పాలకూరను సూపర్ ఫుడ్ అంటారు. ఈ సీజన్‌లో పాలకూర తినడం వల్ల ఏడాది పొడవునా ఆరోగ్యంగా జీవించవచ్చు. అయితే పాలకూర చర్మ సంరక్షణకు కూడా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పాలకూరలో ఫైబర్, ప్రొటీన్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కెలతోపాటు ఐరన్, ఫోలేట్, పొటాషియం కూడా ఉన్నాయి. ఈ పదార్థాలు చర్మ సమస్యలను తగ్గించి, చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి.