Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: కట్టుకున్నోడే కడతేర్చాడు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త.. దీపావళి రోజే ఇంటి దీపాన్ని ఆర్పేశాడు..

Neredumet:ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం వీరి కాపురం సాఫీగానే సాగింది.. కానీ ఆ తరువాత కుటుంబంలో ఆర్థిక సమస్యలతో గొడవలు మొదలయ్యాయి. దీంతో పుట్టింటికి వెళ్లిపోయిన స్రవంతి చాలా రోజులుగా తల్లి గారి ఇంటి వద్ద ఉంటుంది. శనివారం రాత్రి మహేందర్ భార్యకు ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేస్తున్నానని చెప్పాడు. దీంతో ఆమె ఆదివారం ఉదయం ఆమె అద్దె ఇంటికి వెళ్లి చూడగా ఇల్లు ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు భర్త మహేందర్.. ఈ క్రమంలోనే..

Hyderabad: కట్టుకున్నోడే కడతేర్చాడు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త.. దీపావళి రోజే ఇంటి దీపాన్ని ఆర్పేశాడు..
Husband Murders Wife
Follow us
Peddaprolu Jyothi

| Edited By: Jyothi Gadda

Updated on: Nov 14, 2023 | 1:23 PM

హైదరాబాద్, నవంబర్14; దీపావళి పండుగ రోజే ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ను హత్య చేసాడు కట్టుకున్న భర్త…కులాలు వేరే అయిన కలిసి జీవించాలి అనుకున్నారు.. పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు.. సుఖ సంతోషాలతో కలిసి జీవించాలి అనుకున్న ఆ ఇద్దరి మధ్య అనంతర కాలంలో ఆర్థిక సమస్యలు తలెత్తాయి. దీంతో భర్త ప్రవర్తనలో మార్పులు రావడం తో ఇద్దరి మధ్య విభేదాలకు దారితీసాయి.. క్రమ క్రమంగా ఈ సమస్యలు మరింత ఎక్కువ అవ్వడంతో పుట్టింటికి వెళ్ళింది భార్య. అయినప్పటికీ అతనిలో  ఏమాత్రం మార్పు రాకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు మరింత బలపడ్డాయి… పలుమార్లు కుటుంబ సభ్యులు హెచ్చరించిన మార్పు మాత్రం రాలేదు.  చివరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని హత్య చేశాడు ఓ భర్త. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ నగరంలోనే చోటు చేసుకుంది.

నేరేడుమెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దీపావళి రోజున ఇంటి ఇల్లాలిని హత్య చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా గన్నారం గ్రామానికి చెందిన స్రవంతి సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీగిరి పల్లి కి చెందిన మహేందర్ తో వివాహం జరిగింది. మహేందర్ కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. 2019లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. వీరు ఏడాది క్రితం ఉప్పల్ పరిధిలోని జవహర్ నగర్ లోని కందిగూడా లో నివసిస్తున్నారు. కుటుంబంలో ఆర్థిక సమస్యలు గొడవలు చోటు చేసుకోవడంతో స్రవంతి చాలా రోజులుగా తల్లి గారి ఇంటి వద్ద ఉంటుంది. శనివారం రాత్రి మహేందర్ భార్యకు ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేస్తున్నానని చెప్పాడు. దీంతో ఆమె ఆదివారం ఉదయం సమతా నగర్లో అద్దె ఇంటికి వెళ్లి చూడగా భర్త తన వస్తువులు తీసుకెళ్లి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు.  దీంతో భర్త పై ఆగ్రహం వ్యక్తం చేసింది స్రవంతి. ఈ క్రమంలో  ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మహేందర్ కోపంతో భార్య స్రవంతి ముఖంపై, తలపై బలంగా కొట్టాడు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. అనంతరం ఆమె మెడకు చున్ని చుట్టి తీసుకెళ్లి మంచం కింద దాచాడు. ఆ తర్వాత ఇంటికి తాళం వేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

వస్తువుల్ని తీసుకోవడానికి వెళ్ళినటువంటి చెల్లి తిరిగి రాకపోవడంతో స్రవంతి అన్న ప్రశాంత్ ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటన్నర ప్రాంతంలో అక్కడికి చేరుకున్నాడు. ఇంటికి తాళం వేసి ఉండడంతో అనుమానం వచ్చి డోర్లను బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా ఆమె విగత జీవిగా పడివుంది. దీంతో పోలీసులు మహేందర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఈ విధంగా  హత మార్చడంతో స్రవంతి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..