- Telugu News Photo Gallery Cinema photos Jr NTR Devara movie and Kamal Haasan Indian 2 to clash at box office in April 2024
జూనియర్ ఎన్టీఆర్ Vs కమల్ హాసన్.. భారీ సినిమాల తో దండయాత్ర
2024 సమ్మర్ సీజన్ ఎలా ఉండబోతుందో తెలియదు కానీ ఎప్రిల్ మాత్రం హౌజ్ ఫుల్ అయిపోయింది. ముఖ్యంగా ఆ నెలలో చాలా వరకు పాన్ ఇండియన్ సినిమాలే రాబోతున్నాయి. చాలా తక్కువ గ్యాప్‌లోనే పోటీకి సై అంటున్నారు. ఓ వైపు తెలుగు.. మరోవైపు తమిళం నుంచి భారీ సినిమాల దండయాత్ర సాగనుంది. మరి ఏంటా సినిమాలు..? వాటిలో ఎవరెవరికి పోటీ ఎక్కువగా ఉండబోతుంది..? సమ్మర్ సీజన్‌కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అందులోనూ ఎప్రిల్‌లో ఎక్కువ సినిమాలు వస్తుంటాయి.
Updated on: Nov 14, 2023 | 7:20 PM

2024 సమ్మర్ సీజన్ ఎలా ఉండబోతుందో తెలియదు కానీ ఎప్రిల్ మాత్రం హౌజ్ ఫుల్ అయిపోయింది. ముఖ్యంగా ఆ నెలలో చాలా వరకు పాన్ ఇండియన్ సినిమాలే రాబోతున్నాయి. చాలా తక్కువ గ్యాప్‌లోనే పోటీకి సై అంటున్నారు. ఓ వైపు తెలుగు.. మరోవైపు తమిళం నుంచి భారీ సినిమాల దండయాత్ర సాగనుంది. మరి ఏంటా సినిమాలు..? వాటిలో ఎవరెవరికి పోటీ ఎక్కువగా ఉండబోతుంది..?

సమ్మర్ సీజన్‌కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అందులోనూ ఎప్రిల్‌లో ఎక్కువ సినిమాలు వస్తుంటాయి. ఈ సారి కూడా ఇదే జరగబోతుంది. 2024 ఎప్రిల్ హౌజ్ ఫుల్ అయిపోతుంది.

ఇప్పటికే ఎప్రిల్ 5న దేవర ఫస్ట్ పార్ట్ రానుంది. ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక దీనికి పోటీగా తెలుగు సినిమాలేం వస్తాయో తెలియదు కానీ తమిళ సినిమాలైతే వస్తున్నాయి.

సూర్య హీరోగా శివ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ సినిమా కంగువా. దీనిపై కేవలం తమిళంలోనే కాదు.. మిగిలిన భాషల్లోనూ మంచి అంచనాలున్నాయి. స్టూడియో గ్రీన్‌తో కలిసి యువీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎప్రిల్ 11న అంటే.. దేవర వచ్చిన వారానికే కంగువా విడుదల కానుంది. అలాగే కమల్ హాసన్ ఇండియన్ 2 కూడా అదే రోజు రానుందనే ప్రచారం జరుగుతుంది.

శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయుడు 2 సమ్మర్‌లో విడుదలవుతుందని ఇదివరకే చెప్పారు డిస్ట్రిబ్యూటర్ ఉదయనిధి స్టాలిన్. ఎప్రిల్ 14న తమిళ నూతన సంవత్సరం. అప్పుడు సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే కంగువా ఉన్నా.. ఇండియన్ 2 కూడా పోటీకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇవి మాత్రమే కాదు.. అన్నీ కుదిర్తే పవన్ ఓజి కూడా ఎప్రిల్‌లోనే విడుదల కానుంది.




