Watch Video: మీరు ఎప్పుడైనా తెల్లటి నాగుపామును చూసారా..? కోట్ల విలువైన శ్వేతనాగు అరుదైన వీడియో వైరల్‌..

కొన్ని పాములు విషపూరితమైనవి. కొన్ని పాములు ప్రమాదకరమైనవి. మీరు ఎప్పుడైనా తెల్లటి నాగుపామును చూసారా..? తెల్లటి వర్ణంతో కనిపించే ఇలాంటి పాములను శ్వేతనాగు అని కూడా అంటారు. కోట్ల విలువైన శ్వేతనాగు అరుదైన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఎక్కడినుంచో రక్షించి తీసుకొచ్చిన తెల్లటి నాగు పామును అడవిలో వదులుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ వైట్ కోబ్రా అనేది భారతదేశంలో కనిపించే ప్రత్యేక రకం పాము. ఇది కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు మహారాష్ట్ర వంటి నైరుతి […]

Watch Video: మీరు ఎప్పుడైనా తెల్లటి నాగుపామును చూసారా..? కోట్ల విలువైన శ్వేతనాగు అరుదైన వీడియో వైరల్‌..
White Cobra
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 14, 2023 | 7:36 AM

కొన్ని పాములు విషపూరితమైనవి. కొన్ని పాములు ప్రమాదకరమైనవి. మీరు ఎప్పుడైనా తెల్లటి నాగుపామును చూసారా..? తెల్లటి వర్ణంతో కనిపించే ఇలాంటి పాములను శ్వేతనాగు అని కూడా అంటారు. కోట్ల విలువైన శ్వేతనాగు అరుదైన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఎక్కడినుంచో రక్షించి తీసుకొచ్చిన తెల్లటి నాగు పామును అడవిలో వదులుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ వైట్ కోబ్రా అనేది భారతదేశంలో కనిపించే ప్రత్యేక రకం పాము. ఇది కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు మహారాష్ట్ర వంటి నైరుతి ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తుంది. ప్రస్తుతం తెల్లటి నాగుపాము వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది అరుదైన పాము. తమిళనాడులోని కోయంబత్తూరులోని నివాస ప్రాంతంలో ఈ పాము కనిపించినట్లు సమాచారం.

సాధారణంగా పాముల రంగు నలుపు, గోధుమ లేదా బూడిద రంగులో ఉంటుంది. ఇలాంటి అరుదైన పాములు తెల్లటి, పాలవంటి రంగులో చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ఇక్కడ వైరల్‌ అవుతున్న వీడియోలో కూడా అలాంటిదే వైట్‌ కోబ్రా. దీని పొడవు దాదాపు 3 అడుగులుగా తెలుస్తుంది. శ్వేత నాగులో ఎరుపు లేదా నీలం కళ్ళు కలిగిన ఈ పాములు రాత్రిపూట ఆహారం వెతుక్కుంటూ బయటకు వచ్చి చిన్నచిన్న క్రిమికీటకాలు, ఎలుకలు, సీతాకోకచిలుకలు, బల్లులు వంటి వాటిని తింటాయి. ఇది చాలా విషపూరితమైనది. ఒక్క కాటుతో మనిషిని నిలువునా చంపేయగలదు.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో కనిపించిన శ్వేతనాగును ఎక్కడినుంచో రక్షించి తీసుకువచ్చినట్టుగా తెలుస్తుంది. బస్తాలో బంధించి తెచ్చిన పామును గుర్తు తెలియని వ్యక్తులు అడవిలోకి వదులుతున్నారు. అప్పుడు సంచిలోంచి బయటకొచ్చిన శ్వేతనాగు..ఒక్కసారిగా పడగ విప్పి చుట్టూ చూసుకుంటుంది. పరిసరాలను గమనించుకున్న తర్వాత అది అడవిలోని చెట్ల పొదల్లోకి పారిపోయింది.

నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోని నెటిజన్లు ఎంతగానో లైక్‌ చేస్తున్నారు. అరుదైన పాము కావటంతో ప్రజలు మళ్లి మళ్లీ చూస్తూ లైకులు, షేర్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో కొందరు కావాలనే ఈ వీడియోని వైరల్ గా మార్చారని అంటున్నారు. ఎందుకంటే.. ఈ వీడియో చాలా పాతది అని అంటున్నారు. ఏది ఏమైనా శ్వేతనాగు  అరుదైన వీడియో మాత్రం మరో మారు నెటిజన్లు ఆశ్చర్యపోయేలా చేస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు