Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జిమ్‌కి వెళ్తున్నారా? వ్యాయామమే కాదు.. మీ గుండెను సురక్షితంగా ఉంచుకోడానికి ఈ పనులు కూడా తప్పనిసరి..

మీరు వర్కవుట్ చేసినంత మాత్రాన మీకు ఆరోగ్య సమస్యలు, అనారోగ్యాలు దరిచేరవు అనే అతి విశ్వాసం వద్దు. ఆరోగ్యంలో మార్పులు, ఏవైనా వ్యాధుల లక్షణాలను సకాలంలో గుర్తించేలా అవగాహన కలిగి ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శ్వాస ఆడకపోవడం, అసాధారణమైన గురక, అలసట, తల తిరగడం, ఊపిరి ఆడకపోవడం, ఛాతీ నొప్పి వంటి లక్షణాలను నిశితంగా పరిశీలించాలి. అటువంటి సమస్యలు గమనిస్తే గనుక వెంటనే మీ వ్యాయామం ఆపేయటం మంచిది.

జిమ్‌కి వెళ్తున్నారా? వ్యాయామమే కాదు.. మీ గుండెను సురక్షితంగా ఉంచుకోడానికి ఈ పనులు కూడా తప్పనిసరి..
Gym Exercise
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 15, 2023 | 7:13 AM

జిమ్‌కి వెళ్లి వర్కవుట్ చేయడం వల్ల తమ గుండె ప్రమాదంలో పడుతుందా..? వర్కవుట్‌ల సమయంలో గుండెపోటు ఎందుకు వస్తుంది..? అని చాలా మంది ఆలోచిస్తుంటారు. ఎందుకంటే..జిమ్‌లో శిక్షణ పొందుతున్న సమయంలో గుండెపోటు, గుండెపోటుతో మరణాలు సంభవిస్తున్నాయనే వార్తలు ఇటీవలి కాలంలో చాలా వింటున్నాం. ఇది ఖచ్చితంగా ఫిట్‌నెస్ ఔత్సాహికులలో కొంత ఆందోళన కలిగిస్తుంది. అయితే మీరు కూడా జిమ్‌కి వెళ్తున్నట్టయితే..కొన్ని ముఖ్యమైన విషయాలను తప్పక తెలుసుకోవాలి..జిమ్‌లో వ్యాయామం చేయడం ఎలా..? అన్న విషయం మీద అవగాహన పెంచుకోవడంతో పాటు.. అసలు జిమ్‌లో ఎలా వ్యవహరించాలో కూడా తెలుసుకొని ఉండాలి. అయితే,జిమ్‌కి వెళ్లి వ్యాయామం చేయడం వల్ల గుండెకు ఎలాంటి హాని జరగదని ముందుగా తెలుసుకోవాలి. కానీ వ్యాయామం చేసే సమయంలో గుండెపోటు రావచ్చు. ఇది మామూలు విషయం కాదు. వాస్తవం ఏమిటంటే ఇలాంటి ఘటనల వెనుక ఇతర కారణాలు ఉన్నాయి. అవేంటంటే..

ప్రధానంగా మనకు తెలియకుండానే మనకు వచ్చే గుండె జబ్బులు ఇక్కడ విలన్‌లుగా మారాయి. ‘కరోనరీ ఆర్టరీ డిసీజ్’, ‘కార్డియోమయోపతి’ మరియు ‘కాన్జెనిటల్ హార్ట్ డిసీజ్’ వంటి పరిస్థితులు ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్, కార్డియాక్ అరెస్ట్‌కు దారితీస్తాయి. ఇతర లక్షణాల ద్వారా ఇది ముందు అర్థం చేసుకోని వారికి, వారు హై ఎక్సర్‌సైజులు చేస్తున్న క్రమంలో హార్ట్‌పై ప్రభావం పడుతుంది. అయితే రెగ్యులర్ గా జిమ్ కి వెళ్లి వర్కవుట్ చేసే వారికి అలాంటి సంక్షోభం రాకుండా ఉండాలంటే హార్ట్ సేఫ్టీ కోసం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది.

