- Telugu News Photo Gallery Cinema photos Animal movie stars Ranbir Kapoor, Rashmika Mandanna will appear on Balakrishna Unstoppable with NBK show
Unstoppable: బాలీవుడ్ మీట్స్ బాలయ్య.. మరో మెగా ఎపిసోడ్‌కు రెడీ
మరో మెగా ఎపిసోడ్‌కు రెడీ అవుతోంది బాప్ ఆఫ్ ఆర్ రియాలిటీ షోస్ అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే. బాలీవుడ్ మీట్స్ బాలయ్య అనే ట్యాగ్ లో లిమిటెడ్ ఎడిషన్‌లో భాగంగా స్పెషల్ ఎపిసోడ్ ఆడియన్స్ ముందుకు రానుంది. ఇంతకీ బాలయ్యను మీట్ అవుతున్న ఆ బాలీవుడ్ స్టార్స్ ఎవరు..? ఈ చూద్దాం ఈ ఎక్స్‌క్లూజివ్ స్టోరీలో. నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న బ్లాక్ బస్టర్ డిజిటల్ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే. బాలయ్యను అభిమానులకు మరింత చేరువ చేసిన ఈ షో, ఒక్కో సీజన్‌తో తన రికార్డ్‌లను తానే బ్రేక్ చేసుకుంటూ వస్తున్నారు బాలయ్య.
Updated on: Nov 14, 2023 | 6:30 PM

మరో మెగా ఎపిసోడ్‌కు రెడీ అవుతోంది బాప్ ఆఫ్ ఆర్ రియాలిటీ షోస్ అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే. బాలీవుడ్ మీట్స్ బాలయ్య అనే ట్యాగ్ లో లిమిటెడ్ ఎడిషన్‌లో భాగంగా స్పెషల్ ఎపిసోడ్ ఆడియన్స్ ముందుకు రానుంది. ఇంతకీ బాలయ్యను మీట్ అవుతున్న ఆ బాలీవుడ్ స్టార్స్ ఎవరు..? ఈ చూద్దాం ఈ ఎక్స్‌క్లూజివ్ స్టోరీలో.

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న బ్లాక్ బస్టర్ డిజిటల్ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే. బాలయ్యను అభిమానులకు మరింత చేరువ చేసిన ఈ షో, ఒక్కో సీజన్‌తో తన రికార్డ్‌లను తానే బ్రేక్ చేసుకుంటూ వస్తున్నారు బాలయ్య. రీసెంట్‌గా లిమిటెడ్ ఎడిషన్‌లో భాగంగా చేసిన భగవంత్ కేసరి ఇంటర్వ్యూకి కూడా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా మరో మెగా ఎపిసోడ్‌కి రెడీ అవుతోంది అన్‌స్టాపబుల్ టీమ్. బాలీవుడ్ మీట్స్ బాలయ్య పేరుతో మరో స్పెషల్ ఎపిసోడ్‌ను సిద్ధం చేస్తోంది. ఈ ఎపిసోడ్‌లో యానిమల్ మూవీ స్టార్స్ రణబీర్ కపూర్, రష్మిక మందన్న, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పాల్గొనబోతున్నారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రీ టీజర్‌ను దీపావళి సందర్భంగా రిలీజ్ చేసింది ఆహా టీమ్.

అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న యానిమల్ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను సౌత్‌లోనూ గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్న టీమ్.

ఆహాలో ప్రమోట్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగు స్టార్స్‌ను గ్రిల్ చేసిన బాలయ్య, బాలీవుడ్ హీరోతో ఎలాంటి ఫన్ క్రియేట్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.




