Andhra Pradesh: ఆ మూడు గంటలు..! ఘాట్ రోడ్ లో ఆర్టీసీ ప్రయాణికుల నరకయాతన..!
Visakhapatnam: బస్సు ఆగిపోయిన విషయాన్ని డ్రైవర్.. విశాఖ డిపో ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించారు. ఉన్నతాధికారులు నర్సీపట్నం డిపోకు చెందిన బస్సును పంపించి బస్సులో ఉన్న ప్రయాణికులను భద్రాచలం తీసుకెళ్లారు. ఈ లోగా మరికొంతమంది ప్రైవేట్ వాహనాల్లో గమ్యస్థానాలకు వెళ్లారు. భద్రాచలం వెళ్లే మరికొంత మంది ప్రయాణికులు మాత్రం పాపం సుమారు మూడు గంటల పాటు బస్సులోనే నిరీక్షించారు.
విశాఖపట్నం, నవంబర్15;
అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో కండిషన్ లేని బస్సులను నడుపుతుండడంతో నిత్యం ఘాట్ రోడ్లో బస్సులు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా మరోసారి ఏపీ ఆర్టీసీ బస్సు అడవిలో ఆగిపోయింది. దీంతో 3 గంటలపాటు ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
అసలేం జరిగింది..
– విశాఖపట్నం డిపోకు చెందిన విశాఖపట్నం- భద్రాచలం వయా సీలేరు మీదుగా నడిచే అల్ట్రా డీలక్స్ సర్వీస్ సప్పర్ల ఘాట్ రోడ్లో ఆగిపోయింది. దట్టమైన అటవీ ప్రాంతంలో సాంకేతిక లోపాలు తలెత్తి బస్సు నిలిచిపోయింది. ఈ బస్సులో సీలేరు , ధారకొండ, మోతిగూడెం, భద్రాచలం కు చెందిన దాదాపు 20 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. అడవిలో మూడు గంటల పాటు ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. బస్సులో మహిళలు పిల్లలు కూడా ఉన్నారు.
ఆ మూడు గంటలు..!
– బస్సు ఆగిపోయిన విషయాన్ని డ్రైవర్.. విశాఖ డిపో ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించారు. ఉన్నతాధికారులు నర్సీపట్నం డిపోకు చెందిన బస్సును పంపించి బస్సులో ఉన్న ప్రయాణికులను భద్రాచలం తీసుకెళ్లారు. ఈ లోగా మరికొంతమంది ప్రైవేట్ వాహనాల్లో గమ్యస్థానాలకు వెళ్లారు. భద్రాచలం వెళ్లే ఆరుగురు ప్రయాణికులు సుమారు మూడు గంటల పాటు బస్సులోనే నిరీక్షించారు.
– దట్టమైన అటవీ ప్రాంతంలో బస్సు ఆగిపోవడంతో నానా అవస్థలు పడ్డారు ప్రయాణికులు. సిలేరు వచ్చి భోజనాలు చేసి భద్రాచలం బయలుదేరారు.. ఘాట్ రోడ్ లో కండిషన్లో ఉన్న బస్సులను నడపాలని కోరుతున్నారు ప్రయాణికులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..