Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ జుట్టును నాశనం చేస్తున్న చుండ్రు సమస్యకు చెక్‌ పెట్టండి ఇలా..!! సింపుల్ హోం రెమెడీస్ తో సూపర్

ఇందులో చాలా యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చుండ్రుకు కారణమయ్యే ఫంగస్‌తో పోరాడటానికి సహాయపడతాయి. ఒక గిన్నెలో సమాన పరిమాణంలో నీరు, ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ తలకు స్మూత్‌కు అప్లై చేయండి. 15-20 నిమిషాల తర్వాత నీటితో కడగాలి. మంచి ఫలితాల కోసం వారానికి 2-3 సార్లు ఇలా చేయండి.

మీ జుట్టును నాశనం చేస్తున్న చుండ్రు సమస్యకు చెక్‌ పెట్టండి ఇలా..!! సింపుల్ హోం రెమెడీస్ తో సూపర్
Dandruff Problem
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 14, 2023 | 10:43 AM

చాలా మంది అమ్మాయిలు అందమైన జుట్టు కావాలని కోరుకుంటారు. ఎందుకంటే ఆడవారి అందంలో సగం వారి జుట్టులోనే దాగి ఉంటుంది. కానీ చలికాలం వచ్చిందంటే జుట్టులో చుండ్రు పేరుకుపోయి తలపై, బట్టలపై కనిపిస్తుంది. కొంతమందికి ప్రతి సీజన్‌లో చుండ్రు ఉంటుంది. కానీ చలికాలంలో ఈ సమస్య పెరుగుతుంది. చాలా మంది చుండ్రు సమస్య నుంచి బయటపడేందుకు రసాయనాలు కలిపిన యాంటీ డాండ్రఫ్ షాంపూలను వాడుతుంటారు. ఇది జుట్టు ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి చుండ్రు సమస్యకు ఎల్లప్పుడూ హోం రెమెడీస్‌ని అనుసరించడం జుట్టు ఆరోగ్యానికి ఉత్తమం.

కలబందతో చుండ్రుకు చెక్‌..

కలబందలో గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి. కలబంద స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్, చుండ్రును చాలా సులభంగా తగ్గిస్తుంది. తాజా కలబంద జెల్ ను తలకు పట్టిస్తే దురద, చుండ్రు తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి

రెండవ చిట్కా బేకింగ్ సోడా..

బేకింగ్ సోడా ఒక అద్భుతమైన ఎక్స్‌ఫోలియంట్. ఇది డెడ్ స్కిన్‌ని తొలగించి చుండ్రుని తగ్గించడంలో సహాయపడుతుంది. దీని కోసం మీరు మొదట మీ తలను శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత బేకింగ్ సోడాను నేరుగా తలకు పట్టించాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఆపిల్ సైడర్ వెనిగర్..

చుండ్రుని తగ్గించే మరో చిట్కా ఆపిల్ సైడర్ వెనిగర్. ఇందులో చాలా యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చుండ్రుకు కారణమయ్యే ఫంగస్‌తో పోరాడటానికి సహాయపడతాయి. ఒక గిన్నెలో సమాన పరిమాణంలో నీరు, ఆపిల్ సైడర్ వెనిగర్ కలపండి. మీ తలకు స్మూత్‌కు అప్లై చేయండి. 15-20 నిమిషాల తర్వాత నీటితో కడగాలి. మంచి ఫలితాల కోసం వారానికి 2-3 సార్లు ఇలా చేయండి.

కొబ్బరి నూనె..

చుండ్రును వదిలించుకోవడానికి మరొక గొప్ప మార్గం కొబ్బరి నూనె. కొబ్బరి నూనె సహజ మాయిశ్చరైజర్. ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. కొద్దిగా కొబ్బరి నూనెను వేడి చేసి తలకు పట్టించి మసాజ్ చేయండి. రాత్రంతా తలపై పెట్టుకోవడం మంచిది. ఉదయాన్నే స్నానం చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..