AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oreo Biscuit Controversy: ఓరియో బిస్కెట్‌పై వివాదం.. క్రీమ్ తగ్గిపోతుందంటూ గగ్గొలుపెడతున్న కస్టమర్లు..విచారణ!

అయితే, దీనికి మరో కోణం కూడా ఉంది. కంపెనీలు పరిమాణంలో లేదా సృజనాత్మకతలో చిన్న తగ్గింపులను చేస్తాయి. ఎందుకంటే వారు తమ ప్రముఖ బ్రాండ్‌ల ధరను పెంచితే, అమ్మకాలు తగ్గుతాయి. కాబట్టి ఇలాంటి స్వల్ప మార్పుల ద్వారానే తమ బ్రాండ్‌లను లాభాల్లో నడిపించుకోవటానికి ప్రయత్నింస్తుంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. చాలా మంది దీని వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

Oreo Biscuit Controversy: ఓరియో బిస్కెట్‌పై వివాదం.. క్రీమ్ తగ్గిపోతుందంటూ గగ్గొలుపెడతున్న కస్టమర్లు..విచారణ!
Oreo Biscuits
Jyothi Gadda
|

Updated on: Nov 17, 2023 | 8:10 AM

Share

క్రీమ్ బిస్కెట్లు పిల్లలకు ఎంతో ఇష్టమైనవి. ఇవి అనేక రుచుల్లో పిల్లలు, పెద్దలకు నోరూరిస్తుంటాయి. అలాంటి బిస్కెట్లలో ఒకటి ఓరియో బిస్కెట్లు..ఓరియో, 1912లో ప్రవేశపెట్టబడిన ప్రముఖ కుకీ బ్రాండ్. క్రీమ్ బిస్కెట్ ప్రియులకు ఇష్టమైన ఓరియో బ్రాండ్‌ ఇప్పుడు వినియోగదారుల ఆగ్రహానికి గురైంది. సోషల్ మీడియాలో ఓరియో బిస్కెట్లపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఓరియో బిస్కెట్లలో క్రీమీనెస్ లేదని చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారు. బిస్కెట్లలో పూర్తిగా క్రీం తగ్గిపోయి అది సన్నటి పొరగా మాత్రమే ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే చాలా ఫిర్యాదులు వచ్చాయి. తాజాగా US నుండి కూడా పలువురు కస్టమర్‌లు ఓరియో బిస్కెట్లలో విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్యాకెట్‌పై చూపిన విధంగా కాకుండా ఇప్పుడు బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారని వారు వాపోతున్నారు.

US నివాసి షేన్ రాన్సోనెట్ అనే వ్యక్తి..తన భార్యతో కలిసి ఇటీవల ఓరియో ప్యాకెట్‌ని కొనుగోలు చేశాడు. అది డబుల్‌ స్టఫ్డ్‌ ఓరియో అనుకున్నారు. కానీ, తీరా చూస్తే.. అందులో క్రీమ్ ఫిల్లింగ్ తగ్గిందని గ్రహించారట. డబుల్ స్టఫ్ ఓరియో బిస్కెట్లలో క్రీమ్‌ మాత్రం చాలా తక్కువగా ఉందన్నారు. దీనిపై తాము వినియోగదారుల చట్టం ప్రకారం న్యాయం కోసం పోరాడుతామంటున్నారు. ఇకపోతే, Redditలో r/shrinkflation అనే పేజీలో Oreo అభిమానులు తమ బాధలను షేర్‌ చేశారు. ఒక వినియోగదారు కుకీ శాండ్‌విచ్ వీడియోను షేర్‌ చేశారు. బిస్కెట్‌లో క్రీమ్ పలుచని పొరగా మారిపోయిందని చూపిస్తూ సగానికి విభజించారు. ఒరియోస్‌లో ఇప్పుడు క్రీమ్‌ తక్కువగా ఉందా? అంటూ చాలా మంది నెటిజన్లు ప్రశ్నించారు.

అయితే, దీనికి మరో కోణం కూడా ఉంది. కంపెనీలు పరిమాణంలో లేదా సృజనాత్మకతలో చిన్న తగ్గింపులను చేస్తాయి. ఎందుకంటే వారు తమ ప్రముఖ బ్రాండ్‌ల ధరను పెంచితే, అమ్మకాలు తగ్గుతాయి. కాబట్టి ఇలాంటి స్వల్ప మార్పుల ద్వారానే తమ బ్రాండ్‌లను లాభాల్లో నడిపించుకోవటానికి ప్రయత్నింస్తుంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. చాలా మంది దీని వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

Oreos have way less cream now? byu/Haydenbrookfield inshrinkflation

అయితే ఓరియో బిస్కెట్లలో అలాంటి మార్పు ఏమైనా ఉందా అనేది స్పష్టంగా తెలియలేదు. కానీ, యునైటెడ్ స్టేట్స్‌లో అత్యధికంగా అమ్ముడైన కుకీ బ్రాండ్, Oreo 2014 నాటికి ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చేసింది. Oreo ను Mondelez ఇంటర్నేషనల్ నాబిస్కో క్యాడ్‌బరీ తయారు చేసింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..