AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రూరత్వానికి ఉరి..! ఆలువా చిన్నారి హత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు.. బాలల దినోత్సవం నాడే..

ఆ చిన్నారికి స్వీట్లు, చాక్లెట్ల ఆశచూపించి ఎత్తుకెళ్లాడు నిందితుడు అష్వాక్‌ ఆలం. పీకల దాకా తాగిన మద్యం మత్తులో చిన్నారిపై పైశాచికంగా ప్రవర్తించాడు. చిన్నారిపై కిరాతకంగా అత్యాచారం చేశాడు. అనంతరం గొంతు నులిమి చంపేశాడు. మరోవైపు చిన్నారి కనిపించకపోవడంతో ఆ తల్లిదండ్రులు ఆందోళనపడ్డారు. ఆచూకీ కోసం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సమీపంలోని సీసీ టీవి ఫుటేజీలను పరిశీలించగా నిందితుడు అష్వాక్‌ ఆలం చిన్నారిని ఎత్తుకెళ్లినట్టుగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా చిన్నారి ఆచూకీ తెలిసింది.

క్రూరత్వానికి ఉరి..! ఆలువా చిన్నారి హత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు.. బాలల దినోత్సవం నాడే..
Pocso Court
Jyothi Gadda
|

Updated on: Nov 15, 2023 | 10:35 AM

Share

అలువాలో ఐదేళ్ల చిన్నారిని అపహరించి, అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో నిందితుడు అష్వాక్‌ ఆలం(28)కు ఎర్నాకులం పోక్సో కోర్టు మంగళవారం మరణశిక్ష విధించింది. బాలికపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడి, హత్యచేసిన కామాంధుడికి మరణ శిక్ష విధించింది కోర్టు. ముక్కపచ్చలారని చిన్నారి పట్ల నిందితుడు ప్రవర్తించి తీరు చాలా దారుణమని, హేయమైన చర్యగా కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్నారిపై అత్యాచారం తర్వాత బాలిక శవాన్ని గోనెసంచిలో కుక్కి చెత్త డంప్ లో పడవేయటం పట్ల కోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

జూలై 28న రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ భయంకరమైన సంఘటన జరిగింది. కొచ్చి సమీపంలోని అలువాలో అద్దెకు ఉంటున్న దంపతుల కూమార్తె ఐదైళ్ల చిన్నారి ఆడుకుంటూ కిడ్నాప్‌ అయ్యింది. ఆ చిన్నారికి స్వీట్లు, చాక్లెట్ల ఆశచూపించి ఎత్తుకెళ్లాడు నిందితుడు అష్వాక్‌ ఆలం. పీకల దాకా తాగిన మద్యం మత్తులో చిన్నారిపై పైశాచికంగా ప్రవర్తించాడు. చిన్నారిపై కిరాతకంగా అత్యాచారం చేశాడు. అనంతరం గొంతు నులిమి చంపేశాడు. మరోవైపు చిన్నారి కనిపించకపోవడంతో ఆ తల్లిదండ్రులు ఆందోళనపడ్డారు. ఆచూకీ కోసం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సమీపంలోని సీసీ టీవి ఫుటేజీలను పరిశీలించగా నిందితుడు అష్వాక్‌ ఆలం చిన్నారిని ఎత్తుకెళ్లినట్టుగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా చిన్నారి ఆచూకీ తెలిసింది.

ఇవి కూడా చదవండి

స్థానిక మార్కెట్‌ వద్ద ఉన్న డంపింగ్‌ యార్డులో గోనె సంచిలో కుక్కి పడేసిన బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టు మార్టంలో చిన్నారిపై జరిగిన దారుణం వెల్లడైంది. పసికందుపై అత్యాచారం జరిపి గొంతు నులిమి హత్య చేసినట్లుగా తేలింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం నిందితుడిని దోషిగా తేలుస్తూ.. మరణ శిక్ష విధించింది. బాలల దినోత్సవం (నవంబర్ 14) నాడు కోర్టు తీర్పు వెల్లడించడంతో దేశవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

దేశంలో ఎన్ని చట్టాలు అమల్లోకి వచ్చినా, ఎంతమంది నిందితులకు మరణ శిక్షలు విధించిన కామాంధుల్లో మార్పు రావటం లేదు. ప్రపంచానికి తెలిసి కొన్ని సంఘటనలు మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. ఆలువా వంటి చిన్నారులు మరెందరో అభం శుభం తెలియని పసికందుల జీవితాలు చీకట్లోనే కనుమరుగై పోతున్నాయి. వారందరి ఆత్మలు గాల్లోనే మూగగా రోధిస్తున్నాయి..కామ పీశాచులు అంతమైన నాడు మాత్రమే ఈ భూమిపై ఆడపిల్ల హాయిగా ఆడుకునేది. జీవించేది.. అప్పటి వరకు ఎదురు చూడాల్సిందే..!

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..