అధిక బ్లడ్‌షుగర్‌తో బాధపడుతున్నారా..? మధుమేహ రోగులు తప్పనిసరిగా తినాల్సిన ఐదు ఆహారాలు..
చాలా కాలం పాటు రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటే వారు మధుమేహం బారిన పడినట్టు గుర్తించాలి. ఇక డయాబెటిస్ బారిన పడినవారు కచ్చితంగా వారి జీవితకాలమంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది పడితే అది అస్సలు తినకూడదు. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంలో చేర్చుకోవాల్సిన కొన్ని ఆహార పదార్థాలను ఇక్కడ తెలుసుకుందాం...
మధుమేహం.. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య. దాదాపు ప్రపంచంలో సగం జనాభాలో ఎక్కువ మంది మధుమేహం బారిన పడి ఇబ్బంది పడుతున్నారు. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం లేకపోవడం, తప్పుడు జీవనశైలి కారణాలు, విపరీతమైన ఒత్తిడి వంటి కారణాలతో చాలా మంది మధుమేహం బారిన పడుతున్నారు. ఇక డయాబెటిస్ వచ్చిందంటే దానితో పాటు అదనంగా మరి కొన్ని రోగాలను తెచ్చుకున్నట్టేనని వైద్యులు చెబుతున్నారు. చాలా కాలం పాటు రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటే వారు మధుమేహం బారిన పడినట్టు గుర్తించాలి. ఇక డయాబెటిస్ బారిన పడినవారు కచ్చితంగా వారి జీవితకాలమంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది పడితే అది అస్సలు తినకూడదు. తప్పనిసరి డయాబెటిక్ డైట్ పాటించాల్సి ఉంటుది.
రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా నియంత్రించడంలో ఆరోగ్యకరమైన ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మధుమేహం ఉన్నవారు తక్కువ పిండిపదార్థాలు, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) తక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. కానీ, పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. అదేవిధంగా డయాబెటిక్ రోగులు వారి ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవటం తప్పనిసరి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంలో చేర్చుకోవాల్సిన కొన్ని ఆహార పదార్థాలను ఇక్కడ తెలుసుకుందాం…
వోట్స్..
మధుమేహ బాధితులు తీసుకోవాల్సిన ఆహారాలలో మొదటి స్థానంలో ఉంటుంది ఓట్స్. ఓట్స్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఓట్స్‌లో సులభంగా జీర్ణమయ్యే ఫైబర్‌లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు రోజూ ఉదయాన్నే ఓట్ మీల్ తినటం మంచిది.
ఆకు కూరలు..
బచ్చలి, పాలకూర వంటి ఆకు కూరల్లో పీచు ఉంటుంది. కాబట్టి వీటిని తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది.
మెంతులు..
ఫైబర్ పుష్కలంగా ఉండే మెంతులు మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషదం వంటిది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారంలో మెంతి గింజలను చేర్చుకోవచ్చు. రోజూ ఉదయాన్నే మెంతులు వేసి మరిగించిన నీటిని తాగడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది.
కొవ్వు చేపలు..
కొవ్వు చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కాబట్టి డయాబెటిక్ పేషెంట్లకు సాల్మన్ ఫిష్ లాంటివి తినడం మంచిది.
నట్స్…
రక్తంలో చక్కెరస్థాయిలు ఎక్కువగా ఉన్నవారు ప్రోటీన్లు, విటమిన్లు, ఇతర ఖనిజాలు పుష్కలంగా కలిగి ఉన్న నట్స్ తీసుకోవటం మంచిది. ఇవి బ్లడ్‌షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేయటం, నియంత్రించడంలో సహాయపడతాయి.
(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..