వజ్రాలు ఎలా ఏర్పడతాయి..అవి భూమిపైకి ఎలా వచ్చాయి..? శాస్త్రవేత్తలు చెప్పిన అసలు రహస్యం..

వజ్రం ఎలా ఏర్పడుతుంది. దాని నిర్మాణం ఎలా ప్రారంభమవుతుంది? ఈ ప్రశ్న చాలా కాలంగా శాస్త్రవేత్తలలో చర్చనీయాంశంగా ఉంది. ఇప్పుడు ఈ ప్రశ్నకు శాస్త్రవేత్తలకు సమాధానం దొరికింది. ఇటీవలి పరిశోధనలో భూకంపాలకు కారణమయ్యే టెక్టోనిక్ ప్లేట్ విరిగిపోవడంతో వజ్రాల నిర్మాణం ప్రారంభమవుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బ్రిటన్‌లోని సౌతాంప్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. వజ్రం ఎలా తయారవుతుందో తెలుసుకోండి.

Jyothi Gadda

|

Updated on: Nov 13, 2023 | 2:15 PM

డైమండ్ అనేది కార్బన్  అణువులతో నిర్మితమై విలువైన వస్తువు. సాధారణ రాళ్ళ మాదిరిగా కాకుండా వజ్రాలలో కార్బన్ అణువులు క్యూబిక్ క్రిస్టల్ స్ట్రక్చర్ లాగా అమర్చబడి ఏర్పడుతాయి. వజ్రాలు భూమికి అత్యంత లోతులో భూమి పొరల్లో నుండి ఏర్పడతాయి. ఈ లోపలి ప్రదేశాన్ని ఎర్త్ మాంటిల్ అంటారు.

1 / 5
అగ్ని పర్వతాలు బద్దలైన చోట ఈ వజ్రాలు లావాతో పాటు పైకి ఎగజిమ్ముతాయి. అగ్నిపర్వతంలోని లావా చల్లారిన తరువాత గాలి,వర్షం, వరదల కారణంగా అవి నదులలోకి కొట్టుకొని పోతాయి. ఇలా వెళ్ళినవి నదుల్లో ఉండే రాళ్ళ మధ్యలో పేరుకుపోతుంటాయి.

2 / 5
అగ్నిపర్వతాలు బద్దలైన చోట తవ్వకాలు జరిపినప్పుడు వజ్రాలు లభించే అవకాశం ఉంది. అక్కడ పడివున్న రాళ్ళలో వజ్రాలు కనపడే అవకాశం ఉంటుంది.

3 / 5
ఎర్త్ మాంటిల్ లో ఉన్న కార్బన్ ఫ్లూయిడ్స్ అక్కడ ఉండే అధిక ఉష్ణోగ్రత, ఒత్తిడి కారణంగా వజ్రాలు ఏర్పడుతాయి. అయితే, వాస్తవానికి వజ్రాలకు రంగు ఉండదు.  కానీ వజ్రాలు ఏర్పడేటప్పుడు 10 లక్షల కార్బన్ అణువులతో 1 బోరాన్ తోడైతే ఆ వజ్రం నీలిరంగు వజ్రంగా తయారవుతుంది.

4 / 5
అదేవిధంగా10 లక్షల కార్బన్ అణువులతో  నైట్రోజన్ తోడైతే అప్పుడు పసుపురంగు వజ్రం ఏర్పడుతుంది. ఒకవేళ  వజ్రాలతో కార్బన్ అణువుల ఆకృతి సరిగ్గా ఏర్పడకపోతే ఆ వజ్రం గోధుమ రంగులోకి మారుతుంది. ఒకవేళ డైమండ్ పై రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటె అది ఆకు పచ్చ వజ్రంగా మారుతుంది.

5 / 5
Follow us