AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వార్నీ.. రైలు ఎక్కాలంటే.. ఇంత సర్కాస్‌ చేయాలా..? వైరలవుతున్న వీడియో చూస్తే..

దేశంలో పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీ భారతీయ రైల్వే ప్రయాణానికి పెద్ద అవరోధంగా మారుతోంది. పండుగల వేళ  చాలా మంది తమ స్వగ్రామాలకు వెళ్లడంతో, రైల్వే అదనపు రైళ్లను కూడా నడుపుతుంది. డిమాండ్‌కు అనుగుణంగా ప్రస్తుత రైళ్ల షెడ్యూల్‌ను కూడా పొడిగించింది. అయితే రైళ్లు, ట్రిప్పుల సంఖ్య పెరిగినా ప్రయాణికుల రద్దీ మాత్రం విపరీతంగానే కొనసాగింది. ఇకపోతే, వైరల్‌ వీడియోలో ఒక వ్యక్తి రద్దీగా ఉన్న రైలు ఎక్కేందుకు సర్కాస్ ఫీట్లు చేస్తున్నాడు..

Viral Video: వార్నీ.. రైలు ఎక్కాలంటే.. ఇంత సర్కాస్‌ చేయాలా..? వైరలవుతున్న వీడియో చూస్తే..
Overcrowded Train
Jyothi Gadda
|

Updated on: Nov 15, 2023 | 11:59 AM

Share

దీపావళి పండుగను దేశవ్యాప్తంగా ఉత్సాహంగా జరుపుకున్నారు ప్రజలు. దీపావళి పండగ పర్వదినాల సందర్భంగా చాలా మంది ప్రజలు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు పయనమయ్యారు. ప్రయాణికుల రద్దీతో రోడ్లు, రైల్వే మార్గాలన్నీ కిక్కిరిపోయాయి. హైవేలపై పెద్దఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రజలు గంటల తరబడి రోడ్లపైనే ఇరుక్కుపోవాల్సి వచ్చింది. వారాంతం, దీపావళి పండగ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు కూడా ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడాయి. రైళ్లలో కిక్కిరిసిన జనాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా అలాంటిదే.. భారతీయ రైల్వే పనితీరుపై ప్రశ్నలు కురిపిస్తున్న ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వీడియోలో ఒక వ్యక్తి రద్దీగా ఉండే రైలు కంపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉండడంతో అతడు ఎంత ప్రయత్నించినా రైలు లోపలికి వెళ్లలేకపోయాడు. వివరాల్లోకి వెళితే..

వైరల్ అయిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. వైరల్ అయిన వీడియోలో రైలు కోచ్‌లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రయాణికులు డోర్‌లో కూడా వేలాడుతున్నారు. దాదాపు 10 మంది వ్యక్తులు రైలులోని ఒక డోర్‌లో గుమికూడిన వారంతా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇంతలో కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్లేందుకు ఓ ప్రయాణికుడు రెయిలింగ్‌కు వేలాడుతున్నాడు. ట్రైన్‌ లోపలికి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు..మనుషుల తలలపై నుండి రైలు డోర్‌పైన పట్టుకుని వేలాడుతూ రైల్లో కాలు మోపేందుకు ట్రై చేశాడు.. కానీ, పాపం అతడి ప్రయత్నం బెడిసి కొట్టింది.. ఎంత ప్రయత్నించినా.. అతన్ని ఎవరూ లోపలికి వెళ్లనివలేదు..తీరా చూస్తే అతడు ప్లాట్‌ఫామ్‌పైనే దిగిపోయాడు..అతని ప్రయత్నం చూసిన చుట్టుపక్కల ప్రజలు, ప్రయాణికులు అతన్ని చూసి తెగ నవ్వుకుంటున్నారు… ఆ వ్యక్తి చివరకు తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. లాభం లేదనుకుని బయటకు వచ్చేశాడు. ఆ సమయంలో పోలీసులు తమకు ఎటువంటి సాయం చేయలేదని మండిపడ్డాడు. తనను రైలు నుంచి తోసేశారని సదరు వ్యక్తి వాపోయాడు.

ఇవి కూడా చదవండి

దీపావళి సందర్భంగా ప్రయాణికుల రద్దీ భారతీయ రైల్వే ప్రయాణానికి పెద్ద అవరోధంగా మారుతోంది. పండుగల వేళ  చాలా మంది తమ స్వగ్రామాలకు వెళ్లడంతో, రైల్వే అదనపు రైళ్లను కూడా నడుపుతుంది. డిమాండ్‌కు అనుగుణంగా ప్రస్తుత రైళ్ల షెడ్యూల్‌ను కూడా పొడిగించింది. అయితే రైళ్లు, ట్రిప్పుల సంఖ్య పెరిగినా ప్రయాణికుల రద్దీ మాత్రం విపరీతంగానే కొనసాగింది. ఇకపోతే, వైరల్‌ వీడియో గుజరాత్‌కు చెందినదిగా తెలిసింది.

గుజరాత్‌లోని వడోదరకు చెందిన ఒక ప్రయాణికుడు ఎక్స్‌లో (గతంలో ట్విట్టర్) ఈ వీడియోని పోస్ట్‌ చేశాడు. అతడు టికెట్ ఉన్నప్పటికీ రైలు ఎక్కలేకపోయాడు. రైలు ఎక్కేందుకు జనాలు అంతలా ఎగబడుతున్నా కూడా ఎవరూ పట్టించుకోలేదని రాశాడు. ఇదిలా ఉంటూ సూరత్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీతో తొక్కిసలాట జరిగినట్టుగా తెలిసింది. దీపావళికి స్వగ్రామాలకు వెళ్లే జనం పెద్ద ఎత్తున స్టేషన్‌కు చేరుకోవడంతో రైలు ఎక్కేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలన్నీ రైల్వే యంత్రాంగం పని తీరుపై అనేక సందేహాలు, ప్రశ్నలు సంధిస్తూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..