- Telugu News Photo Gallery Detoxification: These three Ways To Detox The Body With Turmeric In This Festive Season
Turmeric for Health: పసుపును ఈ మూడు మార్గాల్లో తీసుకున్నారంటే.. శరీరంలో మలినాలు ఇట్టే కొట్టుకుపోతాయ్!
గతితప్పిన వేళల్లో ఆహారం తినడం, తాగడం వల్ల కొలెస్ట్రాల్, మధుమేహం వంటి వ్యాధులు వస్తాయి. దాంతో పాటు శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. అంతేకాకుండా, గ్యాస్-గుండె మంట సమస్య తరచుగా వేధిస్తుంది. ఈ వ్యాధుల నుంచి బయటపడటానికి శరీరాన్ని నిర్విషీకరణ చేయడం చాలా ముఖ్యం. శరీరంలో పేరుకుపోయిన కాలుష్య కారకాలను బయటకు పంపాలంటే.. ఉదయం పూట ఖాళీ కడుపుతో నీళ్లు త్రాగడం చాలా అవసరం. ఇది మలబద్ధకం సమస్యను దూరం..
Updated on: Nov 14, 2023 | 7:55 PM

గతితప్పిన వేళల్లో ఆహారం తినడం, తాగడం వల్ల కొలెస్ట్రాల్, మధుమేహం వంటి వ్యాధులు వస్తాయి. దాంతో పాటు శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. అంతేకాకుండా, గ్యాస్-గుండె మంట సమస్య తరచుగా వేధిస్తుంది. ఈ వ్యాధుల నుంచి బయటపడటానికి శరీరాన్ని నిర్విషీకరణ చేయడం చాలా ముఖ్యం. శరీరంలో పేరుకుపోయిన కాలుష్య కారకాలను బయటకు పంపాలంటే.. ఉదయం పూట ఖాళీ కడుపుతో నీళ్లు త్రాగడం చాలా అవసరం. ఇది మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. అలాగే శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.

అయితే కేవలం నీళ్లు మాత్రమే తాగితే ప్రయోజనం ఉండదు. శరీర ర్విషీకరణ చేయడానికి నీళ్లలో కొన్ని సుగంధ ద్రవ్యాలను కూడా కలుపుకోవచ్చు. శరీరంలో పేరుకుపోయిన కాలుష్య కారకాలను తొలగించడానికి పసుపు సహాయపడుతుంది. పసుపులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే శరీరం నుంచి హానికారక విషాలను బయటికి పంపుతుంది.

పసుపులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని సహజమైన మార్గంలో నిర్విషీకరణ చేస్తాయి. ఇది జీవక్రియ, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. రోజువారీ ఆహారంలో పసుపును ఈ కింది మార్గాల్లో చేర్చుకోవచ్చు. పాలల్లో పసుపు పొడి కలుపుకుని తాగొచ్చు. పసుపు పాలలోని పోషకాలు శరీరానికి అందేలా చేస్తుంది. అంతేకాకుండా, పసుపు-పాలు శరీరం నుంచి హానికారక విషాలను తొలగిస్తుంది. పాలు మరిగేటప్పుడు చిటికెడు పసుపు, మిరియాల పొడి వేసుకోవాలి. తాగేటప్పుడు స్పూన్ తేనె కలుపుకుంటే సరిపోతుంది.

పసుపు డిటాక్స్ నీళ్లను కూడా తయారు చేసి త్రాగవచ్చు. ఒక గ్లాస్ నీళ్లలో అల్లం, నిమ్మకాయ ముక్కలు, పుదీనా ఆకులు, దాల్చిన చెక్కలను కలిపి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఈ నీళ్లలో పసుపు వేసి మరిగించాలి. ఆ తర్వాత దానిని తాగితే శరీరంలో వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది టాక్సిన్స్‌ని కూడా తొలగిస్తుంది.

పసుపు టీ తాగడం ద్వారా శరీరాన్ని నిర్విషీకరణ చేయవచ్చు. ఒక్కొక్క ముక్క చొప్పుఉన తాజా పసుపు, అల్లం తీసుకుని 2 కప్పుల నీళ్లలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ నీటిని మరిగించి వడకట్టాలి. అందులో తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల అజీర్ణం, ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.





























