Sunil: మరో కొత్త ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్న సునీల్.. ఆ టాప్ హీరో కలసి చేయనున్న భీమవరం బుల్లోడు
సునీల్ మరో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఇప్పటికే తెలుగు, తమిళంలో దూసుకుపోతున్న ఈయన.. తాజాగా ఇంకో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అది కూడా అలాంటిలాంటి సినిమాతో కాదు.. ఏకంగా మెగాస్టార్ సినిమాలోనే ఆఫర్ అందుకున్నారు. అసలు సునీల్ ఈ రేంజ్ మ్యాజిక్ చేయడానికి కారణమేంటి..? ఇక ఆయన్ని కమెడియన్‌గా చూడటం కష్టమేనా..? కెరీర్ ఎలా మొదలుపెట్టాం అనేది కాదు.. ఎలా ముందుకు వెళ్తున్నాం అనేది ముఖ్యం అంటున్నారు సునీల్. ఒకప్పుడు కమెడియన్‌గా తప్ప మరోటి చేయలేరేమో అనే స్థాయి నుంచి.. ఇప్పుడు ఏ కారెక్టరైనా చేస్తాడు అనిపించుకున్నారీయన.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5