Andhra pradesh: అందమైన విశాఖలో ఆందోళన..! ఊపిరాడకుండా చేస్తున్న వాయువు.. అత్యంత నాసిరకంగా గాలి నాణ్యత

Visakhapatnam: ఈ తరహా కాలుష్యం వల్ల ముఖ్యంగా ఊపిరితిత్తులు, గుండె, క్యాన్సర్‌, చర్మ వ్యాధులు వస్తుంటాయని డాక్టర్లు హెచ్చరిస్తుంటారు. సాధారణంగా ఎయిర్‌క్వాలిటీ ఇండెక్స్‌ 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తిగా, అదే ఏ క్యు ఐ 101 నుంచి 200 అయితే మోడరేట్‌గా, అంతకు మించి 201 నుంచి 300 అయితే పూర్‌గా, ఇక 301 నుంచి 400 వరకు అయితే వెరీ ప్యూర్‌గా, మరీ 401 నుంచి 500 అయితే తీవ్ర ఆందోళనకర పరిస్థితిగా పేర్కొంటారు. అలాంటిది విశాఖలో గాలి నాణ్యత సూచీ

Andhra pradesh: అందమైన విశాఖలో ఆందోళన..! ఊపిరాడకుండా చేస్తున్న వాయువు.. అత్యంత నాసిరకంగా గాలి నాణ్యత
Visaka Pollution
Follow us
Eswar Chennupalli

| Edited By: Jyothi Gadda

Updated on: Nov 15, 2023 | 7:42 AM

ఆంధ్రప్రదేశ్, నవంబర్15; విశాఖ… దేశంలో…. ఆమాటకొస్తే ప్రపంచం లోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న నగరాలలో ఒకటి. దేశం లో అత్యంత వేగంగా ఎదుగుతున్న 9 వ నగరం కాగా ప్రపంచం లో 50 వ నగరంగా గుర్తింపు పొందింది. అదే సమయంలో అంతకుమించి అత్యంత కాలుష్య నగరంగా నూ గుర్తింపు పొందుతుండడం ఇప్పుడు విషాదాన్ని కలిగిస్తోంది. అసలే వైజాగ్ పోర్ట్ తో పాటు నగరం లో ఫార్మా కంపెనీలు, ఇతర పరిశ్రమల పొల్యూషన్ కు తోడు తాజాగా దీపావళి రోజున విశాఖ ను కాలుష్యం కమ్మేసింది. రంగురంగుల బాణసంచా వెలుగుల వెనుక భయానక నిజాలు ప్రస్తుతం అందరినీ కలవరపెడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

విశాఖ దేశంలోని మహా నగరాలలో ఒకటి. ఈ విషయంలో రెండవ మాటకు తావు లేదు. ఆసియా ఖండంలోనే శరవేగంగా అభివృద్ధి చెందే సిటీగా విశాఖకు పేరు ఉంది. ఒకవైపు కాస్మోపాలిటన్ కల్చర్, మరొకవైపు అద్భుతమైన సముద్ర తీరం, దట్టమైన తూర్పు కనుమల పర్వత శ్రేణులు, దట్టమైన అటవీ ప్రాంతాలతో దేశంలో టాప్ టెన్ సిటీలలో విశాఖ ఒకటిగా ముందుకు వెళ్తోంది. ఇది ఎంతటి ఆనందం కలిగించే అంశమో అంతే విషాదాన్ని కలిగించే అంశాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం అని ఎంత పేరు గడించిందో అంతే స్థాయిలో అత్యంత కాలుష్య నగరాలలో కూడా దేశం లో టాప్ టెన్ లో విశాఖ ఉండడం ఇప్పుడు కలవర పెడుతోంది. ముందే విశాఖ పోర్ట్ వల్ల వచ్చే కాలుష్యానికి, ఫార్మా, ఆటోనగర్, ఇతర పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం ఒకవైపు, మరొకవైపు నగరం బౌల్ షేప్ లో ఉండడం, చుట్టూ కొండలు ఉండడం తో కాలుష్యం బయటకు వెళ్ళకుండా నగరాన్నే చుట్టుముట్టి ఇక్కడే ఉండిపోవడం వల్ల దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది.

