- Telugu News Photo Gallery Soaked Raisins in Winter: Why Should You Eat Soaked Raisins In This Changing Weather?
Soaked Raisins: ఎండు ద్రాక్ష ఇలా తిన్నారంటే ఒక్క రోగం కూడా దరిచేరదు.. పూర్వికుల కాలం నాటి చిట్కా
వంటకాల్లో ఎండుద్రాక్షను జోడించడం వల్ల ఆహారానికి చక్కని రుచి వస్తుంది. అయితే ఈ ఎండు ద్రాక్షలను సరైన పద్ధతిలో తింటే అనేక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చిన ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎండు ద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే అధిక ప్రయోజనాలు పొందవచ్చు. అప్పుడే, వాటిల్లోని పోషక విలువలు సమృద్ధిగా అందుతాయి. ఎండుద్రాక్షలో ఐరన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు..
Updated on: Nov 14, 2023 | 8:36 PM

వంటకాల్లో ఎండుద్రాక్షను జోడించడం వల్ల ఆహారానికి చక్కని రుచి వస్తుంది. అయితే ఈ ఎండు ద్రాక్షలను సరైన పద్ధతిలో తింటే అనేక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చిన ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎండు ద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే అధిక ప్రయోజనాలు పొందవచ్చు. అప్పుడే, వాటిల్లోని పోషక విలువలు సమృద్ధిగా అందుతాయి.

ఎండుద్రాక్షలో ఐరన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఎండుద్రాక్షను రాత్రంతా నీళ్లలో నానబెడితే వాటిల్లోని పోషకాలు అందుతాయి. చలికాలంలో నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. చలికాలంలో అజీర్ణం, మలబద్ధకం సమస్యలు సర్వసాధారణం. అయితే రోజూ ఉదయాన్నే నీళ్లలో నానబెట్టిన ఎండు ద్రాక్షను తింటే పొట్ట చాలా తేలికగా శుభ్రం అవుతుంది. ఇది మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.

కీళ్ల నొప్పులు, మడమల నొప్పులు వంటి సమస్యల నుంచి బయటపడాలంటే నీళ్లలో నానబెట్టిన ఎండు ద్రాక్షను తినాలి. ఎండుద్రాక్షలో కాల్షియం ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాదు నీళ్లలో నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం వల్ల బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

చలికాలపు ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం వల్ల తక్షణమే శక్తి అందుతుంది. ఎండుద్రాక్షలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్ ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. చలికాలంలో వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే నీళ్లలో నానబెట్టిన ఎండు ద్రాక్షలను తప్పనిసరిగా తినాలి. నానబెట్టిన ఎండుద్రాక్షను రోజూ తినడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదాన్ని నివారించవచ్చు. ఎండుద్రాక్షలో విటమిన్ బి, సి పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడతాయి.

రోజూ ఉదయాన్నే నీళ్లలో నానబెట్టిన ఎండుద్రాక్షను తింటే కాలేయంలో పేరుకుపోయిన టాక్సిన్స్ తొలగిపోతాయి. చలికాలంలో ఉదయం పూట దీన్ని తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన అన్ని మలినాలు తొలగిపోతాయి. మహిళల్లో రక్తహీనత ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే నానబెట్టిన ఎండుద్రాక్ష తింటే రక్తం సమృద్ధిగా పడుతుంది. ఎండుద్రాక్షలో ఐరన్ అదికంగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల స్థాయిని పెంచడం ద్వారా రక్తహీనత ప్రమాదాన్ని తగ్గిస్తుంది.




