Ayodhya Deepotsav 2023: ఒకేసారి 22.23 లక్షల దీపాలు వెలిగించి గిన్నీస్ బుక్ రికార్డ్స్ లో అయోధ్య
ఆహ.. కన్నుల పండుగాంటె ఎట్లుంటదంటె.. అయోధ్యల జరిగిన దీపోత్సవం లెక్కుంటది అని జెప్పాల్నేమొ.. అవ్వుల్లా.. సరయూ నది ఘాట్ల మీద 22 లక్షల దీపాలు ఎలిగిచ్చి, గిన్నీస్ రికాడే కొట్టిర్రు యూపీ సర్కారోల్లు.. మాటలతోని చెప్పుడుగాదు.. సూస్తందుకు రొండు కండ్లు సరిపోవు.. అట్ల నడ్శిందా దీపోత్సవం.. సూడుర్రీ ఎట్లన్పిస్తుందో.. ? ఎటు సూశినా దీపాలే దీపాలు.. మొత్తం 22 లక్షల దీపాలు.. అయోద్య సరయూ నది ఒడ్డుకున్న ఘాట్లమీద వెట్టిచ్చిర్రు అక్కడి సర్కారోల్లు.. ఇట్ల వెట్టిచ్చుడు కొత్త ముచ్చటేంగాదు.
ఆహ.. కన్నుల పండుగాంటె ఎట్లుంటదంటె.. అయోధ్యల జరిగిన దీపోత్సవం లెక్కుంటది అని జెప్పాల్నేమొ.. అవ్వుల్లా.. సరయూ నది ఘాట్ల మీద 22 లక్షల దీపాలు ఎలిగిచ్చి, గిన్నీస్ రికాడే కొట్టిర్రు యూపీ సర్కారోల్లు.. మాటలతోని చెప్పుడుగాదు.. సూస్తందుకు రొండు కండ్లు సరిపోవు.. అట్ల నడ్శిందా దీపోత్సవం.. సూడుర్రీ ఎట్లన్పిస్తుందో.. ? ఎటు సూశినా దీపాలే దీపాలు.. మొత్తం 22 లక్షల దీపాలు.. అయోద్య సరయూ నది ఒడ్డుకున్న ఘాట్లమీద వెట్టిచ్చిర్రు అక్కడి సర్కారోల్లు.. ఇట్ల వెట్టిచ్చుడు కొత్త ముచ్చటేంగాదు.. 2017 కేలి వర్సగ ఇది ఏడోసారి.. అయితె ఫస్టు 71 వేల దీపాలతోని షురువై.. ఈతాపకు 22 లక్షలకు చేరింది.. మరి ఇన్నేశి లక్షల దీపాలను ఎట్ల ఎలిగిచ్చిర్రూ అనంటె.. మన శివరాత్రప్పుడుగన్క కోటి దీపోత్సవమని జరుగుతది సూడూ.. అగొ అట్లనే.. మొత్తం 25 వేల మంది స్కూలు, కాలేజీ స్టూడెంట్ వలంటీర్లు పాల్వంచుకున్నరట ఈ దీపోత్సవంల.. శనివారం పొద్దుగాల పదిగంట్లకు దీపంతలు జమాయించుడు, అవిట్ల నూనెవోసుడు షురువుజేస్తె.. పొద్దీకంగ దీపాలంటవెట్టిర్రన్నట్టు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Assembly Elections: ఒక్క ఫ్యామిలీ కోసం స్పెషల్ పోలింగ్ బూత్
Viral Video: రోడ్డుపై వెళుతున్న కారును ఢీకొట్టిన విమానం
Virat Kohli: బెంగళూరులో విరాట్ అభిమానుల సందడి.. కోహ్లీకి 49 కటౌట్లు