స్వాములు భిక్ష చేస్తున్న సమయంలో వివాహం కాని వారు, సంతానం లేని వారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు...భిక్ష చేస్తున్న కన్నె స్వాముల వద్ద భిక్షాటన చేసుకుని ఆ ప్రసాదాన్ని తిని ఆశీర్వాదం పొందారు. 

2 / 7
ఇలా చేస్తే కోరికలు నెరవేరతాయని భక్తుల విశ్వాసం. అనంతరం స్వాములు భిక్ష చేసి వదిలిన ఎంగిలి ఆకుల్లో ముందుగా గురుస్వామి మూడుసార్లు అటు ఇటు పొర్లు ప్రదక్షిణలు చేశారు. తర్వాత ఆ ఎంగిలి ఆకులను ఒక బుట్టలో వేసి గురుస్వామి తలపై పెట్టుకుని మేళ తాళాలు, మంగళ వాయిద్యాలతో స్వాములందరూ కలిసి ఊరేగింపు నిర్వహించారు.

3 / 7
ఆ తరువాత ఆ ఎంగిలి ఆకుల గంపను ఏలూరులోని కృష్ణ కాలవ వద్దకు తీసుకువచ్చి గంపలోని ఎంగిలి ఆకులను కాలువ నీటిలో నిమజ్జనం చేశారు. దీన్నే పొర్లు మహోత్సవం అంటారు.

4 / 7
ఈ మహోత్సవాన్ని శబరిమలలోని పంబా నది ఒడ్డున మాత్రమే నిర్వహిస్తారు. కానీ గత కొంతకాలంగా ఏలూరులో ఈ పొర్లు మహోత్సవాన్ని గురుస్వాముల ఆధ్వర్యంలో 108 మంది కన్నె స్వాములతో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.

5 / 7
మాల ధారణం చేసి నియమాల తోరణం పాటిస్తూ ఏటా అయ్యప్ప స్వాములు ఎంతో నియమనిష్టలతో చేస్తున్న ఈ పొర్లు మహోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

6 / 7

ఈ మహోత్సవంలో పాల్గొనే భక్తుల సంఖ్య కూడా ఏటేటా పెరుగుతోంది. ఈ ఏడాది కూడా పెద్దఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

7 / 7
Follow us