Karthika Masam: తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ.. ఇల్లు వాకిళ్లలో దీపాల వెలుగులు.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు..

భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పలు ఆలయాల్లో స్వామివార్లకు ప్రత్యేకంగా నిర్వహించే గర్భాలయం, సామూహిక అభిషేకలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇలా ప్రతి ఆలయంలో భక్తుల రద్దీ నేపథ్యంలో తగిన జాగ్రత్తలను తీసుకుంటున్నారు ఆయా ఆలయ అధికారులు..నెల రోజుల పాటు ప్రత్యేక పూజలతో, భక్తి శ్రద్ధ లతో ఎన్నో విశిష్టమైన పూజలు చేయనున్నారు ఆలయ అర్చకులు..

Karthika Masam: తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ.. ఇల్లు వాకిళ్లలో దీపాల వెలుగులు.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు..
Karthika Masam
Follow us
Peddaprolu Jyothi

| Edited By: Jyothi Gadda

Updated on: Nov 15, 2023 | 12:46 PM

హైదరాబాద్, నవంబర్15; హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం ప్రారంభం అయింది…శ్రీ మహా విష్ణువు, శివుడికి అత్యంత ఇష్టమైన మాసం కార్తీక మాసం…కార్తీక మాసం ప్రారంభం అవ్వడం తో తెలుగు రాష్ట్రాలలో ఆలయాలకు భక్తులు పోటెతుతున్నారు.. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు.. నగరంలో కూడా కార్తీక మాస శోభ కనిపిస్తుంది… వివిధ ఆలయాలలో భక్తులు భారి ఎత్తున చేరుకొని పూజలు చేస్తున్నారు..కార్తీక మాసంలో శనివారం, ఆదివారం, సోమవారాలలో భక్తులు ఆలయాలకు పోటెత్తుతున్నారు…దీంతో ఆలయా నిర్వాహకులు, అధికార సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు…

నగరంలోని శివాలయలతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఉన్న శైవ క్షేత్రాలు,  భద్రాచలం, శ్రీశైలం, వేములవాడ, తిరుపతి, విజయవాడ దుర్గమ్మ వంటి ప్రధానా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి…కార్తీక మాసంలో అతి ముఖ్యం గా అయ్యప్ప మాలలు ధరించి ఉదయాన్నే ఆలయాలకు స్వాములు దైవ దర్శనం కోసం వస్తారు.. దీంతో ఉదయం నుండి సాయంత్రం వరకు విపరీతమైన రద్దీ తో ఆలయాలు కనిపిస్తున్నాయి… కార్తీక మాసంలో చాలా మంది భక్తులు తమకు ఉన్న దోషం పోయి మంచి జరగాలని వివిధ రకాల పూజలు చేయించుకుంటారు..ఇలా ప్రతి ఆలయం భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

ఇక కార్తీక మాసంలో పూలు, పండ్ల కు సైతం ఫుల్ డిమాండ్ పెరిగింది… ఎంతో భక్తి శ్రద్ధలతో చేసే కార్తీక మాసం పూజలలో చాలా మంది ఉప వాసం ఉంటారు…అప్పుడు కేవలం పండ్లు మాత్రమే తీసుకుంటారు. పండ్ల రేట్లు భారీగా పెరిగాయంటున్నారు భక్తులు. మరోవైపు పూలకు సైతం అదే డిమాండ్ పెరిగింది.. మార్కెట్ లో తిరొక్క పూలు కనిపిస్తూ కనివిందు చేస్తున్నాయి…కానీ, రేట్లు పూల ధరలు మాత్రం కళ్లు తిరిగేలా చేస్తున్నాయంటున్నారు. అయినప్పటికీ కొనకతప్పటం లేదంటున్నారు భక్తులు. ఇక తమకు గిరాకీ కూడా పెరగడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు పూల వ్యాపారులు. ఇలా కార్తీక మాసంతో ఆలయాలలో భక్తులతో కిటకిటలతో పాటు వ్యాపారులకు సైతం పండగ వాతావరణం నెలకొంది.

ఇవి కూడా చదవండి

శ్రీశైలం పుణ్యక్షేత్రంలో కార్తీకమాసం ప్రత్యేక పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి అయితే ఈ కార్యక్రమాలు డిసెంబర్ 13 వరకు కొనసాగనున్నాయి.  భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని స్వామివారికి ప్రత్యేకంగా నిర్వహించే గర్భాలయం సామూహిక అభిషేకలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇలా ప్రతి ఆలయంలో భక్తుల రద్దీ నేపథ్యంలో తగిన జాగ్రత్తలను తీసుకుంటున్నారు ఆయా ఆలయ అధికారులు..నెల రోజుల పాటు ప్రత్యేక పూజలతో, భక్తి శ్రద్ధ లతో ఎన్నో విశిష్టమైన పూజలు చేయనున్నారు ఆలయ అర్చకులు..దీంతో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..