Pista Pappu Benefits: రోజుకు ప‌ది పిస్తా పప్పులు తింటే ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా..? ఖరీదైనా వదులుకోరు..!

డయాబెటిక్ రోగులకు బెస్ట్ డైట్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పిస్తాపప్పు తినడం వల్ల అనేక హృదయనాళ ప్రయోజనాలు లభిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. పిస్తాలు రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి.

Pista Pappu Benefits: రోజుకు ప‌ది పిస్తా పప్పులు తింటే ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా..? ఖరీదైనా వదులుకోరు..!
పిస్తాపప్పు: పిస్తాపప్పులు అన్ని రకాల డ్రైనట్స్ కంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైనవి. ఈ కారణంగానే పిస్తాపప్పుల ధర మిగిలినవాటి కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక పిస్తా విషయానికి వస్తే దీనిలోని పోషకాల కారణంగా రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలోఉంటాయి. కొలెస్ట్రాల్ అదుపులో ఉండి, గుండె జబ్బుల సమస్య తగ్గుతుంది. 
Follow us

|

Updated on: Nov 14, 2023 | 9:27 AM

పిస్తా అత్యంత పోషకమైన డ్రై ఫ్రూట్. రోజూ పిస్తాపప్పు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. ఇందులో శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్లు వంటి చాలా పోషకాలు ఉంటాయి. ఇందులో బీటా కెరోటిన్, డైటరీ ఫైబర్, ఫాస్పరస్, ప్రొటీన్, ఫోలేట్, థయామిన్, కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం, కాపర్, పొటాషియం, విటమిన్ ఎ, బి6 మరియు విటమిన్ కె కూడా ఉన్నాయి. కంటి ఆరోగ్యానికి అవసరమైన లుటిన్, జియాక్సంతిన్ అనే యాంటీఆక్సిడెంట్లు పిస్తాపప్పులో పుష్కలంగా ఉన్నాయి. అమెరికన్ ఆప్టోమెట్రిక్ అసోసియేషన్ ప్రకారం, లుటీన్, జియాక్సంతిన్ కంటిశుక్లం వంటి దీర్ఘకాలిక కంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వయస్సు-సంబంధిత మచ్చల క్షీణత (AMD) నుండి రక్షించడంలో కూడా ఇవి ఎంతగానో సహాయపడతాయి.

పిస్తాలు మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పిస్తాపప్పులో ఉండే విటమిన్ బి6 రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణాన్ని పెంచడానికి సహాయపడుతుంది. అన్ని గింజలలో ఫైబర్ ఉంటుంది. ఇది పేగుల ద్వారా ఆహారాన్ని తరలించడం, మలబద్ధకాన్ని నివారించడం ద్వారా ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను ప్రోత్సహిస్తుంది. ప్రీబయోటిక్స్ అని పిలువబడే ఒక రకమైన ఫైబర్ గట్‌లోని మంచి బ్యాక్టీరియాను ఫీడ్ చేస్తుంది. గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.

పిస్తాలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. దాంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఫెనోలిక్ కాంపౌండ్, కెరోటినాయిడ్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. డయాబెటిక్ రోగులకు బెస్ట్ డైట్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇవి కూడా చదవండి

పిస్తాపప్పు తినడం వల్ల అనేక హృదయనాళ ప్రయోజనాలు లభిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. పిస్తాలు రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి.

పిస్తాపప్పులో ఉండే విటమిన్ ఇ చర్మం వయసు పెరిగే కొద్దీ యవ్వనంగా ఉండేలా చేస్తుంది. పురుషులలో అంగస్తంభన సమస్యలను పరిష్కరించడంలో పిస్తాపప్పులు బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా.. పిస్తాలు పెద్దప్రేగు క్యాన్సర్ వంటి కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన పిస్తా పప్పును ప్రతి రోజూ గుప్పెడు తీసుకోవాలని చెబుతున్నారు.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..