క్రమం తప్పకుండా జిమ్‌కు వెళ్లేవారు, క్రీడా ఔత్సాహికులు, క్రీడాకారులు నిర్ణీత వ్యవధిలో ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవటం మంచిది. ముఖ్యంగా ఇంట్లో లేదా కుటుంబంలో ఎవరికైనా గుండె సమస్యలు ఉంటే, కనీసం సంవత్సరానికి ఒకసారి ECG, Echo, TMT, లిపిడ్ ప్రొఫైల్ & FBS పరీక్షలు చేయించుకోండి. ఇలా గుండె సంబంధిత వ్యాధుల పట్ల అవగాహన లేకపోవడం, జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

కేవలం జిమ్‌కి వెళ్లి మీరు వర్కవుట్ చేస్తున్నారని అనుకోకండి. అన్ని వేళలా అనారోగ్యంగా ఉండకండి. ముఖ్యంగా చెడు ఆహారం, మాదక ద్రవ్యాల వినియోగం. ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం తీసుకోండి. అప్పుడు శరీరానికి కావల్సిన అన్ని పోషకాలు అందుతాయి.

మీరు వర్కవుట్ చేసినంత మాత్రాన మీకు ఆరోగ్య సమస్యలు, అనారోగ్యాలు దరిచేరవు అనే అతి విశ్వాసం వద్దు. ఆరోగ్యంలో మార్పులు, ఏవైనా వ్యాధుల లక్షణాలను సకాలంలో గుర్తించేలా అవగాహన కలిగి ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శ్వాస ఆడకపోవడం, అసాధారణమైన గురక, అలసట, తల తిరగడం, ఊపిరి ఆడకపోవడం, ఛాతీ నొప్పి వంటి లక్షణాలను నిశితంగా పరిశీలించాలి. అటువంటి సమస్యలు గమనిస్తే గనుక వెంటనే మీ వ్యాయామం ఆపేయటం మంచిది. వెంటనే వైద్యుడి సంప్రదించి తగిన టెస్టులు చేయించుకోవటం కూడా మంచిది.

గుండెపోటు వంటి తీవ్రమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం చేయాలో కూడా మీరు తెలుసుకోవాలి. అవసరమైతే CPR లేదా AEDని ఎలా నిర్వహించాలో తెలుసుకోవాలి. ఇది జిమ్‌లో వర్కవుట్ చేసే వారికే కాదు అందరూ తెలుసుకోవాల్సిన విషయం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

మీ కలలలో వీటిని చూసినట్లయితే అమ్మవారు మీ పట్ల దయతో ఉందని అర్థమట
మీ కలలలో వీటిని చూసినట్లయితే అమ్మవారు మీ పట్ల దయతో ఉందని అర్థమట
నా కొడుకును బలి పశువును చేస్తున్నారు.. పృథ్వీరాజ్ సుకుమార్ తల్లి.
నా కొడుకును బలి పశువును చేస్తున్నారు.. పృథ్వీరాజ్ సుకుమార్ తల్లి.
యూపీఐ నుండి బ్యాంకుల వరకు.. ఏప్రిల్ 1 నుండి అనేక నియమాలు మార్పు!
యూపీఐ నుండి బ్యాంకుల వరకు.. ఏప్రిల్ 1 నుండి అనేక నియమాలు మార్పు!
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో వీడుతున్న చిక్కుముళ్లు..
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో వీడుతున్న చిక్కుముళ్లు..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రిజక్ట్ చేసిన టాప్ 5 సినిమాలు ఇవే!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రిజక్ట్ చేసిన టాప్ 5 సినిమాలు ఇవే!
పెళ్లివేడుకలో కూతురు ఆద్య, భార్య ఐష్‌తో కలిసి సందడి చేసిన అభిషేక్
పెళ్లివేడుకలో కూతురు ఆద్య, భార్య ఐష్‌తో కలిసి సందడి చేసిన అభిషేక్
Tv9 సమ్మిట్‌..అబుదాబిలో మోదీ ప్రసంగాన్ని విన్న లులు గ్రూప్ అధినేత
Tv9 సమ్మిట్‌..అబుదాబిలో మోదీ ప్రసంగాన్ని విన్న లులు గ్రూప్ అధినేత
వీరిని అస్సలు నమ్మకూడదు.. విదుర నీతి ఏం చెబుతుందో తెలుసా..?
వీరిని అస్సలు నమ్మకూడదు.. విదుర నీతి ఏం చెబుతుందో తెలుసా..?
ఏంటీ కీర్తి ఇలా మారిపోయింది.. బ్లాక్ చీరలో కీర్తిసురేష్ ఫొటోస్!
ఏంటీ కీర్తి ఇలా మారిపోయింది.. బ్లాక్ చీరలో కీర్తిసురేష్ ఫొటోస్!
ఉదయాన్నే ఆలయం ఓపెన్ చేసి షాక్‌కు గురైన అర్చకుడు
ఉదయాన్నే ఆలయం ఓపెన్ చేసి షాక్‌కు గురైన అర్చకుడు