Movies: సినిమాలు లేక కళ తప్పిన బాక్సాఫీస్.. థియేటర్ రెంట్లు కూడా రాని సినిమాలు ఇంకెన్నాళ్లు..
ఇంకెన్నాళ్లు ఈ సైలెన్స్.. ఎందుకు నిర్మాతలు బంగారం లాంటి సీజన్‌ను మిస్ చేసుకుంటున్నారు..? విడుదల చేయడానికి సినిమాలు లేక బాక్సాఫీస్ కళ తప్పుతుంది. దసరా అప్పుడు వారం రోజుల కళకళ తప్పిస్తే.. మళ్లీ థియేటర్స్ అన్నీ ఖాళీ అయిపోయాయి. థియేటర్ రెంట్లు కూడా రాని సినిమాలు ఇంకెన్ని రోజులు నడిపించాలి..? అసలేమైంది టాలీవుడ్‌కు.. బాక్సాఫీస్ దగ్గర కళ వచ్చేదెప్పుడు..? టాలీవుడ్‌లో హీరోలకి కొదవ లేదు.. కానీ సినిమాలకే కొదవ ఉంది. నెలకో పెద్ద సినిమా కూడా విడుదల చేయలేకపోతున్నారు.