ఈ ఏడాది గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిలో…

ఇవి కూడా చదవండి

ఇలా అసలే కాలుష్య కోరల్లో ఉండే విశాఖ లో దీపావళి టపాసుల ప్రభావంతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకర స్థాయికి వెళ్ళింది. ఈ ఏక్యూఐ ఏకంగా 308 కు చేరింది. దీపావళి రోజు దేశవ్యాప్తంగా 245 నగరాలు, పట్టణాల్లోని గాలి నాణ్యతను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి- సీపీసీబీ అనలైజ్ చేస్తే దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగు చూశాయి. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం రాత్రి 10.30 గంటల వరకు సగటును పరిగణలోకి తీసుకుంటే దేశం లో మొత్తం 53 నగరాలు, పట్టణాలలో గాలి నాణ్యత వెరీ పూర్ కేటగిరీలో ఉండడం, .ఆ జాబితాలో విశాఖపట్నం కూడా ఉండటం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఎనిమిది నగరాలు, పట్టణాల్లో శాంపిల్స్ ను సేకరించగా అత్యధికంగా చిత్తూరు 348 పాయింట్లతో ఉండగా ఆ తర్వాత విశాఖ లో ఏక్యూఐ ఏకంగా 308గా నమోదైంది.

గత ఏడాది దీపావళి కు ఏ క్యూ ఐ 233 మాత్రమే..

ఎయిర్ క్వాలిటీ ని నిర్ధారించే పార్టికలేట్ మ్యాటర్ – పీఎం 2.5 మైక్రాన్లు లేదా అంతకంటే తక్కువ వ్యాసం గల కణాలు ను కాలుష్యానికి ముఖ్య కారకాలుగా సీపీసీబీ గుర్తిస్తుంది. గతేడాది ఇదే సమయానికి నగరంలో ఈ గాలి నాణ్యత 233గా నమోదు కాగా ఇప్పుడు అది 308 కి చేరడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో నగరంలో ఏర్పాటు చేసిన మానిటరింగ్ స్టేషన్ నుంచి సేకరించిన శాంపిల్స్ ప్రకారం గణాంకాలును ఒకసారి చూస్తే నగరంలో అనేక కీలక ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ చాలా పూర్ లెవల్ ఉంది. ముఖ్యంగా వన్ టౌన్, ఎన్ ఎ డీ, గాజువాక, పోర్ట్ రోడ్, సిరిపురం జంక్షన్ లాంటి ఏరియాల్లో మరింత ఎక్కువగా దీని ప్రభావం ఉండడం మరింత ఆందోళన కలిగించే అంశం.

ఎయిర్‌క్వాలిటీ ఇండెక్స్‌ 51 నుంచి 100 వరకు ఉంటేనే సంతృప్తిగా ఉన్నట్టు

ముఖ్యంగా సోమవారం రాత్రి ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు బాణసంచా మోతతో విశాఖ నగరం దద్దరిల్లింది. ఒకపక్క వాయు కాలుష్యం, మరోపక్క శబ్ద కాలుష్యంతో విశాఖ వాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. సాధారణంగా పార్టికులెట్ మేటర్ – పీఎం 10, పీఎం 2.5 కారకాలు ఎక్కువగా నమోదు కావడంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నది విశ్లేషణ. ఈ తరహా కాలుష్యం వల్ల ముఖ్యంగా ఊపిరితిత్తులు, గుండె, క్యాన్సర్‌, చర్మ వ్యాధులు వస్తుంటాయని డాక్టర్లు హెచ్చరిస్తుంటారు. సాధారణంగా ఎయిర్‌క్వాలిటీ ఇండెక్స్‌ 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తిగా, అదే ఏ క్యు ఐ 101 నుంచి 200 అయితే మోడరేట్‌గా, అంతకు మించి 201 నుంచి 300 అయితే పూర్‌గా, ఇక 301 నుంచి 400 వరకు అయితే వెరీ ప్యూర్‌గా, మరీ 401 నుంచి 500 అయితే తీవ్ర ఆందోళనకర పరిస్థితిగా పేర్కొంటారు. అలాంటిది విశాఖలో గాలి నాణ్యత సూచీ 348గా నమోదు కావడంతో అత్యంత పూర్ కేటగిరీ లో నాసిరకంగా ఉండడం వల్ల ఊపిరిపీల్చుకోవడానికి ఇబ్బందులు తలెత్తుతాయన్నది విశ్లేషణ. తద్వారా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నది వైద్యుల హెచ్చరిక.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..