Viral Video: రోడ్డుపై వెళుతున్న కారును ఢీకొట్టిన విమానం
ఓయమ్మో.. ఇదెక్కడి ఇచ్చంత్రంరో.. కారును ఇమానం గుద్దిందుల్లా.. ఇదేందయ్యా ఇది... గాల్లవొయ్యేటి ఇమానం, రోడ్ల మీన నడ్శేటి కారునెట్ల తల్గుతది అన్పిస్తుందితలే... అవ్ మళ్లా అమెరికాల అట్లనే ఐంది. వార్ని గాల్లకెళ్లొచ్చి రోడ్డుమీన వొయేటి కారును ఎట్ల గుద్దుకుందో సూడుర్రీ గాలిమోటరు? డ్రైవరు కొత్త పోరడట.. ఇగ ఇదేమొ ప్యాసెంజర్లను తిప్పే గాలిమోటర్ కాదు.. ట్రైనింగ్ల ఉన్నోల్లు నడ్పు బుడ్డ ఇమానమన్నట్టు... అమెర్కా టెక్సాసు రాష్టంలున్న మెగ్గిన్నే కాడైంది గీ యాక్సిడెంటు.
ఓయమ్మో.. ఇదెక్కడి ఇచ్చంత్రంరో.. కారును ఇమానం గుద్దిందుల్లా.. ఇదేందయ్యా ఇది… గాల్లవొయ్యేటి ఇమానం, రోడ్ల మీన నడ్శేటి కారునెట్ల తల్గుతది అన్పిస్తుందితలే… అవ్ మళ్లా అమెరికాల అట్లనే ఐంది. వార్ని గాల్లకెళ్లొచ్చి రోడ్డుమీన వొయేటి కారును ఎట్ల గుద్దుకుందో సూడుర్రీ గాలిమోటరు? డ్రైవరు కొత్త పోరడట.. ఇగ ఇదేమొ ప్యాసెంజర్లను తిప్పే గాలిమోటర్ కాదు.. ట్రైనింగ్ల ఉన్నోల్లు నడ్పు బుడ్డ ఇమానమన్నట్టు… అమెర్కా టెక్సాసు రాష్టంలున్న మెగ్గిన్నే కాడైంది గీ యాక్సిడెంటు. పక్కపొంటి ఓ సీనియరు సార్ని వెట్టుకుని పోయేతప్పుడు మంచిగ్నే గాల్లకి లేపిండు. గాల్లకి పోంగ నడిమిట్ల ఏమైందో ఏమో… ఎమర్జెన్సీ ల్యాండింగు జేయవల్సచ్చింది. రన్‌వే మీన మంచిగనే దిగినట్లు దిగి పక్కపొంటున్న ఇన్పకంచెను గుద్దుకుంటవొయ్ రోడ్లు మీన వోతన్న కారుకు టక్కరైంది ఇమానం. ఎవళ్లకేం కాలేదటగనీ ఇమానం, కారు గట్టిగనే డ్యామేజైనయ్. ఓ లెక్కకు కారుకంటె ఎక్వ గాలిమోటరే డ్యామేజైంది. సూడర్రీ గమ్మతెట్లుందో? రోడ్ల మీద ముంగటేమస్తందో.. ఎన్కేమస్తుందో సూస్కుంట నడ్పత్తదిగనీ.. మొగులు మీదికేలి ఏ గాలిమోటరచ్చి గుద్దుతది.. ఏ గాలిమోటర్ నడ్పేటోడు పర్ఫెక్టు.. ఎవలు ఎల్ బోర్డువెట్కోని ట్రేనింగ్ తీస్కునే పైలెట్లన్న ముచ్చట ఎట్ల సూస్కోవత్తదుల్లా.. దీన్నే గావచ్చు.. గాశారం అనేది.. కదా?
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Virat Kohli: బెంగళూరులో విరాట్ అభిమానుల సందడి.. కోహ్లీకి 49 కటౌట్లు
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

