స్కూల్ ఎగ్గొట్టిన పోరడు.. ఎత్తుకపోయిన సార్
బడికి పోవాల్నంటే ఒక తిప్పలు వెట్టరు కొందరు పోరళ్లు. కడ్పు నొప్పి, కాల్నొప్పని తీరొక్క వొంక శెప్తరు. తినేటియి కొనిత్తేనే పోతమని మారం జేస్టోళ్లు కొందమందైతే.... రేపు బడెట్ల డుమ్మా కొట్టాల్నని గియ్యాల్నే సైంటిస్టు రేంజుల ప్లాన్లేసేటోళ్లు ఇంకొందరాయే. మరి శడ్డీలేస్కునే గీళ్లకే గిన్ని ప్లాన్లుంటే... సద్వు శెప్పేటోండ్లకి ఇంకెంతుండాలే....? బడి ఎగ్గొట్టి బైట గోలీలాడ్తుండట గీ మోతేవారి. ఇగ లాభం లేదనుకున్నడో ఏందో సద్వు శెప్పే సారే ఇగిట్ల సైన్యాన్ని ఏస్కపోయి రాజావార్ని గీ తీర్ల మోస్కోని తీస్కచ్చి బల్లే వడేశిండు .
బడికి పోవాల్నంటే ఒక తిప్పలు వెట్టరు కొందరు పోరళ్లు. కడ్పు నొప్పి, కాల్నొప్పని తీరొక్క వొంక శెప్తరు. తినేటియి కొనిత్తేనే పోతమని మారం జేస్టోళ్లు కొందమందైతే…. రేపు బడెట్ల డుమ్మా కొట్టాల్నని గియ్యాల్నే సైంటిస్టు రేంజుల ప్లాన్లేసేటోళ్లు ఇంకొందరాయే. మరి శడ్డీలేస్కునే గీళ్లకే గిన్ని ప్లాన్లుంటే… సద్వు శెప్పేటోండ్లకి ఇంకెంతుండాలే….? బడి ఎగ్గొట్టి బైట గోలీలాడ్తుండట గీ మోతేవారి. ఇగ లాభం లేదనుకున్నడో ఏందో సద్వు శెప్పే సారే ఇగిట్ల సైన్యాన్ని ఏస్కపోయి రాజావార్ని గీ తీర్ల మోస్కోని తీస్కచ్చి బల్లే వడేశిండు . నల్గురు వట్టుకోంగ నడిమిట్ల ఎట్ల సక్కగ గుడ్లెల్లవెట్టి సూస్తుండో సూడ్రి. పోరడు ఆటకు మర్గి బడికి రాకుంట భాగో అంటుండట.. వాని సాయితగాల్లను ఇంటికి పంపిస్తే శిక్కడు దొర్కడు టైపుల జాక్కోని తిర్గుతుండట.. ఇట్లైతే వీడు సరికొస్తలేడని సారే సైన్యాధ్యక్షుడి లెక్క బరిలకి దిగి పోరని దుంప తెంచిండు. ఓ సారో నీ దండం పెడ్తనే..నీ కాల్మోక్తనే బడి బట్టలేస్కోత్తా ఇడ్వుండ్రని ఎంత ఏడ్శినా అస్సలికే ఇనకుంట సీదా పట్కొచ్చి బడిల మొత్తిండు. యాడ జర్గిందో ఏందో గానీ సోషల్ మీడియల భూమికంటే స్పీడుగ తిర్గుతాంది వీడియో
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ayodhya Deepotsav 2023: ఒకేసారి 22.23 లక్షల దీపాలు వెలిగించి గిన్నీస్ బుక్ రికార్డ్స్ లో అయోధ్య
Assembly Elections: ఒక్క ఫ్యామిలీ కోసం స్పెషల్ పోలింగ్ బూత్
Viral Video: రోడ్డుపై వెళుతున్న కారును ఢీకొట్టిన విమానం
Virat Kohli: బెంగళూరులో విరాట్ అభిమానుల సందడి.. కోహ్లీకి 49 కటౌట్లు
ప్రపంచంలోని 20 హాటెస్ట్ నగరాల్లో 19 మనవే !!
మూడు పూటలా అన్నమే.. అయినా కండలు తిరిగిన దేహం..
లక్కీ డ్రా తీయండి.. కూరగాయలు ఉచితంగా పొందండి
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్
నా చీర లాగాడు !! నాసిక్ టీసీఎస్ ఉద్యోగిని ఆవేదన
లంచం తీసుకుంటూ పట్టుబడిన స్టేట్ టాపర్
సర్ప్రైజ్ గిఫ్ట్ అని పిలిచింది.. కుర్చీకి కట్టేసి మరీ.. అలా ఎలా ?

