Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vocal for local: చైనా కొంపముంచిన ప్రధాని మోదీ లోకల్ ఐడియా.. లక్ష కోట్ల ఆదాయానికి గండి!

భారత ప్రధాని నరేంద్ర మోదీ వోకల్‌ ఫర్‌ లోకల్‌ నినాదం చైనా కొంపముంచింది. చైనా వస్తువులను బహిష్కరించాలన్న మోదీ ప్రకటనతో ఆ దేశానికి భారత్‌ నుంచి లక్ష కోట్ల ఆదాయం తగ్గింది. దీపావళి లాంటి పండుగ సీజన్‌లో స్వదేశీ వస్తువుల వైపు కస్టమర్లు మొగ్గు చూపారు.

Vocal for local: చైనా కొంపముంచిన ప్రధాని మోదీ లోకల్ ఐడియా.. లక్ష కోట్ల ఆదాయానికి గండి!
Modi On China Busiiness
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 15, 2023 | 8:34 AM

భారత ప్రధాని నరేంద్ర మోదీ వోకల్‌ ఫర్‌ లోకల్‌ నినాదం చైనా కొంపముంచింది. చైనా వస్తువులను బహిష్కరించాలన్న మోదీ ప్రకటనతో ఆ దేశానికి భారత్‌ నుంచి లక్ష కోట్ల ఆదాయం తగ్గింది. దీపావళి లాంటి పండుగ సీజన్‌లో స్వదేశీ వస్తువుల వైపు కస్టమర్లు మొగ్గు చూపారు.

భారత్‌లో దీపావళి సంబరాలు చైనాకు ఊహించని షాక్‌ కలిగించాయి. దీపావళి సంబరాలతో చైనాకు లక్ష కోట్ల ఆదాయం తగ్గింది. మన దేశంలో ప్రతి ఏడాది రక్షా బంధన్‌తో ప్రారంభమైన ఫెస్టివల్‌ సీజన్‌ న్యూ ఇయర్‌ వరకు.. ఇలా ఐదు నెలల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో వ్యాపారస్తులు, ఎగుమతిదారులు పండగ సమయాల్లో ప్రజలకు అవసరమయ్యే నిత్యవసర వస్తువుల్ని చైనా నుంచి భారత్‌కు తెస్తుంటారు. ఆ మొత్తం విలువ సుమారు రూ.80 వేల కోట్లు.

అయితే గల్వాన్‌ ఘటన తరవాత ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో పెనుమార్పులు వచ్చాయి. చైనాకు చెక్‌ పెట్టే విధంగా ప్రధాని మోదీ పావులు కదుపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’ పేరుతో ప్రజలు దేశీయ ఉత్పత్తులకు మద్దతు ఇవ్వాలని పిలుపు నిచ్చారు. అలా దేశంలో చైనా ఉత్పత్తులపై మొదలైన బాయ్‌కాట్‌ ఉద్యమం ప్రతి ఏడు చైనాను కోలుకోలేని దెబ్బ తీస్తుంది. ఫలితంగా ఈ ఏడాదిలో దీపావళి వరకు జరిగిన పండుగుల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో రూ.3.75 లక్షల కోట్ల విలువైన వ్యాపార లావాదేవీలు జరిగాయని వ్యాపార సంస్థల సంఘం.. కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ పేర్కొంది. నవంబర్‌ 14 నుంచి ప్రారంభమయ్యే గోవర్ధన్ పూజ, భాయా దూజ్, నవంబర్‌ 19 ఛాత్ పూజ, నవంబర్‌ 24న జరిగే తులసీ వివాహ్ వంటి పర్వదినాల నేపథ్యంలో మరో రూ.50 వేల కోట్ల విలువైన వ్యాపారం జరిగే అవకాశం ఉందని కెయిట్ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు.

నాలుగు రోజుల పాటు జరిగిన దీపావళి ఫెస్టివల్‌ సీజన్‌లో దేశ వ్యాప్తంగా స్థానిక ఉత్పత్తుల అమ్మకాలతో చైనాకు రూ.1 లక్ష కోట్ల ఆదాయం తగ్గిందని వెల్లడించారు. ‘ఇంతకుముందు దేశవ్యాప్తంగా దీపావళి సందర్భంగా దాదాపు 70 శాతం చైనా ఉత్పత్తులే అమ్ముడయ్యేవి. కానీ ప్రధాని నరేం ద్రమోదీ అభ్యర్థన మేరకు వ్యాపారులు స్థానిక ఉత్పత్తులనే విక్రయించారు. వినియోగదారులు కూడా దేశీయ ఉత్పత్తులను ఆదరించారు’ అని కెయిట్ సెక్రటరీ జెనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్కొన్నారు. అయితే ఇదే పరంపర కొనసాగితే, స్వదేశీయ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి, చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీయొచ్చంటున్నారు ఆర్థిక నిపుణులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…